Giant anaconda floating in water: సోషల్ మీడియాలో (Social Media) రోజూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇందులో జంతువులకు సంబంధించిన వీడియోలు ఈ మధ్య తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఇందులో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే...మరికొన్ని ఆశ్చర్యపరుస్తాయి. ఇంకొన్ని వీడియోలు అయితే భయపుట్టిస్తాయి. అయితే ఈ భూమిపై అతిపెద్ద పాములు ఏమైనా ఉన్నాయంటే అవి అనకొండలనే చెప్పాలి. వీటి పొడవు సుమారు 30 అడుగుల వరకు ఉంటుంది. ఇవీ ఒక మనిషిని అమాంతం మింగేయగలవు. తాజాగా ఓ పెద్ద అనకొండ (Anaconda video) నీటిలో తేలుతూ వెళ్తున్న వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.
ఈ వీడియో ఓపెన్ చేస్తే.. ఓ అడవి మధ్యలో నుంచి కొంతమంది పడవలో వెళ్తుంటారు. సడన్ గా ఓ పెద్ద అనకొండ వారికి కనిపిస్తోంది. దీంతో ఒక్కసారిగా వారు కేకలు వేస్తారు. ఆ అనకొండను గమనిస్తే...అది అప్పుడే ఓ జంతువును మింగినట్లు తెలుస్తోంది. ఎందుకంటే దాని కడుపు మధ్యలో ఉబ్బినట్లే వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. అది వారందరూ చూస్తుండగానే నీటిలో ఈదకుంటూ వెళ్లిపోతుంది. ఇలాంటి అనకొండలను సినిమాల్లోనూ చూస్తాం...నిజం జీవితంలో చూడగానే షాక్ కు గురవుతాం. ఈ వీడియో అన్‌టోల్డ్_నేచర్ అనే ఇన్‌స్టాగ్రామ్‌లో (Instagram) షేర్ చేయబడింది. ఈ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. మీరు చూసేయండి మరి.
Also Read: Peacock Funny Video: 'నా గుడ్డు తీసుకుంటావా?'.. వ్యక్తిపై దాడి చేసిన నెమలి.. వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook