Viral video: ఇటీవలి కాలంలో ఆరోగ్యవంతంగా, ఫిట్‌గా ఉన్న వారు అకాల మృత్యువాత పడటం కలవరపెడుతోంది. గత ఏడాది కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణమే ఇందుకు ఉదాహరణ. ఎంతో ఫిట్‌గా, ప్రతి రోజు వ్యాయామం చేసే ఆయన.. గుండెపోటుతో మృతి చెందటం ఇంకా నమ్మలేకపోతున్నారు అభిమానులు.
అయితే ఇలాంటి ఘటనలు తరచుగా చోటు చోసుకుంటుండటం మరింత ఆందోలన కలిగిస్తున్న విషయం. ముఖ్యంగా 30-50 ఏళ్ల లోపు వ్యక్తకులు ఇలా అర్ధాంతరంగా తనువు చాలిస్తుండటం ఇటీవలికాలంలో ఎక్కువగా కనిపిస్తోంది.
తాజాగా బెంగళూరులో ఓ 35 ఏళ్ల మహిళ జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ ప్రాణాలు వదిలిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. శనివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో బెంగళూరులోని బ్యాప్పనహల్లిలో ఓ జిమ్‌లో.. అమె వ్యాయామం చేస్తున్న సమయంలోనే హార్ట్ఎటాక్ రావడంతో ప్రాణాలు విడిచించింది. ఈ దృష్యాలు జిమ్ సెంటర్లోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వీడియోను పబ్లిక్ స్పాట్ అనే యూట్యూబ్ ఛానెల్ అప్లోడ్ చేసింది. అచ్చం పునిత్ రాజ్ముమార్ (అప్పు)కు జరిగినట్టే ఆ మహిళకు కూడా ఆ యూట్యూబ్ ఛానెల్ డిస్క్రిప్షన్ రాసుకొచ్చింది.
ప్రముఖ వార్తా సంస్థ హిందుస్థాన్ టైమ్స్ ప్రకారం.. అమె పేరు వినయ విట్టల్గా తెలిసింది. అమె ఐడీసీలో బ్యాగ్రౌండ్ ఆఫీసర్‌గా పని చేస్తున్నట్లు వెల్లడైంది. అమె ప్రతి రోజూ జిమ్ చేస్తుందని.. అలాంటి అమెకు ఇలా హార్ట్ ఎటాక్ రావడం కుటుంబ సభ్యులను షాక్‌గు గురి చేసింది.
Also read: Desi Spiderman: దేశీ స్పైడర్ మ్యాన్ ను ఎప్పుడైనా చూశారా? అయితే ఇది చూడండి!
Also read: Viral Video: నడిరోడ్డులో ఈ-రిక్షా డ్రైవర్ ను కొట్టిన పోలీస్- వీడియో వైరల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook