Mars Margi 2023: 10 రోజుల తర్వాత కుజుడు కదలికలో మార్పు.. వీరికి గుడ్ టైమ్ స్టార్ట్..

Mars Margi In Taurus 2023: గ్రహాల కమాండరైన కుజుడు వృషభరాశిలో సంచరించనున్నాడు. దీంతో 3 రాశుల వారికి మంచి రోజులు మొదలవుతాయి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 3, 2023, 11:41 AM IST
Mars Margi 2023: 10 రోజుల తర్వాత కుజుడు కదలికలో మార్పు.. వీరికి గుడ్ టైమ్ స్టార్ట్..

Mangal Planet Margi In January 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలు ఎప్పటికప్పుడు తమ రాశులను మారుస్తాయి. జనవరి 13న గ్రహాల కమాండర్ అయిన మంగళదేవుడు వృషభరాశిలో ప్రత్యక్ష సంచారంలోకి రానున్నాడు. మార్స్ యెుక్క ప్రత్యక్ష కదలిక (Mars Margi 2023) ప్రభావం ప్రజలందరిపై ఉంటుంది. మార్స్ మార్గి కారణంగా మూడు రాశులవారు అపారమైన ప్రయోజనాలను పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 

కన్య రాశిచక్రం (Virgo): కన్యా రాశి వారికి అంగారకుడి సంచారం శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే కుజుడు మీ రాశి నుండి తొమ్మిదవ ఇంట్లో మార్పు చెందబోతున్నాడు. మీకు డబ్బు సమస్య తీరిపోతుంది. మీరు దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఇంట్లో మీరు శుభకార్యం చేసే అవకాశం ఉంది. 

మేష రాశిచక్రం (Aries): మార్స్ మార్గం డబ్బు పరంగా మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే మీ సంచార జాతకంలో రెండవ ఇంట్లో కుజుడు అస్థిరంగా ఉండబోతున్నాడు. దీంతో మీరు ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది.  ఉద్యోగ, వ్యాపారాల్లో మీరు విజయం సాధించే అవకాశం ఉంది. 

వృషభ రాశి (Taurus): అంగారకుడి సంచారం వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మీ సంచార జాతకానికి చెందిన లగ్న గృహంలో కుజుడు తాత్కాలికంగా ఉండబోతున్నాడు. మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. ఆఫీసులో మీకు ప్రతిష్ట, గౌరవం పెరుగుతాయి. పెళ్లికాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామితో మంచి బంధాన్ని కలిగి ఉంటారు. 

Also Read: Shani Dev: జనవరి 16 వరకు మకరంలో శనిదేవుడు.. ఈ 3 రాశులపై నోట్ల వర్షం కురవడం ఖాయం.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U   

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Trending News