Shani Amavasya: ఈ శని అమావాస్య నాడు ఏమేం చేయొచ్చు, ఏమేం చేయొద్దు.. ఫుల్ డీటేల్స్

Shani Amavasya January 2023: హిందూ ధర్మం ప్రకారం అమావాస్యపై రకరకాల ప్రచారాలు వాడుకలో ఉన్నాయి. అమావాస్య నాడు పూర్వీకులను పూజించి, శ్రాద్ధ కర్మలు జరిపిస్తే వారి ఆత్మకు శాంతి కలగడంతో పాటు శ్రాద్ధ కర్మలు జరిపిన వారికి కూడా పూర్వీకుల ఆశిస్తులు లభిస్తాయనేది ఒక నమ్మకం. జనవరి 21, 2023 నాడు మాఘ అమావాస్య వచ్చింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 21, 2023, 04:43 AM IST
Shani Amavasya: ఈ శని అమావాస్య నాడు ఏమేం చేయొచ్చు, ఏమేం చేయొద్దు.. ఫుల్ డీటేల్స్

Shani Amavasya January 2023: హిందూ ధర్మం ప్రకారం అమావాస్యపై రకరకాల ప్రచారాలు వాడుకలో ఉన్నాయి. అమావాస్య నాడు పూర్వీకులను పూజించి, శ్రాద్ధ కర్మలు జరిపిస్తే వారి ఆత్మకు శాంతి కలగడంతో పాటు శ్రాద్ధ కర్మలు జరిపిన వారికి కూడా పూర్వీకుల ఆశిస్తులు లభిస్తాయనేది ఒక నమ్మకం. జనవరి 21, 2023 నాడు మాఘ అమావాస్య వచ్చింది. పైగా ఈ అమావాస్య శనివారం నాడు వస్తుండటంతో దీనినే శని అమావాస్య అని కూడా అంటారు. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అకల్ట్ సైన్స్‌ సంస్థకు చెందిన సందీప్ రాయ్ అనే జ్యోతిష్యుడు ఈ శని అమావాస్య నాడు ఎలాంటి పనులు చేయకూడదు, ఎలాంటి పనులు చేయొచ్చు అనే విషయంలో కొన్ని సలహాలు, సూచనలు చెప్పుకొచ్చాడు. 

శని అమావాస్య నాడు ఏమేం చేస్తే మంచిది..
శని అమావాస్య నాడు ఉపవాసం చేస్తే జీవిత భాగస్వామితో పాటు వారి సంతానానికి మంచి జరుగుతుంది.
పూర్వీకుల నుంచి ఆశిస్సులు పొందడానికి రావి చెట్టు వద్ద ఆవాల నూనెతో దీపం వెలిగించండి.
వేకువ జామునే తలస్నానం చేసి ఆ మహా శివుడికి, విష్ణువుకు పూజలు చేయాలి.
పుట్టలో ఒక చెంచా పాలు పోయాలి. ఇలా చేయడం వల్ల జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు తొలగిపోతాయనేది పెద్దల విశ్వాసం.
శని దేవుడి వల్ల కలిగే దుష్పరిణామాలను అడ్డుకోవడానికి శని దేవుడి ఆలయంలో ఆవాల నూనె, నల్ల మినప పప్పు, ఒక ఇనుప ముక్క, నల్లటి వస్త్రం, నీలిరంగు పువ్వును సమర్పించి, శనిదేవుని వేద మంత్రాన్ని 101 సార్లు జపిస్తూ పూజ చేయండి. 'ఓం నీలాంజసమభాస్. రావుపుత్ర యమాగ్రజం. ఛాయామార్తాంద్సంభూత్ నమామి శనైశ్చర". శని గ్రహంతో పాటు ఇతర గ్రహాల నుంచి కలిగే దుష్ప్రభావాలను నివారిస్తుంది.
అమావాస్య నాడు గోధుమ పిండితో చేసిన ఉండలను చేపలకు ఆహారంగా తినిపించండి. ఇది ఆర్ధిక ఇబ్బందులను తొలగించి ఇంట్లో సరి సంపదలకు దారి తీస్తుందని ఒక నమ్మకం. 
దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారి కోసం: సూర్యోదయానికి ముందే స్నానం చేసి మీరు ధరించే ఏదైనా ఒక వస్త్రం నుండి ఒక దారం పోగును, విడిగా కొంచెం దూదిని తీసుకుని, ఆవనూనెతో నింపిన దీపంలో ముంచి హనుమంతుని విగ్రహం ముందు వెలిగించి 'హనుమాన్ చాలీసా' జపించండి. 
గోమాతకు ఐదు రకాల పండ్లను ఆహారంగా సమర్పించండి. ఇలా చేయడం ద్వారా కుటుంబంలో కలహాలు పోయి మనశ్శాంతి పెరుగుతుంది.
మీ పూర్వీకులందరికీ ధన్యవాదాలు తెలియజేసి మీ కుటుంబంలోని పెద్దల నుండి ఆశీర్వాదాలు తీసుకుంటే మీ కోరికలు నెరవేరుతాయి.

ఎలాంటి శుభకార్యాలు నిర్వహించకూడదు.
తులసి చెట్టుని అత్యంత పవిత్రంగా భావిస్తుంటాం కనుక అమావాస్య నాడు తులసి చెట్టు నుంచి ఆకులను తెంపవద్దు.
మాంసం, చేపలు, గుడ్డు, వెల్లుల్లి, ఉల్లిపాయలు వంటి ఆహారపదార్థాలను తీసుకోవద్దు.
వీలైతే దూర ప్రయాణాలు చేయడం మానుకోండి.
జీవితాన్ని మార్చేటటు వంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకూడదు.
ఇంట్లో గొడవలకు దూరంగా ఉండటం మంచిది.
ఎవ్వరిపైనా కోపం పనికిరాదు. దుర్భాషలకు దూరంగా ఉంటే మరీ మంచిది.
బయటకు వెళ్లేటప్పుడు చంద్ర గాయత్రీ మంత్రాన్ని జపించండి.
బయటికి వెళ్లేటప్పుడు స్వచ్ఛమైన మూన్‌స్టోన్ లాకెట్టును వెంట తీసుకెళ్లండి.

( గమనిక: ఈ కథనంలో ప్రస్తావించిన అభిప్రాయాలు జ్యోతిష్యుడు చెప్పిన వివరాల ఆధారంగా రాసినవి. ఈ అభిప్రాయాలు, సూచనలతో జీ న్యూస్ ఏ విధంగానూ ఏకీభవించడం లేదు )

ఇది కూడా చదవండి : Vastu Tips : లక్ష్మీ దేవి విగ్రహాన్ని ఇలా పెడితే వద్దన్నా ధనం వచ్చిపడుతుందట

ఇది కూడా చదవండి : How to Get Good Luck: ఇలాంటి పనులు చేస్తే దురదృష్టం పోయి అదృష్టం వెంట పడుతుందట

ఇది కూడా చదవండి : Mahindra XUV400 EV: మహింద్రా నుంచి మరో కొత్త బాహుబలి.. ఒక్కసారి రీచార్జ్ చేస్తే 456 కిమీ రేంజ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News