Powerful Raj yog: 59 ఏళ్ల తర్వాత రేపు 5 రాజయోగాలు.. ఈ 5 రాశుల వారికి గుడ్ టైమ్ స్టార్ట్..

Raj Yog on 24 September 2022: రేపు సెప్టెంబర్ 24న 5 శక్తివంతమైన రాజయోగాలు ఏర్పడుతున్నాయి. ఇది 5 రాశులవారికి అపారమైన ప్రయోజనాలను అందించనున్నాయి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 23, 2022, 09:27 AM IST
Powerful Raj yog: 59 ఏళ్ల తర్వాత రేపు 5 రాజయోగాలు.. ఈ 5 రాశుల వారికి గుడ్ టైమ్ స్టార్ట్..

Raj Yog on 24 September 2022 Horoscope: జ్యోతిష్య శాస్త్రంలో ఒక్కో గ్రహం రాశి మార్పు, గమనంలో మార్పుల ప్రభావం మనందరిపై ఎంతో కొంత ఉంటుంది. 59 ఏళ్ల తర్వాత రేపు అంటే సెప్టెంబర్ 24, 2022న అటువంటి గ్రహాలు మరియు రాశుల కలయిక జరగబోతోంది. వీటి సంయోగం వల్ల 5 శక్తివంతమైన రాజయోగాలు ఏర్పడతున్నాయి. ఈ రోజున శని, బుధ, గురులు తిరోగమనంలో ఉండటం, మూడు గ్రహాలు కన్యారాశిలో  సంచరించడం వల్ల  నీచ భంగ, బుధాదిత్య, భద్ మరియు హంస అనే శక్తివంతమైన రాజయోగాలు ఏర్పడుతున్నాయి. ఈ 5 రాజయోగాలు ఐదు రాశులవారిపై శుభప్రభావాన్ని చూపుతాయి. ఆ రాశులేంటో తెలుసుకుందాం. 

ఈ 5 రాశులవారికి శుభప్రదం
వృషభం (Taurus) : ఈ రాజయోగాలు వృషభ రాశి వారికి లాభిస్తాయి. వ్యాపారంలో భారీ లాభాలు ఉంటాయి. షేర్లు, స్పెక్యులేషన్, లాటరీలలో పెట్టుబడి పెట్టడం లాభదాయకంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది.  
మిథునం (Gemini): వృత్తి, వ్యాపారాలలో విజయం ఉంటుంది. ధనం లాభదాయకంగా ఉంటుంది. రాజకీయ నాయకులు పెద్ద పదవులు పొందే అవకాశం ఉంది. నచ్చిన  చోటుకు ట్రాన్సఫర్ అయ్యే అవకాశం ఉంది. అదృష్టంతో ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. 
కన్య (Virgo): వ్యాపారంలో భారీ లాభాలను ఆర్జిస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కొత్త జాబ్ ఆఫర్ రావచ్చు. మీడియా, సినిమాలతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు. పెండింగ్ లో ఉన్న పని పూర్తవుతుంది. లక్ కలిసి వస్తుంది. 
ధనుస్సు (Sagittarius): ఈ సమయం వ్యాపారానికి అనుకూలంగా ఉంటుంది. కొత్త డీల్ ఫైనల్ కావచ్చు. పనికి సంబంధించి ప్రయాణాలు కలిసి వస్తాయి. ధనం లాభదాయకంగా ఉంటుంది.
మీనం (Pisces) : ఈ సమయం ప్రతి విషయంలో చాలా బాగుంటుంది. మీరు కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ప్రమోషన్-ఇంక్రిమెంట్ పొందే అవకాశం ఉంది.  బిజినెస్ విస్తరిస్తుంది. లాభాలు పెరుగుతాయి. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఇదే మంచి సమయం.

Also Read: Surya- Shukra Gochar 2022: రేపు కన్యారాశిలో సూర్యుడు, శుక్రుడు కలయిక... ఈ 4 రాశులవారు పట్టిందల్లా బంగారమే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News