Samsaptak Yoga 2023: సంసప్తక యోగం కారణంగా ఈ రాశులవారి జీవితాల్లో కీలక మలుపులు, ఇందులో మీ రాశి ఉందా?

Samsaptak Yoga 2023: కుజుడి సంచారం కారణంగా సంసప్తక యోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారి జీవితాల్లో మంచి జరిగితే మరికొన్ని రాశులవారి జీవితాల్లో తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయి. అయితే ఈ యోగం కారణంగా ఏయే రాశులవారిపై ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 21, 2023, 11:51 AM IST
Samsaptak Yoga 2023: సంసప్తక యోగం కారణంగా ఈ రాశులవారి జీవితాల్లో కీలక మలుపులు, ఇందులో మీ రాశి ఉందా?

Samsaptak Yoga 2023: జూలైలో కుజుడు సంచారం చేయబోతున్నాడు. దీంతో ఈ ప్రభావం అన్ని రాశులవారిపై పడబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. కుజుడు సింహరాశిలోకి సంచారం చేయడం వల్ల సంసప్తక యోగం ఏర్పడుతుంది. అంతేకాకుండా కుంభరాశిలో శని గ్రహం కూడా తిరోగమన దిశలో తిరుగుతోంది. దీని కారణంగా యోగం ప్రభావం అన్ని రాశులవారిపై తీవ్రంగా పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సంసప్తక యోగం కారణంగా ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

ఈ రాశులవారిపై సంసప్తక యోగం ప్రభావం:
కన్య రాశి:

కన్య రాశికి ఈ యోగం కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో శరీర నొప్పులు లేదా ఛాతిలో అసౌకర్యం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగాలు చేసేవారికి ఒత్తిడి సమస్యలు కూడా వచ్చే ఛాన్స్‌ ఉంది. అంతేకాకుండా ఖర్చులు పెరిగి ఆర్థిక సమస్యలు కూడా రావచ్చు.     

తుల రాశి:
తుల రాశి వారికి సంసప్తక యోగం కారణంగా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. వీరు ఈ క్రమంలో అదృష్టవంతులవుతారని.. ఏ పనులు చేసిన సులభంగా విజయాలు సాధిస్తారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఆర్థికంగా బలపడే ఛాన్స్‌ కూడా ఉంది. వీరికి ఈ క్రమంలో ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి. 

Also read : Pawan Kalyan Comments: నన్ను వదిలేస్తే ముస్లింలకే నష్టం, కాకినాడలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

వృశ్చిక రాశి :
సంసప్తక యోగం కారణంగా పోటీ పరీక్షలు రాసేవారికి చాలా అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ క్రమంలో వీరికి సామర్థ్యం పెరిగి అన్ని రకాల పనులు సులభంగా చేయగలుగుతారు. ఈ యోగం కారణంగా తీవ్ర కంటి సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 

ధనుస్సు రాశి:
ప్రభుత్వ రంగంలో పనులు చేస్తున్నవారికి చాలా అనుకులంగా ఉంటుంది. అంతేకాకుండా వీరికి జీవిత భాగస్వామి కారణంగా ఒత్తిడి సమస్యలు రావచ్చు. శ్రమ పెరిగి పని భారం పెగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ రాశివారు పలు అనారోగ్య సమస్యలకు కూడా గురవుతారు. 

మకర రాశి :
మకర రాశివారికి ఈ యోగం కారణంగా మాటతీరు పెరుగుతుంది. అంతేకాకుండా తీవ్ర గొంతు సమస్యలు కూడా రావచ్చని జ్యోష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. కుటుంబ సభ్యులు ప్రయాణాలు చేయడం వల్ల ఖర్చులు కూడా పెరుగుతాయి. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యల కారణంగా ఆందోళన చెందే అవకాశాలు కూడా ఉన్నాయి. 

Also read : Pawan Kalyan Comments: నన్ను వదిలేస్తే ముస్లింలకే నష్టం, కాకినాడలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News