Mercury Transit 2023: ఆస్ట్రాలజీలో బుద్ధి, ఆర్థిక స్థితి మరియు వ్యాపారానికి కారకుడిగా బుధుడిని భావిస్తారు. మిథునం మరియు కన్యారాశులకు మెర్క్యూరీ అధిపతి. రీసెంట్ గా బుధుడు తన రాశిని మార్చుకుని శని రాశి అయిన కుంభరాశిలోకి ప్రవేశించాడు. బుధుడు మార్చి 15న వరకు అక్కడే ఉంటాడు. ఆ తర్వాత మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. కుంభంలో బుధుడు సంచరించడం వల్ల శుభప్రదమైన రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం నాలుగు రాశులవారికి మంచి చేయనుంది.
బుధ సంచారం ఈరాశులకు శుభప్రదం
మేషరాశి: బుధుడు సంచారం ద్వారా ఏర్పడిన వ్యతిరేక రాజయోగం మేషరాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. వీరి ఆదాయం పెరుగుతుంది. ఎక్కడి నుండైనా హఠాత్తుగా డబ్బు వస్తుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. పెట్టుబడి ద్వారా లాభం ఉంటుంది. పూర్వీకుల ఆస్తి మీకు కలిసి వస్తుంది.
కర్కాటకం: బుధుడు మారడం వల్ల ఏర్పడిన వ్యతిరేక రాజయోగం కర్కాటక రాశి వారికి గొప్ప ప్రయోజనాలను ఇస్తుంది. వ్యాపారంలో ఊహించని లాభాలు ఉంటాయి. ఉద్యోగంలో ఎదుగుదల ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
కన్య: కన్యా రాశి వారికి బుధ సంచారం ద్వారా ఏర్పడిన వ్యతిరేక రాజయోగం ధనలాభాన్ని ఇస్తుంది. ఆదాయం రెట్టింపు అవుతుంది. కోర్టు విషయాల్లో తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది. పూర్వీకుల ఆస్తుల వల్ల లాభం ఉంటుంది.
ధనుస్సు: ధనుస్సు రాశి వారికి విపరీత రాజయోగం వరమనే చెప్పాలి. ఉద్యోగులకు ఈ సమయం బాగుంటుంది. ఉద్యోగులకు పదోన్నతి లభిస్తుంది. వ్యాపారంలో లాభం ఉంటుంది.
Also read: Lakshmi Puja Upay: ఈరోజు లక్ష్మీదేవిని ఇలా పూజిస్తే... అదృష్టం మీ వెంటే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook