/telugu/photo-gallery/tspsc-group-4-final-result-2024-category-wise-selected-candidates-list-check-full-details-here-rn-180895 TSPSC: తెలంగాణ గ్రూప్‌ 4 పరీక్షలో కేటగిరీలవారీగా పాసైన అభ్యర్థులు.. ఆరోజే నియామక పత్రాలు జారీ.. TSPSC: తెలంగాణ గ్రూప్‌ 4 పరీక్షలో కేటగిరీలవారీగా పాసైన అభ్యర్థులు.. ఆరోజే నియామక పత్రాలు జారీ.. 180895

Horoscope Today 14 February 2021: పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ప్రతి సంకేతాలు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి ఫిబ్రవరి 14న డాక్టర్ సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.

మేష రాశి
ఏదైనా రిలేషన్‌లో ఉన్నారా, అయితే మేష రాశి వారికి నేడు చాలా మంచి రోజు. మీకు మరియు మీ భాగస్వామికి మధ్య విషయాలు సజావుగా జరుగుతాయి. ఒకరినొకరు అర్థం చేసుకుని అన్యోన్యంగా మెలుగుతారు. మీరు ఒంటరిగా ఉన్నవారైతే, ప్రేమ లాంటి విషయాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. మీకోసం ఎవరో జీవిత భాగస్వామి కావాలని వెతకాల్సిన పనిలేదు. మీ పనుల మీదే శ్రద్ధ వహిస్తే శుభసూచకాలు.

Also Read: Ram mandir donations: అయోధ్య రామాలయానికి 15 వందల కోట్లు దాటిన విరాళాలు

వృషభ రాశి
ఈరోజు ప్రేమికుల దినోత్సవం. మీరు అన్ని కోణాల నుండి ప్రేమలోని అనుభూతి పొందుతారు. ఈ రోజు మీకు శృంగార పరమైన ఆసక్తి ఉండకపోవచ్చు. అయితే మీ కుటుంబం మరియు స్నేహితుల నుండి వారి ప్రేమను ఖచ్చితంగా పొందుతారు. మీకు ఇష్టమైన వారితో బయటకు వెళ్లి ఆనందంగా గడుపుతారు.

మిథున రాశి
మీరు అనుకున్న పనులు సజావుగా జరగవు. అయితేనేం మీకు ఈరోజు అంతా శ్రేయస్కరమే. మీలోని భావాలను వ్యక్తం చేస్తారు. మీకు మంచి ఉద్యోగం వస్తుంది. సొంత ఇంట్లో సంతోషంగా ఉంటారు. మిమ్మల్ని ప్రేమిస్తున్న వ్యక్తులు మీ చుట్టూ ఉండటంతో మీ ఆనందం రెట్టింపు అవుతుంది.

కర్కాటక రాశి
ఈరోజు ఒంటరిగా గడపాలని కర్కాటక రాశి వారు భావిస్తారు. కానీ మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులు మీకు ఆ అవకాశాన్ని ఇచ్చేందుకు సిద్ధంగా లేరు. మీకు ప్రత్యేకమైన వ్యక్తి పట్ల మీరు ఆకర్షితులు అవుతారు. వారి మనసులో మాటను మీకు చెబుతారు. నిర్ణయం తీసుకోవడం మీ చేతుల్లోనే ఉంటుంది.

Also Read: Art of living: రవిశంకర్‌‌కు అమెరికా వర్శిటీ అరుదైన గౌరవం

సింహ రాశి
మీ ప్రేమ విషయానికి సంబంధించి మీరు మంచి స్థానంలో ఉన్నారు. ఇతరులను చెడ్డవారిగా భావించడం వల్ల మీరు అన్ని విషయాలలో గందరగోళానికి గురవుతున్నారు. మీ జీవిత భాగస్వామిని నమ్మండి. అనుమానాస్పదంగా ఉండవద్దు. మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ప్రేమిస్తారు. మిమ్మల్ని బాధపెట్టే ఏ ఒక్క పనిని చేయరు. నచ్చిన వారితో ప్రేమికుల రోజు గడుపుతారు.

కన్య రాశి
ఈ రోజు కన్య రాశివారు ఓ వ్యక్తిపై తమ అభిప్రాయాన్ని మార్చుకుంటారు. మీరు ఇతరుల పట్ల త్వరగా ఆకర్షితులవుతారు. అవతలి వ్యక్తి గురించి ఆలోచించకుండానే నమ్మడం అంత క్షేమదాయకం కాదు. కొన్ని విషయాలు మీ కళ్లు తెరిపిస్తాయి. కొన్ని రోజులు వేచి చూసి మీ అభిప్రాయాలను వ్యక్తం చేయనున్నారు.

తులా రాశి
ఈ రోజు మీరు మీ ఆసక్తిని పెంచే వారిని కలుసుకునేందుకు మంచి రోజు. వాస్తవానికి, నేడు ప్రేమికుల దినోత్సవం. మీరు తదుపరి ఏం చేయాలనుకుంటున్నారనే దానిపై ధ్యాస ఉంటుంది. మీ భావోద్వేగాలను నియంత్రించుకోవాలి. వివాహం విషయంలో స్థిరంగా ఆలోచిస్తున్నారో లేదో గ్రహించండి. మీరు కోరుకున్న తరుణంలో ప్రేమను పొందగలరు.

వృశ్చిక రాశి
కొన్ని రిలేషన్స్ మీకు దగ్గరగా వస్తాయి. మీరు వారితో ఏ బంధాన్ని కోరుకుంటున్నారో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మీరు కూడా వారితో ప్రేమలో ఉన్నారని భావిస్తే ధైర్యంగా ముందడుగు వేయాల్సిన సమయం. వివాహం అయిన వారు జీవిత భాగస్వామికి దూరంగా ఉన్నట్లయితే, ఆరోజు వారికి శుభఫలితాలు గోచరిస్తున్నాయి.

ధనస్సు రాశి
ఈ రోజు మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి. అప్పుడే మీరు ఇతరుల పట్ల ప్రేమగా వ్యవహరించగలరు. మీరు కొన్ని రోజులుగా చేయాలని వాయిదా వేస్తున్న పనినిపై మనసు లగ్నం చేస్తారు. సాయంత్రం మీరు మీ జీవిత భాగస్వామి కోసం కొంత సమయం కేటాయిస్తారు. చాలాకాలం తర్వాత వారితో మనసులో మాటను, మీ అభిప్రాయాలను పంచుకుంటారు.

Also Read: Rathasapthami 2021: రథసప్తమికి ఏర్పాట్లు ప్రారంభం, తేదీ ఖరారు

మకర రాశి
అనుకోని పరిస్థితులలో ఓ ప్రత్యేకమైన వ్యక్తిని కలుసుకుంటారు. పని వద్దగానీ, లేక బయటగానీ ఆ వ్యక్తితో కాసేపు చర్చిస్తారు. మీరు కోరుకున్న ఓ వ్యక్తిని చూసి మీ మనసులో కొత్త భావాలు మెదలుతాయి. అయితే మీరు ఆ వ్యక్తి పట్ల నిజంగానే ప్రేమగా ఉన్నారా లేదా కాలయాపన చేస్తున్నారా అని తెలుసుకుంటారు. ప్రేమను వ్యక్తం చేసే సమయం ఇది.

కుంభ రాశి
మీరు రొమాంటిక్ తరహా వ్యక్తిగా ఉండరు. కానీ ఈ రోజు మీరు కొంచెం భిన్నంగా ప్రవర్తించే సూచనలు గోచరిస్తున్నాయి. మీ ప్రేమ లాంటి విషయాలను ప్రదర్శించడంతో ఇతరులు ఆశ్చర్యానికి లోనవుతారు. మీ మనసులో మాటల్ని, వారిపై ఉన్న ప్రేమను మీ భార్యకుగానీ, ప్రేమికులు వారు ఇష్టపడ్డ వారికి తెలుపుతారు. కొన్ని రుచికరమైన వంటలు చేస్తారు. మీ చేతి వంటను కుటుంబం, సన్నిహితులు మెచ్చుకుంటారు.

మీన రాశి
మీ లక్ష్యమే మీకు ఈరోజు బెస్ట్ ఫ్రెండ్‌గా వెంట ఉంటుంది. ఇతరులకు సాధ్యమైనంత ప్రేమను పంచుతారు. వారి నుంచి మీరు సైతం అంతే ప్రేమను ఆశిస్తారు. మీ మనసులోని ప్రేమను వ్యక్తం చేసేందుకు తగిన సమయం ఇది. ఈరోజు మీన రాశి వారికి కోరుకున్నది దొరుకుతుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
Horoscope Today 14 February 2021: Today Rasi Phalalu in Telugu From Aries To Pisces
News Source: 
Home Title: 

Today Horoscope: నేటి రాశి ఫలాలు ఫిబ్రవరి 14, 2021 Rasi Phalalu

Today Horoscope: నేటి రాశి ఫలాలు ఫిబ్రవరి 14, 2021 Rasi Phalalu
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Today Horoscope: నేటి రాశి ఫలాలు ఫిబ్రవరి 14, 2021 Rasi Phalalu
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Sunday, February 14, 2021 - 07:38
Request Count: 
83
Is Breaking News: 
No