Hanuman Puja Vidhi on Tuesday: హనుమానుంతుడిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని పురాణాలు చెబుతున్నాయి. హనుమంతుడి అనుగ్రహం (Hanuman blessings) ఉంటే.. కొండంత అండ ఉన్నట్టే అనేది భక్తుల బలమైన విశ్వాసం. అందుకే ఆ ఆంజనేయ స్వామిని ప్రసన్నం చేసుకోవడానికి ఆయన భక్తులు శతవిధాల ప్రయత్నిస్తుంటారు. ఆ శ్రీ రాముడు అంటే హనుమంతుడుకి ఎంత భక్తో... అలాగే భక్తితో తనని కొలిచే వారి ఇంట సుఖ శాంతులు, సంతోషాలకు కొదువ లేకుండా చూస్తాడట ఆ భగవంతుడు.
హనుమంతుడి ఆశీర్వాదం, అనుగ్రహం పొందడానికి ఆయన భక్తులు (Hanuman bhakths) ఎక్కువగా ఆయన్ను మంగళ, శనివారాల్లో పూజిస్తారు. ఎందుకంటే మంగళవారం, శనివారం ఆంజనేయ స్వామిని పూజిస్తే.. ఆ స్వామి అనుగ్రహం తప్పకుండా లభిస్తుందనే హిందూ శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. ఆ హనుమంతుడిని పూజించేందుకు (How to please lord Hanuman) కొన్ని ప్రత్యేక పద్ధతులు ఉన్నాయని. పురాణాలు ఔపోసన పట్టిన పండితులు చెబుతున్న వివరాల ప్రకారం.. హనుమంతుడిని కోరే కోరికను బట్టి ఆ దేవుడి విగ్రహం లేదా ప్రతిమ వేర్వేరుగా ఉంటాయట. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Also read : Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు 15 జూన్ 2021, ఓ రాశివారికి ధనలాభం
- మీరు ఉద్యోగం అవకాశాల (Job opportunities) కోసం ప్రయత్నిస్తున్నట్టయితే.. తెల్లటి రూపంలో ఉన్నటువంటి హనుమాన్ విగ్రహాన్ని లేదా ఫోటోను పూజించండి.
- మనస్సులో ఏవైనా చెడు ఆలోచనలు వస్తున్నట్లయితే, మనస్సుకు ప్రశాంతత కరువైనట్టయితే.. హనుమంతుడు రాముడి భక్తిలో (Ram Bhakth) లీనమైనటువంటి విగ్రహానికి లేదా ఫోటోను ఆరాధిస్తే ఆ చెడు ఆలోచనలు దూరమై మనసుకు ప్రశాంతత కలుగుతుందట.
- ఏదైనా సాహసోపేతమైన పని తలపెట్టే ముందు మధ్యలో వెనుకడుగు వేయకుండా ధైర్యం, శక్తిని ప్రసాదించమని కోరుకునేందుకు గద పట్టుకుని ఉన్న హనుమాన్ విగ్రహాన్ని (Hanuman powers) పూజించండి.
- మీకు ఇంకా ఏదైనా ప్రత్యేకమైన, బలమైన కోరిక ఉన్నట్టయితే, ప్రతీ మంగళవారం, నువ్వుల నూనెలో కలిపిన సింధూరాన్ని హనుమంతుడి విగ్రహానికి సమర్పించండి. హనుమంతుడికి మంగళవారం సింధూరాన్ని సమర్పించడం ద్వారా గ్రహ దోషాలు (Graha dosham) తొలగిపోయి, ప్రమాదాలు, గండాలు నుండి సురక్షితంగా బయటపడతారు. అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. రావి ఆకు లేదా తమలపాకు సాయంత హనుమంతుడికి సింధూరాన్ని సమర్పించండి.
Also read: Vinayak Chaturthi 2021: వినాయక చతుర్థి ఇవాళ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు తెలుసా ?
- హనుమంతుడి పరాక్రమానికి ప్రతిరూపమైన ఎర్ర జెండాను హనుమంతుడి ఆలయంలో (Hanuman temple) నాటడం వల్ల ఆ దేవుడి ఆశీస్సులు మీపై ఎప్పుడూ ఉంటాయనేది బలమైన విశ్వాసం. అయితే, ఆ జండా త్రిభుజాకారంలో ఉండాలి. జండాపై శ్రీరామ్ అని రాయాలి.
మీరు జీవితంలో అభివృద్ధి సాధించాలనుకుంటే.. హనుమంతుడు ఆ సీతారాముల పాదాల వద్ద కూర్చున్నటువంటి విగ్రహాన్ని (Lord Hanuman statues) లేదా చిత్రాన్ని ఆరాధిస్తే సత్ఫలితాలు ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇదండీ మంగళవారం హనుమాన్ పూజ విధానం (Hanuman puja on Tuesday). మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలతో మరో కథనంలో మళ్లీ కలుద్దాం.
Also read: Sai Baba puja vidhi: సాయి బాబాను ఎలా పూజిస్తే ఏమేం ఫలితాలు కలుగుతాయి ?