Sankashti Chaturthi 2022: భాద్రపద సంకష్ట చతుర్థి ఎప్పుడు? పూజ ముహూర్తం తెలుసుకోండి

Sankashti Chaturthi 2022: ఈ ఏడాది భాద్రపద సంకష్ట చతుర్థి ఆగస్టు 15వ తేదీన వస్తుంది. అదే రోజు బహుళ చతుర్థి రావడం కూడా విశేషం. ఈ రోజున వినాయకుడిని, శ్రీకృష్ణుడిని పూజించడం వల్ల మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 12, 2022, 02:29 PM IST
Sankashti Chaturthi 2022: భాద్రపద సంకష్ట చతుర్థి ఎప్పుడు? పూజ ముహూర్తం తెలుసుకోండి

Bhadrapada Sankashti Chaturthi 2022: భాద్రపద మాసంలోని కృష్ణ పక్ష చతుర్థి తిథి నాడు సంకష్టి చతుర్థి జరుపుకుంటారు. ఈ ఏడాది భాద్రపద సంకష్ట చతుర్థి (Sankashti Chaturthi 2022) ఆగస్టు 15న వచ్చింది. దీనినే హేరంబ్ సంకష్టి చతుర్థి అని కూడా అంటారు. సంకష్తి చతుర్థి నాడు ఉపవాసం ఉండి.. గణేశుడిని పూజించడం వల్ల మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. బహుళ చతుర్థి ఇదే రోజు రావడం విశేషం. ఈ రోజున శ్రీకృష్ణుడితో పాటు ఆవును కూడా పూజిస్తారు. భాద్రపద సంకష్ట చతుర్థి తిథి, పూజ ముహూర్తం గురించి తెలుసుకుందాం.

సంకష్టి చతుర్థి 2022 తేదీ
పంచాంగం ప్రకారం, భాద్రపద మాసంలోని కృష్ణ పక్ష చతుర్థి తేదీని ఆగస్టు 14 ఆదివారం రాత్రి 10.35 గంటలకు ప్రారంభమై...  ఆగస్టు 15వ తేదీ సోమవారం రాత్రి 09:01 గంటలకు ముగుస్తుంది. ఉదయం తిథిగా ఆధారంగా దీనిని ఆగస్టు 15న జరుపుకుంటారు.

చంద్రోదయ సమయం
భాద్రపద సంకష్ట చతుర్థి నాడు రాత్రి 09:27 గంటలకు చంద్రుడు ఉదయించి.. తర్వాత రోజు ఉదయం 09:04 గంటలకు చంద్రుడు అస్తమిస్తాడు. సంకష్ట చతుర్థి నాడు ఉపవాసం ఉండే వారు రాత్రి 09:27 గంటలకు చంద్రునికి అర్ఘ్యం సమర్పించి వ్రతం పూర్తి చేస్తారు.

శుభ ముహూర్తం
సంకష్టి చతుర్థి రోజు ఉదయం 11:59 నుండి మధ్యాహ్నం 12:52 వరకు అభిజిత్ ముహూర్తం. ఇదే శుభ సమయం కూడా. ఈ రోజున ఉదయం నుండి రాత్రి 11.24 వరకు ధృతి యోగం కూడా ఉంది. చాలా పనులకు ఇది శుభప్రదంగా ఉంటుంది. 

Also Read: Mangal Gochar 2022: ఈ 4 రాశుల వారు రాబోయే 3 నెలలుపాటు జాగ్రత్త!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News