Marilia Mendonca: బ్రెజిల్​లో కుప్ప కూలిన ప్రైవేట్ జెట్​- ప్రముఖ పాప్​ సింగర్ దుర్మరణం!

Brazil Plane Crash: బ్రెజిల్​లో శుక్రవారం (బ్రెజిల్ కాలమానం ప్రకారం) ఓ ప్రైవేటు జెట్​ కుప్ప కూలింది. ఈ ప్రమాదంలో పాప్​ సింగర్ మారిలియా మెండోన్సా సహా 5 మంది ప్రాణాలు కోల్పోయారు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 6, 2021, 12:26 PM IST
  • బ్రెజిల్​లో కుప్ప కూలిన ప్రైవేట్​ జెట్​
  • ప్రమాదంలో పాప్​ సింగర్ సహా 5 మంది మృతి
  • అధికారికంగా వెల్లడి కాని ప్రమాదపు కారణాలు
Marilia Mendonca: బ్రెజిల్​లో కుప్ప కూలిన ప్రైవేట్ జెట్​- ప్రముఖ పాప్​ సింగర్ దుర్మరణం!

Marilia Mendonca: బ్రెజిల్​కు చెందిన యువ పాప్‌ సింగర్ మారిలియా మెండోన్సా.. శుక్రవారం జరిగిగిన ఓ విమాన ప్రమాదంలో (Marilia Mendonca Dies in Plan crash) మృత్యువాత పడ్డారు. అమె వయసు 26 సంవత్సరాలు. గెరైస్ రాష్ట్రంలోని కరాటింగాలో మారిలియా మెండోన్సా ఆమె ప్రయాణిస్తున్న ఛార్టెడ్​ ఫ్లయిట్​ (Plane Crash in Brazil) కూలి పోయింది.

ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న..  ఇద్దరు పైలట్లు సహా మరో ఇద్దరు మోడోన్సా సిబ్బంది కూడా ప్రాణాలు (Brazil Plane Crash Death Toll) కోల్పోయారు. అయితే వారికి సంబంధించిన వివరాలు మాత్రం ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు.

విమానం కూలిపోయేందుకు కారణాలు ఏంటనేది కూడా ఇంకా తెలియరాలేదు. విమానం కూలిపోయే సమయంలో ఓ విద్యుత్ టవర్​ను ఢీ కొట్టిందని.. దీని వల్ల ప్రమాద తీవ్రత పెరిగినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.

Also read: Mumbai Cruise Drug Case: ఆర్యన్ ఖాన్ కేసు విచారణ నుంచి వాంఖడేను తొలగించిన ఎన్సీబీ

Also read: Edible oil prices: కేంద్రం నుంచి Good news.. వంట నూనేల ధరలు తగ్గించిన కేంద్రం

పూర్తి వివరాల్లోకి వెళితే..

మారిలియా మెండోన్సా.. ఓ ప్రదర్శన కోసం.. ఛార్జెట్​ ఫ్లయిట్​లో శుక్రవారం బయల్దేరారు. దీనికి  సంబందించి ఆమ తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ (Marilia Mendonc last post on Twitter)​ కూడా చేశారు. ఎంతో ఉత్సాహంగా.. అమె తరువాతి ప్రోగ్రాం కోసం సిద్ధమై వెళ్లారు. కానీ అంతలోనే మృత్యువు ఆమెను విమాన ప్రమాద రూపంలో కబలించింది. 26 ఏళ్లకే పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాధించుకున్న మెండోన్సా.. వారందరికి తీరలని లోటును మిగిల్చారు. ఇప్పుడామె లాస్ట్ ట్వీట్​ వైరల్​గా మారింది.

Also read: Yemen Clashes: యెమెన్​లో ఆగని ఘర్షణలు...200 మంది మృతి!

Also read: Covid First Pill: కోవిడ్ నివారణకు ట్యాబ్లెట్ వచ్చింది

మారిలియా మెండోన్సా గురించి..

మారిలియా మెండోన్సా 1995 జులై 22న జన్మించారు. 2011లో అమె సింగర్​గా పరిచయమయ్యారు. 2019లో ప్రతిష్టాత్మకమైన లాటిన్​ గ్రామీ పురస్కారాన్ని అందుకున్నారు మారిలియా. పాప్​ సింగర్స్ దీన్ని అత్యున్నత పురస్కారంగా భావిస్తారు.

ఎమ్ టోడోస్ ఓస్ కాంటోస్, పాట్రోయాస్ వంటి ఆల్పమ్​లతో మెండ్సోనా.. ప్రసిద్ధి చెందారు. ఆమె పాటలు ఎక్కువగా మహిళా సాధికారత గురించే ఉండేవి.

Also read: Covaxin Vaccine For Children: అమెరికాలోని చిన్నారులకూ కొవాగ్జిన్ టీకా.. త్వరలోనే అత్యవసర వినియోగానికి అనుమతి

Also read: Pfizer antiviral pill: కరోనాతో మరణం ముప్పును 89 శాతం తగ్గిస్తున్న ఫైజర్ ఔషధం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News