Telangana Suryapet Road Accident Car Rams Parked Truck: ట్రాఫిక్ రూల్స్ పాటించాలని పోలీసులు ఎంత అవగాహన కల్పించిన కొందరు తమ పద్ధతి మాత్రం అస్సలు మార్చుకోరు. ట్రాఫిక్ పోలీసుల సూచనలను నిరంతరం బేఖాతరు చేస్తుంటారు. హెల్మెట్ పెట్టుకోకుండా టూవీర్లు, సీటు బెల్టు పెట్టుకోకుండా కార్లను నడిపించడం, రాంగ్ రూట్ లోకి చొచ్చుకుని వెళ్లడం చేస్తుంటారు. మరికొందరు సిగ్నల్స్ లను బ్రేక్ చేస్తుంటారు. అంతేకాకుండా.. తప్పతాగి వాహనాలను నడిపిస్తుంటారు. ఇలాంటి ఘటనలలో రోడ్డుపైన ప్రమాదాలకు కారణమౌతుంటారు. తమ ప్రాణాలను రిస్క్ లో పెట్టడమే కాకుండా.. తమ చుట్టుపక్కల వారిని కూడా రిస్క్ లో పడేస్తుంటారు. క్రౌడ్ గా ఉన్న ప్రదేశాలలో వాహనాలను రాంగ్ రూట్ లో నడిపిస్తుంటారు.
సీసీటీవీ ఫుటేజ్
సూర్యాపేట - మునగాల మండలం ముకుందపురం వద్ద ఆగివున్న లారీ కిందికి దూసుకుపోయిన కారు.. ఇద్దరు మృతి. https://t.co/v0E8A1a1H4 pic.twitter.com/R2XTANuT2T
— Telugu Scribe (@TeluguScribe) April 22, 2024
సరిగ్గ వాహనం నడిపించడం రాకున్న రోడ్డుమీదకు వచ్చేస్తుంటారు. ఇలాంటి సందర్భలలో రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. అమాయకులు కూడా వీరి బారిన పడి బలౌతుంటారు. కొందరు ట్రిబుల్ రైడింగ్ లు చేస్తుంటారు. హెల్మెట్ లను అస్సలు పెట్టుకోరు. సిగ్నల్ వద్ద, వాహనాలను తప్పించుకుని పారిపోతుంటారు. రాంగ్ రూట్ లలో వెళ్తుంటారు. కొందరు నిద్రమత్తులో తమ వాహనాలను నడిపిస్తుంటారు. దీంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇప్పటికే ఎందరో కీలక నేతలు వారి డ్రైవర్లు నిద్రమత్తులో వాహానాలు నడిపించడం వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఈకోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
పూర్తి వివరాలు..
తెలంగాణలోని సూర్యపేటలో హైవే మీద షాకింగ్ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటన చూస్తుంటే ఒళ్లంతా భయంపుడుతుంది. ఆగి ఉన్న ట్రక్ ను, వెనుక నుంచి కారు వచ్చి బలంగా ఢీకొట్టింది. కారువేగానికి ఆ ట్రక్ కిందకు ,ఏదో పేకమేడలా దూరిపోయింది. ఈ ఘటన అక్కడ ఉన్న సీసీ కెమెరాలలో రికార్డు అయ్యింది. సూర్యాపేట ప్రాంతంలోని.. మునగాల మండలం ముకుందపురం వద్ద ఆగివున్న లారీ కిందికి కారు దూసుకుని పోయింది. దీంతో రోడ్డు మీద ప్రయాణిస్తున్న వారంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైపోయింది.
కారులో ఉన్న వారిని బైటకు తీద్దామన్న తీయలేని పరిస్థితి ఏర్పడింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు.. ప్రమాదంలో సంఘటన స్థలంలోనే ఇద్దరు స్పాట్ లో చనిపోయినట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. క్రేన్‌ను రప్పించి కారును బయటకు తరలించి మృతదేహాలను బయటకు తీసినట్లు సమాచారం. ఈ ఘటనకు చెందిన వీడియో మాత్రంసోషల్ మీడియాలో వైరల్ గా మారింది.దీన్ని చూసిన నెటిజన్లు వామ్మో.. ఇదేందిరా నాయన.., డ్రైవర్ నిద్రమత్తు వల్ల ఎంటి ఘోరం జరిగిపోయిందంటూ కూడా కామెంట్లు పెడుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కారు నంబర్ ఆధారంగా, వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter