Gajakesari yoga: తొలి శ్రావణ సోమవారం నాడే గజకేసరి యోగం.. ఈ 5 రాశులవారికి గోల్డెన్ డేస్ మెుదలు..

Sravana Somavaram 2022: శ్రావణ మాసం మొదటి సోమవారం గజకేసరి యోగంలో ప్రారంభమైంది, ఇది చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ యోగం 5 రాశుల వారికి శుభప్రదంగా ఉండనుంది.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 18, 2022, 12:12 PM IST
  • ఇవాళ తొలి శ్రావణ సోమవారం
  • శివుడిని ఇలా పూజించండి
Gajakesari yoga: తొలి శ్రావణ సోమవారం నాడే గజకేసరి యోగం.. ఈ 5 రాశులవారికి గోల్డెన్ డేస్ మెుదలు..

Sravana Somavaram Lucky Zodiac Signs 2022: శ్రావణ మాసంలో వచ్చే సోమవారాలకు చాలా ప్రత్యేకత ఉంది. ఈ రోజుల్లో పరమేశ్వరుడిని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు శివారాధన చేస్తారు. ఈ ఏడాది మెుదటి శ్రావణ సోమవారం (First Sravana Somavaram 2022) ఇవాళ అంటే జూలై 18న వచ్చింది. అంతేకాకుండా ఇదే రోజు గజకేసరి యోగం (Gajakesari yoga) కూడా ఏర్పడింది. మీనరాశిలో గురుడు-చంద్రుడు కలయికతో గజకేసరి యోగం ఏర్పడింది. ఈ యోగం కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది.  ఆ రాశులేంటో తెలుసుుకుందాం. 

వృషభం (Taurus)- వృషభ రాశి వారికి గజకేసరి యోగం చాలా శుభప్రదం. ఈ రాశివారు అపారమైన డబ్బును సంపాదిస్తారు. ఈ సమయంలో మీరు శుభవార్తలు ఉంటారు. కెరీర్‌ అద్భుతంగా ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న ముఖ్యమైన పనులు పూర్తి అవుతాయి.  ఆస్తికి సంబంధించిన వ్యవహారాలు వేగం పుంజుకుంటాయి. 

కర్కాటక రాశి (Cancer)- గజకేసరి యోగం కర్కాటక రాశి వారికి గొప్ప ప్రయోజనాలను ఇస్తుంది. ఇంట్లో ఆనందం మరియు శాంతి నెలకొంటుంది. పిల్లల విషయంలో కొన్ని శుభవార్తలు వింటారు. ఈ సమయం విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. 

సింహం (Leo)- సింహ రాశి వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆగిపోయిన పని పూర్తి అవుతుంది. శివలింగంపై బిల్వ పత్రాలను పెట్టడం వల్ల అనేక ప్రయోజనాలు పొందుతారు. 

మకరం (Capricron)- గజకేసరి యోగం మకరరాశి వారికి మేలు చేస్తుంది. కెరీర్‌లో వస్తున్న అడ్డంకులు తొలగిపోతాయి. టెన్షన్ తగ్గుతుంది. ఆదాయం పెరుగుతుంది. పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమవుతున్న వారికి పెళ్లి ఖాయం. 

మీన రాశి (Pisces)- శ్రావణ సోమవారం ఏర్పడిన గజకేసరి యోగం కూడా మీన రాశి వారికి చాలా లాభాన్ని ఇస్తుంది. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ధనం లాభదాయకంగా ఉంటుంది. ఎక్కడైనా డబ్బు ఇరుక్కుపోయి ఉంటే తిరిగి పొందవచ్చు. ఈరోజే దానం ఇస్తే మంచి జరుగుతుంది. 

Also Read: Sravana Somavaram 2022: ఇవాళే శ్రావణ మాసం మెుదటి సోమవారం.. ముహూర్తం, పూజా విధానం ఇదే..

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News