Happy Raksha Bandhan 2022: రక్షాబంధన్ మరో రెండ్రోజుల్లో ఉంది. శ్రావణమాసంలోని పౌర్ణిమ రోజు జరుపుకుంటారు. సోదర సోదరీమణుల అనురాగానికి చిహ్నమిది. రక్షాబంధన్ సందర్భంగా విషెస్, మెస్సేజెస్, క్వొటేషన్ల గురించి తెలుసుకుందాం..
సోదర సోదరీమణుల మధ్య ఉన్న అనురాగానికి చిహ్నం రక్షాబంధన్. హిందూమతంలో రక్షాబంధన్‌కు విశేష ప్రాధాన్యత ఉంది. ఆ రోజున సోదరుడి దీర్ఘాయుష్షు కోరుతూ సోదరి రాఖీ కడుతుంది. ఈ ఏడాది రక్షాబంధన్ ఆగస్టు 11న ఉంది. శ్రావణమాసంలోని పౌర్ణిమ రోజున రక్షాబంధన్ జరుపుకుంటారు. చంద్రుడిని బట్టి ప్రతియేటా రక్షాబంధన్ తేదీ మారుతుంటుంది.
రక్షాబంధన్ అనేది దేశంలోని ప్రాచీన పండుగల్లో ఒకటి. ఈ రోజున సోదరుడి నుదుట తిలకం దిద్ది..చేతికి రాఖీ కడుతుంది సోదరి. ఈ సందర్భంగా సోదరుడి దీర్ఘాయుష్షు కోసం ప్రార్ధిస్తుంది. అందుకు ప్రతిగా అన్న లేదా తమ్ముడు సోదరికి బహుమతి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. జీవితాంతం రక్షణంగా ఉంటానని మాటిస్తాడు. రక్షాబంధన్ ఆగస్టు 11వ తేదీన ఉంది. ఈ సందర్భంగా మీ స్నేహితులు, సోదర సోదరీమణులు, హితులు, బంధువులకు రక్షాబంధన్ శుభాకాంక్షలు ఇలా చెప్పండి..
Raksha Bandhan 2022 Wishes and Messages
1. Happy Raksha Bandhan to my dear brother who know everything about me. Happy Raksha Bandhan Brother
2. We may be apart in distance but never in our hearts, sending you lots of love and chocolates on this eve of Raksha Bandhan, Happy Rakhi
3. I am very thankful to God, who gave me a brother like you, having brother like you makes me feel sage in this world, always be with thou and pray for your love, health
4. The Best Gift mom and dad gave me is a wonderful sister like you, happy rakhi sister
5. No matter how old you grow, for me you will always remain my adorable little sister. Happy Raksha Bandhan
Raksha Bandhan 2022 Quotes
1. Bless you, my darling, remembering you always in my heart no chance of escape of your sister
2. My Sister taught me everything i really need to know, she was only in sixth grade at the time
3. A sister is gift to the heart, a friend to the spirit, A golden thread to the meaning of life
4. We hang out, we help one another, we tell one another our worst fears and biggest secrets, and then just like real sisters, we listen and dont judge
5. Help your brothers Boat Across, and your own will reach the shore
రక్షాబంధన్ విషెస్, మెస్సేజెస్ తెలుగులో..
1. చిన్నతనంలో మనం పోట్లాడుకున్న రోజులను.. ఇప్పుడు గుర్తుచేసుకుంటే నాకు నవ్వొస్తుంది. అప్పుడే పోట్లాడుకొని అప్పుడే కలిసిపోయేవాళ్లం. ఆ జ్ఞాపకాలను మనం మర్చిపోవచ్చు. కానీ మన మధ్య ఉన్న ప్రేమను మాత్రం ఎప్పుడూ మర్చిపోలేం. ఎందుకంటే అది రోజురోజుకీ పెరుగుతూనే ఉంటుంది.
2. నేను రోజూ ఏదో ఒకటి పోగొట్టుకుంటూ ఉంటాను. కానీ ఒక్క విషయం మాత్రం ఎప్పటికీ పోగొట్టుకోలేను. అది నీ మీద నా ప్రేమ. అదెప్పటికీ చెరిగిపోదు. హ్యాపీ రక్షాబంధన్.
3. అన్నలాంటి స్నేహితుడు ఇంకెవరూ ఉండరు. చెల్లెలు వంటి సూపర్ గర్ల్ ఇంకెవరూ ఉండరు. నీలాంటి వ్యక్తి నా జీవితంలో ఉన్నందుకు నేను అదృష్టవంతురాలిని..
4. హ్యాపీ రక్షాబంధన్. దేవుడి దయ, ఆశీర్వాదం నీకు ఈ రోజే కాదు.. ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నా. ఆ దేవుడు నీకెప్పుడూ ఆనందాన్ని అందించాలని.. ప్రేమ, సంతోషం, ఆరోగ్యం అన్నీ సమకూర్చాలని కోరుకుంటున్నా.
5. మనమిద్దరం ఒకరినొకరం ఏడిపించుకున్న సందర్భాలు, తిట్టుకున్న సందర్భాలు అన్నీ.. నీ మీద నాకున్న ప్రేమ ముందు చాలా చిన్నగా కనిపిస్తాయి. నీకు రక్షాబంధన్ శుభాకాంక్షలు. నాకు గిఫ్ట్స్ పంపడం మాత్రం మర్చిపోవద్దు..
6. నేను ఏడుస్తుంటే నాకు తోడున్నావు. నన్ను అన్ని కష్టాల నుంచి కాపాడావు. సూపర్ హీరోలు నిజంగా ఉంటే.. వారిలో నువ్వూ ఒకడివి. నువ్వు చేసిన పనులన్నింటికీ థ్యాంక్యూ అన్నయ్య. హ్యాపీ రక్షాబంధన్
Also read: Sun Transit 2022 Effect: సూర్య సంచార ప్రభావం... కూల్ మైండ్‌తో పని చేయకపోతే ఈ రాశివారికి నష్టం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook