Chandra Grahan 2023: చంద్రగ్రహణం ఈ 4 రాశుల వారికి అస్సలు కలిసిరాదు.. ఇందులో మీది ఉందా?

Lunar Eclipse 2023: ఈరోజే తొలి చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇప్పుడు ఏర్పడబోయేది పెనంబ్రల్ చంద్రగ్రహణం. ఈ గ్రహణం నాలుగు రాశులవారికి అస్సలు కలిసిరాదు. ఆ రాశులేవో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : May 5, 2023, 12:46 PM IST
Chandra Grahan 2023: చంద్రగ్రహణం ఈ 4 రాశుల వారికి అస్సలు కలిసిరాదు.. ఇందులో మీది ఉందా?

Chandra Grahan 2023 date: 2023 సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం అవాళ అంటే మే 5న ఏర్పడనుంది. ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు. సూతక్ కాలం కూడా చెల్లదు. తొలి చంద్రగ్రహణం సమయంలో ముఖ్యంగా నాలుగు రాశులవారు జాగ్రత్తగా ఉండాలి. ఆ దురదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 

కర్కాటకం
మొదటి చంద్ర గ్రహణం ఈ రాశి వారిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఈ సమయంలో మీ ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది. మీరు ఉద్యోగంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటారు. ఈ సమయంలో శివుడిని పూజించడం వల్ల మీకు మేలు జరుగుతుంది.
సింహం
లూనార్ ఎక్లిప్స్ ఈ రాశి వారికి అశుభకరం. ఈ సమయంలో ఈ సింహరాశి వారు చెడు వార్తలు వినే అవకాశం ఉంది. ఫ్యామిలీపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. ఈ సమయంలో మీరు ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకోవద్దు. అనుకున్న పనులు సరిగా జరగవు. 
మేషం
తొలి చంద్రగ్రహణం మేషరాశి వారికి శుభప్రదం కాదు. మీ ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది. ఈ సమయంలో మీరు ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోకండి. మీరు న్యాయపరమైన వివాదంలో చిక్కుకునే అవకాశం ఉంది.  ఈ సమయంలో మీరు మీ మనసును చాలా దృఢంగా ఉంచుకోవాలి. 
వృషభం
ఈ రాశి వారికి చంద్రగ్రహణం అస్సలు కలిసి రాదు. ఈ సమయంలో మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. మీకు ఇతరులతో విభేదాలతో తలెత్తే అవకాశం ఉంది.  మీరు కుటుంబానికి దూరమయ్యే పరిస్థితి ఉంది. మీరు లైఫ్ చాలా సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది. 

Also Read: Sun Transit 2023: మరో 10 రోజుల్లో ఈరాశుల జాతకం మారిపోనుంది.. ఇందులో మీ రాశి ఉందా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News