Viral News: ఇదేందయ్యో ఇది.. సింగిల్ ప్లాస్టిక్ బకెట్‌కు రూ.26 వేలు.. షాక్ తింటున్న నెటిజన్లు

Single Plastic Bucket For Rs.26k: అమెజాన్‌లో అమ్మకానికి ఉంచిన ఓ ప్లాస్టిక్ బకెట్ ధర చూసి నెటిజన్లు షాక్ తింటున్నారు. దీని ధర ఏకంగా రూ.26 వేలు కావడం గమనార్హం.   

Written by - ZH Telugu Desk | Last Updated : May 24, 2022, 07:19 PM IST
  • అమెజాన్‌లో బకెట్ ధర చూసి షాక్ తింటున్న నెటిజన్లు
  • సింగిల్ ప్లాస్టిక్ బకెట్ ధర రూ.26 వేలు
  • అది కూడా డిస్కౌంట్‌పై... ఈఎంఐ సదుపాయం కూడా ఉంది..
 Viral News: ఇదేందయ్యో ఇది.. సింగిల్ ప్లాస్టిక్ బకెట్‌కు రూ.26 వేలు.. షాక్ తింటున్న నెటిజన్లు

Single Plastic Bucket For Rs.26k: సాధారణంగా ఇళ్లల్లో ఉపయోగించే ప్లాస్టిక్ బకెట్ ధర ఎంత ఉంటుంది.. మహా అయితే రూ.200కి కాస్త అటు, ఇటుగా ఉండొచ్చు. కానీ ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్‌లో సింగిల్ ప్లాస్టిక్ బకెట్ ధర రూ.26 వేలుగా ఉంది. మరింత షాక్ అనిపించే విషయమేంటంటే... ఈ బకెట్ ఇప్పటికే అమ్ముడైపోయింది. దీని ధర చూసి షాక్ తింటున్న నెటిజన్లు... అంత ధర పెట్టి ఎవరు కొన్నారో అంటూ సోషల్ మీడియాలో ఆరా తీస్తున్నారు.

అంతేనా... నిజానికి దీని ధర రూ.35,900 అయినప్పటికీ  అమెజాన్‌లో 28 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ.25,999కే అందిస్తున్నట్లు పేర్కొన్నారు. పైగా ఈఎంఐ సదుపాయం కూడా ఉన్నట్లు తెలిపారు. ఓ నెటిజన్ దీన్ని స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్‌గా మారింది. 'ఇప్పుడే అమెజాన్‌లో ఇది చూశాను... ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు...' అంటూ సదరు నెటిజన్ తన పోస్టుకు ఫన్నీ కామెంట్‌ను జోడించాడు.

అతని పోస్టుపై స్పందించిన ఓ నెటిజన్... ఓ సందేహాన్ని లేవనెత్తారు. చూసేందుకు అది బకెట్ అయి ఉండొచ్చు కానీ లోపల కోడెడ్ ఐటెం ఉంటే ఎలా అని సందేహం వ్యక్తం చేశారు. అక్రమ వస్తువులను అమ్ముకునేందుకు ఇదొక మంచి మార్గంలా మారిందని కామెంట్ చేశారు. బహుశా సాంకేతిక లోపం వల్లే ఇలా జరిగి ఉండొచ్చునని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేయడం గమనార్హం.

చౌక ధరలో దొరికే వస్తువులను ఆన్‌లైన్‌లో ఇలా షాకింగ్ ధరలకు విక్రయించడం ఇదేమీ తొలిసారి కాదు. ఇటీవల యూకెకి చెందిన ఓ వ్యక్తి ఒకే ఒక్క పొటాటో చిప్‌ను రూ.1.63 లక్షలకు అమ్మకానికి పెట్టాడు. ఇది అత్యంత అరుదైన చిప్‌ అని దాని డిస్క్రిప్షన్‌లో పేర్కొన్నారు. ఎంత అరుదైనదైనా... ఒక్క ఆలు చిప్‌కి ఇంత ధరా అని నెటిజన్లు విస్మయం వ్యక్తం చేశారు. 
 

Also Read: దావోస్‌లో కేటీఆర్ జోరు.. తెలంగాణకు పెట్టుబడుల మీద పెట్టుబడులు... మరో కంపెనీతో కుదిరిన భారీ డీల్...  

Also Read: High Tension in Amalapuram: అమలాపురంలో హైటెన్షన్... ఎస్పీ వాహనంపై రాళ్ల దాడి.. ఆందోళనకారులపై లాఠీఛార్జి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

 

Trending News