Budh Gochar 2023: ఈ రాశులవారిపై బుధ గ్రహం ప్రత్యేక్ష ప్రభావం, ఇక లాభాలే లాభాలు!

Budh Gochar 2023: బుధుడు ఒక రాశిని వదిలి ఇతర రాశిలోకి సంచారం చేయడం వల్ల పలు రాశులవారికి మిశ్రమ ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా కొన్ని రాశులవారు పెట్టుబడులు పెట్టడం వల్ల భారీగా లాభాలు పొందుతారని నిపుణులు చెబుతున్నారు. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : May 9, 2023, 08:42 AM IST
 Budh Gochar 2023: ఈ రాశులవారిపై బుధ గ్రహం ప్రత్యేక్ష ప్రభావం, ఇక లాభాలే లాభాలు!

Budh Gochar 2023: బుధ గ్రహాన్ని వ్యాపారం, కమ్యూనికేషన్, వాణిజ్యానికి కారకంగా భావిస్తారు. జాతకచక్రంలో ఈ గ్రహం సానుకూల ప్రభావం చూపుతే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. మే 15న ఉదయం 08:46 బధుడు ప్రత్యేక్షంగా సంచారం చేసే అవకాశాలున్నాయి. ఈ ప్రభావం అన్ని రాశులవారిపై జూన్‌ 07 వరకు సానుకూల ప్రభావం చూపుతుంది. కాబట్టి ఈ క్రమంలో పలు రాశులవారు మంచి లాభాలు పొందితే మరికొన్ని రాశులవారు తీవ్ర దుష్ప్రభావాలకు గురవుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఏయే రాశులవారు ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం. 

ఈ రాశులవారిపై ప్రభావం:
మేష రాశి:

ఈ రాశివారికి బుధుడు ఆరవ స్థానంలో ఉండబోతున్నాడు. అంతేకాకుండా ఆస్థిరంగా ఉంటాడు.. కాబట్టి మేష రాశివారికి మేధో వికాసం, జ్ఞానం పెరుగుతుంది. వ్యాపారంలో మార్పులు  కూడా సంభవిస్తాయి. వివాహం విషయంలో కొన్ని సమస్య వచ్చే అవకాశాలున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. విద్యార్థులకు ఈ క్రమంలో మంచి ఫలితాలు లభిస్తాయి. కార్యాలయంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఈ రాశివారికి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. 

వృషభ రాశి:
వృషభ రాశివారికి బధుడు 12వ స్థానంలో ఉండబోతున్నాడు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులతో సంతోషకరంగా గడపగలుగుతారు. అంతేకాకుండా కొత్త ఇంటిని కొనుగోలు చేయాలనుకునేవారి కోరిక నెరవేరుతుంది. వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని పెంచేందుకు ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి తప్పకుండా వీరు జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్రంగా నష్టపోయే అవకాశాలున్నాయి. ఉద్యోగాలు చేస్తున్నవారు కష్టపడి పనులు చేయడం వల్ల దానికి తగిన ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా జీవిత భాగస్వామితో ప్రేమగా ఉంటారు. ముఖ్యంగా విద్యార్థులు ఈ క్రమంలో శ్రద్ధతో చదువు కోవాల్సి ఉంటుంది. 

Also Read: SRH Records: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌.. టాప్ రికార్డ్స్ ఇవే!  

మిథునరాశి:
మిథునరాశి వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఎందుకంటే ఈ రాశివారికి బుధుడు 11వ స్థానంలో ఉండబోతున్నాడు. ఈ క్రమంలో మిథున రాశివారికి పని సామర్థ్యం పెరుగుతుంది. స్థానంలో మార్పులు రావడం వల్ల కార్యలయంలో రెట్టింపు ఉత్సహంతో పనులు చేస్తారు. వ్యాపారాలు చేసేవారికి ఇది మంచి సమయంగా భావించవచ్చు. ఈ రాశివారి తల్లిదండ్రుల ఆరోగ్యం క్షీణించే ఛాన్స్‌ ఉంది. కాబట్టి వారి పట్ల జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. 

కర్కాటక రాశి:
బుధుడు కర్కాటక రాశి వారికి పన్నెండవ స్థానంలో ఉండబోతున్నాడు. కాబట్టి ఈ రాశివారు ఉహించని ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. వ్యాపారాలు చేసేవారికి ఈ క్రమంలో చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. పెట్టుబడులు పెట్టడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు పొందే అవకాశాలున్నాయి. ఉద్యోగాలు చేస్తున్నవారికి ఇది సరైన సమయంగా భావించ వచ్చు. ఈ క్రమంలో ఎలాంటి పనులు చేసిన మంచి ఫలితాలు పొందుతారు. అయితే బుధుడు పన్నెండవ స్థానంలో ఉండడం వల్ల ఈ రాశివారు కోపాన్ని కలిగి ఉంటారు. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. 

Also Read: SRH Records: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌.. టాప్ రికార్డ్స్ ఇవే!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News