కార్తీక సోమవారం నవంబర్ 22న మీ రాశి ఫలాలు ఇలా, ఇదే మీ లక్కీ టైమ్ కూడా

గ్రహాలు కదలికలు..రాశులను బట్టి మీ జాతకం ఎలా ఉందో చెప్పేదే జ్యోతిష శాస్త్రం. చాలామందికి జ్యోతిష శాస్త్రంపై నమ్మకముంటుంది. ప్రతిరోజూ తమ జాతకం ఎలా ఉంటుందో అనే ఆసక్తి ఉంటుంది.  ఈ క్రమంలో కార్తీక మాసంలోని సోమవారం అంటే ఇవాళ రాశి ఫలాలు తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 22, 2021, 06:27 AM IST
కార్తీక సోమవారం నవంబర్ 22న మీ రాశి ఫలాలు ఇలా, ఇదే మీ లక్కీ టైమ్ కూడా

గ్రహాలు కదలికలు..రాశులను బట్టి మీ జాతకం ఎలా ఉందో చెప్పేదే జ్యోతిష శాస్త్రం. చాలామందికి జ్యోతిష శాస్త్రంపై నమ్మకముంటుంది. ప్రతిరోజూ తమ జాతకం ఎలా ఉంటుందో అనే ఆసక్తి ఉంటుంది.  ఈ క్రమంలో కార్తీక మాసంలోని సోమవారం అంటే ఇవాళ రాశి ఫలాలు తెలుసుకుందాం.

మేషరాశి : ఈ రాశివారికి ఈ వారమతా పనుల విషయంలో బాగుంటుంది. పనులన్నింటినీ ఉత్సాహంతో, అంకితభావంతో పూర్తి చేస్తారు. ఆర్ధిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. తల్లిదండ్రులతో ఎక్కువ సమయం గడుపుతారు. ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఈ రాశివారి లక్కీ టైమ్ సాయంత్రం 6 గంటల్నించి రాత్రి 9 గంటల 15 నిమిషాలవరకూ ఉంటుంది.

వృషభరాశి : వృషభరాశిలో పుట్టినవారికి ఆరోగ్య విషయంలో ప్రతికూల పరిస్థితులుంటాయి. తరచూ తలనొప్పి, అలసట, నిద్రపట్టకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఎక్కువగా ఒత్తిడి తీసుకోకుండా ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉంటే మంచిది. డబ్బుల విషయంలో గానీ, జీవిత భాగస్వామి విషయంలో గానీ ఏ విధమైన సమస్యలుండవు. వ్యాపారస్థులకైతే ఫలితం మిశ్రమంగా ఉంటుంది. ఈ రాశివారి లక్కీ టైమ్  మధ్యాహ్నం 2 గంటల 15 నుంచి రాత్రి 10 గంటల 10 నిమిషాలవరకూ ఉంటుంది.

మిధున రాశి : ఇవాళ మీ వైవాహిక జీవితంలో ఆందోళన నెలకొంటుంది. జీవిత భాగస్వాముల మధ్య దూరం పెరిగే అవకాశమున్నందున కాస్త జాగ్రత్తగా, తెలివిగా ఉంటే మంచిది. మీరు తీసుకున్న ఓ తప్పుడు నిర్ణయం మొత్తం కుటుంబంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. అయితే ఆర్ధికపరంగా కూడా బాగుండదు. ఉద్యోగులైతే పదోన్నతి వార్తలు వింటారు. ఈ రాశివారికి లక్కీ టైమ్ మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు ఉంది.

కర్కాటక రాశి : ఈ రాశి వారికి కుటుంబ జీవితంలో పూర్తిగా ఆనందం, ప్రశాంతత ఉంటుంది. కుటుంబ సభ్యులతో కూడా ఎక్కువ సమయం గడుపుతారు. ఆరోగ్యపరంగా మాత్రం జాగ్రత్తగా ఉంటే మంచిది. వ్యాపార సంబంఘ వ్యక్తులకు సవాళ్లు ఎదురుకావచ్చు. చేసే పనిని పూర్తి అంకితభావంతో చేసేందుకు ప్రయత్నించండి. ఈ రాశివారి లక్కీటైమ్ ఉదయం 6 గంటల 45 నుంచి ఉదయం 10 గంటల 25 నిమిషాల వరకూ ఉంది.

సింహ రాశి : ఈ రాశి వారికి ఇవాళ్టి ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. కుటుంబ ఆర్ధిక పరిస్థితి చాలా బాగుంటుంది. అయితే ఆరోగ్యం క్షీణించే పరిస్థితి ఉన్నందున జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్థులకైతే మంచి ఆఫర్ వచ్చే అవకాశాలున్నాయి. కుటుంబ జీవితం చాలా బాగుంటుంది. ముఖ్యమైన పనుల్లో ఇబ్బందులు ఎదురుకావచ్చు.  ఈ రాశివారి లక్కీ టైమ్ సాయంత్రం 4 గంటల 5 నిమిషాల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంది.

కన్య రాశి : ఈ రాశి వారికి ఇవాళ ఆర్ధికంగా బాగుంటుంది. కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుంది. కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగానే ఉంటాయి. ఏ విధమైన సమస్యలుండవు. అయితే ఆరోగ్య విషంయలో అప్రమత్తంగా ఉంటే మంచిది. చేయాల్సిన పనులన్నింటినీ ఓ ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలి. ఈ రాశివారికి ఉదయం 8 గంటల 40 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకూ ఉంది.

తుల రాశి : ఈ రాశి వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. లేకుంటే సమస్య తీవ్రం కావచ్చు. జీవిత భాగస్వామితో విభేధాలు రావచ్చు. అందుకే సామరస్యంగా ఉంటూ సమస్య పరిష్కరించేందుకు ప్రయత్నించండి. ఆర్ధికపరంగా మాత్రం ఇవాళ బాగుంటుంది. చేయాల్సిన పనులు సక్రమంగా పూర్తి కావు. ఈ రాశివారికి లక్కీ టైమ్ మద్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుంచి సాయంత్రం 7 గంటల వరకూ ఉంది. 

వృశ్చిక రాశి : ఈ రాశి వారికి ఆరోగ్య విషయంలో ఏ విధమైన సమస్యలు ఎదురుకావు. ఆర్ధికపరంగా చాలా బాగుంటుంది. చిన్న విషయాల్ని పట్టించుకోకుండా  కోపాన్ని నిగ్రహించుకుంటే వైవాహిక జీవితంలో బాగుంటుంది. లేకపోతే సమస్యలు ఎదురుకావచ్చు. చేయాల్సిన పనులకు ఎక్కువ సమయం పట్టవచ్చు. ఈ రాశివారి లక్కీటైమ్ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలవరకూ ఉంది.

ధనస్సు రాశి : ఈ రాశి వారికి ఇవాళ ఆర్ధికంగా ఆందోళన ఉంటుంది. తప్పుడు మార్గంలో సంపాదన ఆలోచనలుంటే విరమించుకోవడం మంచిది. లేకుంటే ప్రతికూల పరిస్థితులుంటాయి. జీవిత భాగస్వామితో సంబంధాలు బాగుంటాయి. ఆరోగ్యపరంగా బాగుంటుంది. ఆస్థి విక్రయించాలనుకుంటే మాత్రం ఇవాళ మంచిరోజు. ఈ రాశివారి లక్కీ టైమ్ ఉదయం 7 గంటల 55 నిమిషాల నుంచి 10 గంటల 30 నిమిషాలవరకూ ఉంది.

మకర రాశి : ఈ రాశివారి ఆర్ధికంగా చాలా బాగుంటుంది. ఆదాయం విషయంలో కొత్త మార్గాలు కూడా ఏర్పడతాయి. ఇంట్లో తల్లి ఆరోగ్యం బాగుండదు. ప్రభుత్వ ఉద్యోగులతై ఆకస్మిక బదిలీలుంటాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో న్యాయపరమైన విషయాల్లో జాగ్రత్త వహించాలి. ఆరోగ్యం బాగుంటుంది. ఈ రాశివారి లక్కీ టైమ్ మధ్యాహ్నం 1 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంది.

కుంభ రాశి : ఈ రాశివారు ముఖ్యమైన నిర్ణయాల విషయంలో జాగ్రత్త వహించాలి. ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయాల్సి ఉంటుంది. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగానే ఉంటాయి. ఇంటి పెద్దల మార్గదర్శకత్వం ఉంటుంది. ఈ రాశివారి లక్కీ టైమ్ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట 20 నిమిషాల వరకూ ఉంది.

మీన రాశి : ఈ రాశివారికి పూర్తిగా మిశ్రమ ఫలితాలుంటాయి. ఆరోగ్య విషయంలో సమస్యలు తప్పవు. అయితే ఆర్ధికంగా మాత్రం బాగుంటుంది. చిన్న చిన్న విషయాలకు కోపం తెచ్చుకోకుండా ఉంటే మంచిది. పనిపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఈ రాశివారి లక్కీ టైమ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలవరకూ ఉంది.

Also read: నవంబర్ 21న మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి, ఆ రాశిలో ఇబ్బందులే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News