Vikas Dubey bitten by snake 7 times in uttar Pradesh: ఉత్తర ప్రదేశ్ లోకి ఫతేపూర్ లో జరిగిన ఒక ఘటన ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. స్థానికంగా ఉండే సౌరా గ్రామానికి చెందిన వికాస్ దూబే అనే వ్యక్తిని పాములు పగపట్టాయంట. అంతేకాకుండా.. అతగాడు 40 రోజుల వ్యవధిలో.. వేర్వేరు చోట్ల పాముల కాటుకు గురయ్యాడు. ఎక్కడికి వెళ్లిన కూడా ఏదో ఒక పాముకాటు వేయడం వల్ల అతగాడు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా.. అతని లక్ బాగుండటం వల్ల కాటు వేసిన ప్రతిసారి, డాక్టర్ల దగ్గరకు వెళ్లి, ప్రమాదం నుంచి మాత్రం బైటపడ్డాడు.
ఇప్పటి దాక ఏడు పర్యాయాలు అనేక పాములు కాటు వేశాయి. ఇదిలా ఉండగా.. అతనికి పాముల శాపం ఉందని, అందుకే పాములు అతడిని వదలట్లేదని అంటున్నారు. పాములకు అతను ఏదో పెద్ద అపకారం చేశాడని, అందుకు అతన్ని టార్గెట్ చేసి మరీ కాటు వేస్తుందని కూడా గ్రామస్థులు కథలుగా చెప్పుకుంటున్నారు. వికాస్ దూబే.. ఆరుసార్లు పాములకాటుకు గురైన నేపథ్యంలో.. గ్రామంలో నుంచి వెళ్లిపోయి మరో చోట తన అత్తాగారింట్లో ఉన్నాడు. కానీ అక్కడ కూడా పాము కాటుకు గురవ్వడం అందరిని షాకింగ్ కు గురిచేసింది.
ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఇదిలా ఉండగా.. వికాస్ దూబే.. గతంలో అతనికి ఒక స్వప్నంపడిందని, అందులో తొమ్మిదోసారి పాముకాటు వేశాక.. చనిపోతానని ఏవరో మాట్లాడి చెప్పినట్లు అతను చెప్పుకొచ్చాడు. ఇప్పటి వరకు ఏడు సార్లు పాముకాటువేసిందని, తొమ్మిదోసారి మాత్రం ఎవరు కూడా కాపాడలేరని వికాస్ దూబే చెప్తుండటం విని అతను కుటుంబీకులు, డాక్టర్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఇది అబద్ధం అని కొట్టిపారేద్దామంటే.. కళ్ల ముందు మనిషి ఉన్నాడు.. మరీ పాము పగ నిజంగా ఉంటుందా.. అందుకే ఇలా జరుగుతుందా..అని చర్చకూడా జోరుగా సాగుతుంది.
పాము పగ ఉంటుందా..?
కొన్నిసార్లు పాములు మనుషుల ఆవాసాలకు వస్తుంటాయి. ఎలుకల కోసం అవి వడ్లు, బియ్యం బస్తాలు ఉన్నచోట కన్పిస్తుంటాయి. కొందరు పాములు కన్పించగానే స్నేక్ హెల్పింగ్ సొసైటీ వారికి సమాచారం ఇస్తారు. కానీ మరికొందరు మాత్రం పాముల్ని చంపేస్తుంటారు. పాముల్ని చంపడం వల్ల కాలసర్పదోషం ఏర్పడుతుందని పండితులు చెబుతుంటారు. పాములను వంశంలో ఒక్కరు చంపిన కూడా.. ఆ వంశం అంతటికి పామును చంపిన దోషం చుట్టుకుంటుందంటారు. దీని వల్ల పెళ్లిళ్లు ఆలస్యమవ్వడం, ఉద్యోగాలు దొరక్కపోవడం, లైఫ్ లో సెటిల్ మెంట్ ఆలస్యం వంటి ఘటనలు జరుగుతుంటాయి.
Read more: Snakes smuggling: అక్కడ ఎలా దాచావ్ భయ్యా.. ప్యాంటులో 100 కు పైగా బతికున్న పాములు.. వీడియో వైరల్.
అందుకు పాముల్ని చంపోద్దని చెప్తుంటారు. అందుకే హిందూ సంప్రదాయంలో పాములను కూడా దేవతలుగా కొలుచుకుంటాం. అందుకు పాములకు ఆపద కల్గించకూడదంటారు. కానీ మరికొందరు మాత్రం సైన్స్ ఇంత డెవలప్ అవుతుంది.. పాము పగ ఏంటని కొట్టి పారేస్తున్నవారు కూడా ఉన్నారు. కానీ ఈ ఘటన మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి