RRR Fever: నేపాల్​లో ఆర్ఆర్​ఆర్ రచ్చ.. థియేటర్లలో ఊగిపోతున్న జనం!

RRR Fever: విదేశాల్లోను ఆర్​ఆర్​ఆర్ మూవీ అదరగొడుతోంది. కలెక్షన్ల మాట అటుంచితే.. ప్రేక్షకులు మాత్రం మూవీని తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఓ వైరల్ వీడియోను చూసేద్దామా.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 31, 2022, 06:30 PM IST
  • విదేశాల్లో ఆర్​ఆర్​ఆర్​ సందడి..
  • థియేటర్లలో అభిమానుల డ్యాన్సులు
  • నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలు..
RRR Fever: నేపాల్​లో ఆర్ఆర్​ఆర్ రచ్చ.. థియేటర్లలో ఊగిపోతున్న జనం!

RRR Fever: గత కొన్నాళ్లుగా తెలుగా తెలుగు సినిమలకు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా బాహుబలి తర్వాత తెలుగు సినిమాలు.. ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదలవుతున్నాయి. అన్ని చోట్ల హిట్​ టాక్ తెచ్చుకుంటున్నాయి. పుష్పా, ఆర్​ఆర్​ఆర్​ మూవీస్ ఇందుకు నిదర్శనం.

గత ఏడాది విడుదలైన పుష్ప మూవీ సాంగ్స్​, డైలాగ్స్ ప్రపంచవ్యాప్తంగా ట్రెండవుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆర్​ఆర్​ఆర్ మూవీ సందడి మొదలైంది. ఈ నెల 25న విడుదలైన ఆర్​ఆర్​ఆర్ హిట్​ టాక్ తెచ్చుకుంది.

ఇక ఈ మూవీలో పాటలు తెగ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఎన్​టీఆర్​, రామ్​ చరణ్​లు సూపర్ డ్యాన్స్​ చేసిన నాటు నాటు (హిందీలో నాచొ నాచో) పాట థియేటర్లో చూసిన వారందిని ఒక ఊపు ఊపేస్తోంది. కొంత మంది థియేటర్లలో స్టెప్పులేస్తున్నారు కూడా.

అయితే మన తెలుగులోనో.. ఇండియాలోని ఏ థియేటర్లలోనో అయితే సహజమే. కానీ ఓ భారతీయ సినిమాకు వేరే దేశాల్లోని థియేటర్లలో జనాలు మాస్ సందడి చేయడం నిజంగానే గొప్ప విషయమంటున్నారు

ఇందంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే.. ఇటీవల నేపాల్​లో ఆర్​ఆర్​ఆర్ సినిమాను చూసిన అభిమానులు థియేటర్లో డ్యాన్సులు చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఒకే స్క్రీన్​పై ఎన్​టీఆర్​, రామ్​ చరణ్​, ఆలియా భట్, అజయ్​ దేవ్​గన్​ కనిపించిన పాటకు.. నేపాల్లోని ఓ థియేటర్లో అభిమానులు డ్యాన్సులు చేశారు. ముందు వరుసలో ఉన్న సీట్లలో ఏ ఒక్కరు కూడా తమ సీట్లల్లో లేరంటే అర్థం చేసుకోవచ్చు.. ఆర్​ఆర్​ఆర్ ఫీవర్ ఎలా ఉందో.

ఇందుకు సంబంధించిన వీడియోను దినేశ్​ శ్రేష్ట అనే ట్విట్టర్​ యూజర్ షేర్ చేశాడు. నేపాల్​లో ఆర్​ఆర్​ఆర్​ మూవీకి ఉన్న క్రేజ్ చూస్తే.. మతి పోతోంది అంటూ రాసుకొచ్చాడు. ఆ వీడియోకు కామెంట్స్​ కూడా చాలా క్రేజీగా వస్తుండటం విశేషం. ఆర్​ఆర్​ఆర్ మూవీ కాదు.. అది పండగ అంటూ మరో యూజర్ రిప్లయ్​ ఇచ్చాడు. మరి ఓ వీడియోను మీరూ చూసేయండి.

Also read: Optical Illusion: ఈ చిత్రంలో ఎన్ని జంతువులున్నాయో చెప్తే.. మీరు నిజంగా మేధావే!

Also read: Viral Video: బతికున్న పాముని అమాంతం మింగేసిన కింగ్ కోబ్రా.. వీడియో చూస్తే అంతే..!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News