Horoscope Today July 30th 2022: ఇవాళ శనివారం. శనీశ్వరుడికి అంకితం చేయబడిన రోజు. శనివారం నాడు శనిదేవుడిని పూజించడం లేదా హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా శని అనుగ్రహం పొందవచ్చు. మరి ఈ శనివారం ఏయే రాశుల వారి జాతక ఫలం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..
మేష రాశి (Aries)
ఇవాళ మీకు కలిసిరాదు. పాత అనారోగ్య సమస్యలు మళ్లీ బాధిస్తాయి. అది మిమ్మల్ని మానసికంగా కుంగదీస్తుంది. కొన్ని కీలక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. అందులో తప్పులు దొర్లుతాయి. ఆ కారణంగా మరింత గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టబడుతారు. ఏ నిర్ణయం తీసుకునే ముందైనా ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. డబ్బును ఎలా పడితే అలా ఖర్చు చేయకండి.
వృషభ రాశి (Taurus)
చంద్ర అనుగ్రహం సిద్ధిస్తుంది. అది మిమ్మల్ని సంతోషంగా గడిపేలా చేస్తుంది. పాత పెట్టుబడులు లాభాలను తీసుకొస్తాయి. ఆర్థిక పురోగతి గతం కన్నా మెరుగవుతుంది. మీ ఆదాయానికి తగినట్లే ఖర్చులూ ఉంటాయి. తెలిసినవారు, కష్టాల్లో ఉన్నవారు మీ ముందు చేయి చాచే అవకాశం ఉంది. సాయం చేసే విషయంలో మీరు వెనుకాడకపోవచ్చు. కొన్ని సత్వర నిర్ణయాల విషయంలో కుటుంబ సభ్యుల సలహా తీసుకోవడం మంచిది.
మిథున రాశి (GEMINI)
ఇవాళ మీ పనిలో చాలా బిజీగా గడుపుతారు. మీకున్న నెట్‌వర్క్‌తో మీకు అప్పగించిన టాస్క్ మరింత సులువుగా పూర్తి చేస్తారు. మీ తెలివితేటలు, పనితీరు అందరినీ ఆకట్టుకుంటాయి. ఉద్యోగ రీత్యా తగిన గుర్తింపు లభిస్తుంది. మీ ప్రతిభకు సరైన గుర్తింపు దక్కనిపక్షంలో జాబ్ మారే ఆలోచన చేస్తారు. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. ప్రేమికులకు అనుకూల సమయం.
కర్కాటక రాశి (Cancer)
చంద్రుడి అనుగ్రహం మీపై ఉంటుంది. అది మిమ్మల్ని సంతోషంగా ఉండేలా చేస్తుంది. గత వారం నుంచి వెంటాడుతున్న బాధలు సమసిపోతాయి. మీ కష్టం వృథాగా పోదు. పెండింగ్ పనులను సైతం చకచకా పూర్తి చేసేస్తారు. వ్యాపారస్తులకు అనుకూల సమయం. ఇవాళ మంచి లాభాలు పొందుతారు. ఆర్థిక పురోగతి బాగుంటుంది.
సింహ రాశి (LEO)
ఇవాళ మీకు కలిసిరాకపోవచ్చు. రోజంతా నిరాశజనకంగా గడుస్తుంది. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపార రంగంలో అడుగుపెట్టాలనుకునేవారు కాస్త ఓపిక పడితే మంచిది. ఇప్పటికిప్పుడు కొత్త వెంచర్స్ జోలికి వెళ్లవద్దు. లేనిపక్షంలో ఆర్థికంగా భారీ మూల్యం తప్పకపోవచ్చు. అది మిమ్మల్ని నష్టాల్లో కూరుకుపోయేలా చేస్తుంది. సాయంత్రం సమయంలో రావిచెట్టు వద్ద నెయ్యి దీపం వెలిగిస్తే నెగటివిటీ తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది.
కన్య రాశి (Virgo)
మీలో ఉత్సాహం ఉరకలేస్తుంది. మీరు చేపట్టిన ప్రాజెక్టు చకచకా ముందుకు సాగుతుంది. పార్ట్నర్స్ సహాయంతో వ్యాపారంలో కొత్త ఆవిష్కరణలు చేస్తారు. అయితే పార్ట్నర్తో కలిసి కొత్త వెంచర్స్‌లో పెట్టుబడులు పెట్టవద్దు. సొంతంగానే పెట్టుబడులు పెట్టడం మంచిది. ప్రేమ జంటలు ఊహాలోకంలో విహరించడం మాని వాస్తవ పరిస్థితులను తెలుసుకుంటే మంచిది.
తులా రాశి (Libra)
చంద్ర అనుగ్రహంతో సంతోషంగా గడుపుతారు. అనారోగ్య సమస్యలు నయమవుతాయి. మీకు రాకుండా ఇతరుల వద్ద నిలిచిపోయిన డబ్బు ఎట్టకేలకు అందుతుంది. ఇల్లు లేదా వాహన కొనుగోలు కోసం రుణం పొందే అవకాశం ఉంది. ఇంటి కోసం కొన్ని కళాకృతులు కూడా కొనుగోలు చేస్తారు. మునుపటికన్నా ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది.
వృశ్చిక రాశి (Scorpio)
మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. వచ్చిన అవకాశాన్ని వచ్చినట్లు సద్వినియోగం చేసుకుంటారు. ఆ విషయంలో రెండు ఆలోచన ఉండదు. విద్యార్థులు ఉన్నత విద్య కోసం ప్లాన్ చేస్తారు. ఇంటలెక్చువల్స్‌తో సమావేశమవడం మీ ఆలోచనలను ప్రభావితం చేస్తుంది. రీసెర్చ్‌లో ఉన్నవారు మేదావుల సలహాల నుంచి కొంత నేర్చుకుంటారు. వ్యాపారస్తులకు అనుకూల సమయం.
ధనుస్సు రాశి (Sagittarius)
మీకు అప్పగించిన టాస్క్‌లను చాలా సులువుగా పూర్తి చేస్తారు. వ్యాపారులు సకాలంలో ఆర్డర్స్‌ను డెలివరీ చేయడం వల్ల కస్టమర్స్ నుంచి నమ్మకాన్ని చూరగొంటారు. వ్యాపార వర్గాల్లో మీ పేరు గట్టిగా వినిపిస్తుంది. అది కొందరికి కంటగింపు కావొచ్చు. ప్రత్యర్థులు మీ ఎదుగుదల ఓర్వలేకపోవచ్చు. అన్నీ గమనిస్తూ ముందుకు సాగాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి మీకంతా అనుకూలంగానే జరుగుతుంది.
మకర రాశి (Capricorn)
ఇవాళ చాలా ఎనర్జిటిక్‌గా ఉంటారు. పనిలో విశేషంగా రాణిస్తారు. ఆస్తి సంబంధిత వివాదాల్లో మీదే పైచేయి అవుతుంది. న్యాయస్థానాల్లో మీకు అనుకూలంగా తీర్పు రావొచ్చు. ఆస్తి తగాదాలతో దూరమైన తోబుట్టువులు మళ్లీ మీకు దగ్గరయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతారు. ఇంటికి బంధువులు లేదా సన్నిహిత మిత్రులు వచ్చే అవకాశం ఉంటుంది.
కుంభ రాశి (Aquarius)
చంద్ర అనుగ్రహం లభిస్తుంది. ఉద్యోగ, వ్యాపారస్తులకు పూర్తి అనుకూల సమయం. చేపట్టిన పనులు, తీసుకునే నిర్ణయాలు.. ఇలా అన్నీ కలిసొస్తాయి. మీ పనితీరు ఇతరులకు స్పూర్తినిస్తుంది. పని భారం ఎక్కువైనా ఓపికతో పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు వేతనం పెరగడం లేదా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉండొచ్చు.
మీన రాశి (Pisces)
ఇవాళ మీకు శుభదినం. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి కోరుకున్న జాబ్ దొరుకుతుంది. ప్రేమికులు పెళ్లి విషయంలో ఇప్పుడిప్పుడే ప్రయత్నాలు మొదలుపెడుతారు. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారు తమను తాము అప్డేట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఉద్యోగస్తులు వర్క్ విషయంలో పర్ఫెక్షన్ చూపించడం ద్వారా ప్రమోషన్ అవకాశాలు అందిపుచ్చుకుంటారు. వ్యాపారస్తులకు మరిన్ని ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి.
(గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ ఊహలు, అంచనాలపై ఆధారపడి ఉండొచ్చు. జీ మీడియా దీనిని ధృవీకరించలేదు.)
Also Read : KTR: కేటీఆర్ బర్త్ డే వేడుకలకు రాలేదని ఉద్యోగులకు నోటీసులు.. విమర్శలు రావడంతో వెనక్కి
Also Read: Sanju Samson India: నక్క తోక తొక్కిన సంజూ శాంసన్.. అనూహ్యంగా భారత టీ20 జట్టులో చోటు
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook