Bhadrapada Amavasya 2022 Snan Daan Muhuratm: భాద్రపద మాసంలోని కృష్ణ పక్ష అమావాస్యను భాద్రపద అమావాస్య లేదా భాదో అమావాస్య (Bhadrapada Amavasya 2022) అంటారు. ఈ రోజున దానధర్మాలు, పూజలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. పితృ దోషం, కాలసర్ప దోషం నుండి బయటపడాలంటే ఈ రోజున కొన్ని పరిహారాలు చేయండి. ఈ సంవత్సరం భాద్రపద అమావాస్య 2022 ఆగస్టు 27న వస్తుంది.
భాద్రపద అమావాస్య నాడే శివయోగం..
భాద్రపద మాసంలోని కృష్ణ పక్షంలోని అమావాస్య తేదీ ఆగస్టు 26 శుక్రవారం మధ్యాహ్నం 12:22 గంటలకు ప్రారంభమై... ఆగస్టు 27, శనివారం మధ్యాహ్నం 01:47 వరకు ఉంటుంది. ఉదయ తిథి ఆధారంగా, భాద్రపద అమావాస్య ఆగస్టు 27, శనివారం నాడు జరుపుకుంటారు. ఈ సంవత్సరం భాద్రపద అమావాస్య నాడు ఎంతో శుభప్రదంగా భావించే శివయోగం ఏర్పడుతోంది. ఈ రోజున ఆగస్టు 28 మధ్యాహ్నం 02:06 వరకు శివయోగం ఉంటుంది. శివయోగంలో చేసే పూజలు రెట్టింపు ఫలితాలనిస్తాయి.
భాద్రపద అమావాస్యకు పరిహారాలు
>> పితృదోషం తొలగించే పరిహారం: భాద్రపద అమావాస్య రోజు పితృదోషం పోగొట్టుకోవడానికి మంచిరోజు. ఈ రోజున పుణ్యనదుల్లో కుశ గడ్డి కలిపిన నీటిలో తర్పణం వదలడం ద్వారా పితృదోషం తొలగించుకోవచ్చు, పూర్వీకుల ఆశీస్సులు పొందవచ్చు.
>> కాల సర్ప దోషాన్ని తొలగించే రెమెడీ: కాలసర్ప దోషం జీవితంలో అనేక దుఃఖాలను కలిగిస్తుంది. జాతకంలో ఈ దోషం ఉన్నవారు కెరీర్ లో ముందుకెళ్లలేరు. భాద్రపద అమావాస్య రోజున శివాలయంలో వెండి సర్పాలు సమర్పించడం ద్వారా ఈ దోషాన్ని పోగొట్టుకోవచ్చు.
Also Read: Shani Margi 2022: అక్టోబరు 23 నుంచి శనిమహాదశ నుండి ఈ రాశులకు విముక్తి, ఈ రాశులకు భారీగా డబ్బు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook