Negative Energy In Your Home: మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ తిష్ట వేసుకూర్చుందా ? దాన్నిలా తరిమేయండి

How To Remove Negative Energy From Your Home: మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ తిష్ట వేసుకుని కూర్చుందా ? మీరు ఏం చేసినా, ఏం చేయాలనుకున్నా కాలం కలిసి రావడం లేదా ? ఏదో తెలియని శక్తి మిమ్మల్ని వెనక్కి పట్టి లాగుతోందా ? కంటికి కనిపించని దుష్టశక్తి ఏదో మీ పాజిటివ్ ఎనర్జీని హరిస్తోందా ? మిమ్మల్ని అడుగడుగునా డిస్టర్బ్ చేస్తోందా ?

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 14, 2023, 03:06 AM IST
Negative Energy In Your Home: మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ తిష్ట వేసుకూర్చుందా ? దాన్నిలా తరిమేయండి

How To Remove Negative Energy From Your Home: మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ తిష్ట వేసుకుని కూర్చుందా ? మీరు ఏం చేసినా, ఏం చేయాలనుకున్నా కాలం కలిసి రావడం లేదా ? ఏదో తెలియని శక్తి మిమ్మల్ని వెనక్కి పట్టి లాగుతోందా ? కంటికి కనిపించని దుష్టశక్తి ఏదో మీ పాజిటివ్ ఎనర్జీని హరిస్తోందా ? మిమ్మల్ని అడుగడుగునా డిస్టర్బ్ చేస్తోందా ? అయితే, ఆ నెగటివ్ ఎనర్జీని ఇలా ఇంట్లోంచి బయటికి తన్ని తరిమేయండి

మీ ఇంట్లో విండ్ చైమ్స్‌ని వేళ్లాడదీయండి. అవి గాలికి కదిలినప్పుడు వచ్చే శబ్ధ తరంగాలు మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని బయటికి తరమేస్తాయి. 

మీ ఇంటి మూలల్లో ఉప్పును చల్లితే అది మీ ఇంట్లోని దుష్ట శక్తిని పారదోలుతుంది అనే ఒక నమ్మకం ఉంది. అలాగే చిటికెడంత సముద్రం ఉప్పును తీసుకుని మీ ఇంటి ద్వారం వద్ద ఒక గుడ్డలో కట్టిపెట్టడం కానీ లేదా డోర్ మ్యాట్ కింద కానీ పెట్టినట్టయితే, దుష్ట శక్తి మీ ఇంట్లోకే రాకుండా అడ్డుకుంటుంది.

ఇంట్లో సరైన వెలుతురు ఉండేలా చూసుకోండి. అలాగే వెలుతురుని ప్రసరించే కర్టెన్స్ ఉపయోగించండి. ఏ గదిలోనైతే పుష్కలంగా వెలుతురు ఉంటుందో.. ఆ గదిలోకి దుష్ట శక్తులు ప్రవేశించలేవట.

మీ ఇంట్లోని ఫర్నిచర్‌ని అప్పుడప్పుడు రిఅరేంజ్ చేస్తూ ఉండండి. హోమ్ ఇంటీరియర్స్ కూడా ఎప్పుడూ ఒకేలా ఉండకుండా అప్పుడప్పుడు మారుస్తూ ఉండండి. అలాగే ఏదైనా విరిగిపోయిన హస్తకళా వస్తువులు ఇంట్లో ఉంటే వాటిని అక్కడి నుంచి తొలగించండి. ఎందుకంటే వాటికి పాజిటివ్ ఎనర్జీని తొక్కిపెట్టే ఎనర్జీ ఉంటుందట.

ఇంట్లోకి బయటి నుంచి గాలి, వెలుతురు ప్రసరించేలా సరైన వెంటిలేషన్ ఉండాలి. ఏ గదిలోనూ చీకటి లేకుండా చూసుకోండి. మూసి ఉంచిన కిటికీలను తరుచుగా తెరుస్తూ ఉండండి. వాటి ద్వారా మీ ఇంట్లోకి ప్రసరించే ఫ్రెష్ ఎయిర్ మీ శక్తిని పెంచేలా చేస్తుంది.

అగరొత్తులు కాల్చడం వల్ల వచ్చే సువాసన మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెరిగేలా చేస్తుంది. అలాగే రూమ్ ఫ్రెషెనర్స్ సైతం మీలో పాజిటివ్ ఎనర్జీని పెరిగేలా చేస్తాయట.

ఇంట్లో బట్టలు ఎక్కడపడితే అక్కడ చిందర వందరగా పడేసే అలవాటు మంచిది కాదు. అలా చేయడం వల్ల ఏర్పడే చికాకు నెగటివ్ ఎనర్జీకి కారణం అవుతుంది. అందుకే ఇంట్లోని దుస్తులను ఒక పద్ధతిలో సర్దుకోండి. అది మిమ్మల్ని మానసికంగా ప్రశాంతంగా ఉంచడంతో పాటు పాజిటివ్ ఎనర్జీ పెరిగేందుకు ఉపయోగపడుతుంది.

Trending News