700 సంవత్సరాల తర్వాత 5 ప్రత్యేక యోగాలు..ఈ 4 రాశులవారు 100% ఆర్థిక లాభాలు పొందడం ఖాయం!

Jupiter And Venus Conjunction 2023: ఐదు ప్రత్యేక యోగాలుర ఏర్పడడం కారణంగా కొన్ని రాశులవారు డిసెంబర్‌ నెలలో ఊహించని లాభాలు పొందబోతున్నారు. అంతేకాకుండా సుమారు 700 సంవత్సరాల తర్వాత ఏర్పడి ఈ ప్రత్యేక ప్రభావం కొన్ని రాశులవారికి అదృష్టాన్ని పెంచబోతోంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 1, 2023, 04:53 PM IST
700 సంవత్సరాల తర్వాత 5 ప్రత్యేక యోగాలు..ఈ 4 రాశులవారు 100% ఆర్థిక లాభాలు పొందడం ఖాయం!

Jupiter And Venus Conjunction 2023: నవంబర్ 30న శుక్రగ్రహం తులారాశిలోకి సంచారం చేసింది. అయితే ఇదే రాశిలో గురు గ్రహం కూడా సంచారం చేసింది. సుమారు 700 సంవత్సరాల తర్వాత గురు, శుక్రుడు ముఖాముఖిగా కలుసుకున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు, శుక్ర గ్రహాల కలయిక కారణంగా నేక శుభ యాదృచ్ఛికాలు ఏర్పడనున్నాయి.  బృహస్పతి, శుక్రుల కలయికల కారణంగా  శష యోగం, కేంద్ర త్రికోణ యోగం, మాళవ్య యోగం, నవపంచమ యోగం, రుచక మహాయోగాలు ఏర్పడబోతున్నాయి. దీని కారణంగా మేష రాశితో పాటు మకర రాశివారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ ప్రత్యేకమైన 5 యోగాల కారణంగా ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

ఈ రాశులవారిపై ప్రత్యేక యోగాల ప్రభావం:
మేషరాశి:

గురు, శుక్ర గ్రహాల కలయిక కారణంగా ఏర్పడే యోగాల కారణంగా మేష రాశి వారికి 2024 సంవత్సరం వరకు చాలా శుభ ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా ఈ రాశివారు ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతి సాధించే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు కొత్త ఆదాయ వనరులు లభించి ఆర్థిక లాభాలు పొందే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా వైవాహిక జీవితంలో సమస్యలు పరిష్కారమవుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా శుక్రుని అనుగ్రహంతో  ప్రేమ సంబధాలు మరింత బలపడుతాయి.

కన్యారాశి:
సుమారు 700 సంవత్సరాల తర్వాత ఈ గురు, శుక్ర గ్రహాల అద్భుత కలయిక జరిగింది. కాబట్టి ఈ ప్రత్యేక యోగాలు ఏర్పడ్డాయి. దీని కారణంగాల కన్యా రాశి వారికి అదృష్టం వరిస్తుంది. ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన మీ అదృష్టం రెట్టింపు అవ్వడం కారణంగా మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా మీరు కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్‌ లభించి సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారంలో లాభం ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

ధనుస్సు రాశి:
మాళవ్య యోగం, నవం పంచమ యోగంతో సహా 5 యోగాల ప్రభావం కారణంగా ధనుస్సు రాశి వారికి కూడా అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా సంతోషం కూడా పెరుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఇక వ్యాపారాలు చేసేవారు విజయాలు కూడా సాధిస్తారు. దీంతో పాటు ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. కొత్త ఆదాయ వనరులు ఏర్పడి.. మంచి లాభాలు పొందుతారు. సంబంధాలలో ప్రేమ పెరుగుతుంది. దీంతో పాటు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది.

మకర రాశి:
మకర రాశి వారు గురు, శుక్రుల శుభ కలయిక వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. దీంతో పాటు కెరీర పురోగతికి సంబంధించి అనేక రకాల ప్రయోజనాలు పొందుతారు. ఇక ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్‌ కూడా లభించే ఛాన్స్‌లు ఉన్నాయి. దీంతో పాటు ఆకస్మిక ధనలాభాలు కూడా పొందుతారు. ఆర్థికంగా బలపడే ఛాన్స్‌లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News