Uttar Pradesh Biker Chain Snatching Women Shooing A Reel: రోడ్ల మీద కొన్నిసార్లు అనుకొని ఘటనలు జరుగుతుంటాయి. ముఖ్యంగా మనం బైక్ ల మీద వెళ్తున్నప్పులు లేదా సింగిల్ గా వెళ్తున్నప్పుడు మనల్ని ఆగంతకులు ఒక కంట కనిపెడుతునే ఉంటారు. సీక్రెట్ గా ఫాలో అయి, మెల్లగా ఒక్కసారిగా దాడులకు పాల్పడి, ఒంటి మీద ఉన్న బంగారంతో రెప్పపాటులో మాయమౌతుంటారు. చైన్ స్నాచర్స్ లు తరచుగా రద్దీ ఉన్న ప్రదేశాలను కాకుండా, నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశాలను టార్గెట్ చేసుకుంటారు. ఈ ప్లేసులలో జనాలు ఎక్కువగా కన్పించారు. చోరీలు చేసి ఈజీగా వెళ్లిపోవచ్చని ప్లాన్ లు చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరు ఏదో అడ్రస్ అడిగినట్లు, తాగడానికి నీళ్లు అడిగినట్లు నటిస్తారు. తీరా మనం అప్రమత్తంగా లేకుంటే మాత్రం మన మెడలోని చైన్ లు కానీ, నెకక్లెస్ లుకానీ ఇట్టే దోచేసి వెళ్లిపోతుంటారు. ఇలాంటి కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.
Ghaziabad: A snatcher looted the chain of a woman who was making a REEL.pic.twitter.com/lFPpSJGJZC
— زماں (@Delhiite_) March 24, 2024
ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒక మహిళ స్థానికంగా ఇంద్రపురంలో రోడ్డుపై నిల్చుని రీల్స్ కు ఫోజు లిచ్చింది. మరోక మహిళ ఆమె క్యాట్ వాక్ ను ఫోన్ లో రికార్డు చేస్తుంది. మహిళ గ్రాండ్ గా శారీ వేసుకుంది. అంతే కాకుండా.. సూపర్ గా పోజులు కొడుతూ.. మహిళ రికార్డు చేస్తున్న వైపుకు వస్తుంది. ఇంతలో ఒక యువకుడు హెల్మెట్ పెట్టుకుని వేగంగా మహిళ వద్దకు వచ్చాడు. అమాంతం ఆమె మెడలో నుంచి చైన్ ను లాక్కుని అక్కడి నుంచి రెప్పపాటులో పారిపోయాడు.
Read More: Guntur Kaaram: కుర్చీ మడతపెట్టి పాటకు మాస్ స్టెప్పులు వేసిన పెళ్లికూతురు.. వైరల్ గా మారిన వీడియో..
ఈ ఘటనతో మహిళలకు నోట మాటరాలేదు. కాసేపు షాకింగ్ లోనే ఉండిపోయింది. కాసేటికి తెరుకుని అక్కడున్న వారికి జరిగిన విషయం చెప్పింది. మహిళ తీసుకున్న ఫోన్ వీడియోలో ఈ చోరీ ఘటన స్పష్టంగా రికార్డు అయ్యింది. బాధిత మహిళ పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఈ వీడియో మాత్రం ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం కాస్తంత అలర్ట్ గా ఉండోద్దా.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook