Methuselah: ఈ చేప వయసు 90 ఏళ్లు.. భూమిపై ఎక్కువ వయసున్న చేప ఇదే!

oldest aquarium fish: ఈ చేప వయసు 90 ఏళ్లు. మీరు విన్నది నిజమే. ప్రపంచంలో జీవిస్తున్న అక్వేరియం చేపల్లో ఇదే అతిపెద్దది. దీని గురించి తెలియాలంటే ఈ స్టోరీ చదవేయండి.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 27, 2022, 08:30 AM IST
  • భూమిపై అత్య‌ధిక‌ కాలం పాటు జీవించియున్న చేప ఇదే
  • ఈ చేప వయసు 90 ఏళ్లు
Methuselah: ఈ చేప వయసు 90 ఏళ్లు.. భూమిపై ఎక్కువ వయసున్న చేప ఇదే!

oldest aquarium fish lives in San Francisco: సాధారణంగా చేపలు 3 నుంచి 15 ఏళ్ల్లు వరకు జీవిస్తాయి. వెల్స్ క్యాట్ ఫిష్ అయితే 60 ఏళ్లు జీవిస్తుంది. కానీ, అక్వేరియంలో జీవించే చేప‌లు ఎంత‌కాలం జీవిస్తాయి అనే విష‌యంలో ఖ‌చ్చిత‌మైన వ‌య‌స్సు నిర్ధార‌ణ ఉండ‌దు. అయితే దాదాపు 90 ఏళ్ల వయసున్న అక్వేరియం చేప అమెరికా శాన్​ ఫ్రాన్సిస్కో (San Francisco) మ్యూజియంలో ఉంది. ప్రపంచంలో జీవిస్తున్న అక్వేరియం చేపల్లో ఇదే అతిపెద్దది కావడం విశేషం. ఈ లంగ్‌ఫిష్‌ పొడవు 4 అడుగులు, బరువు 40 పౌండ్లు. 1938లో ఆస్ట్రేలియా నుంచి దీన్ని అమెరికాకు తీసుకొచ్చారు. అప్పటికే దాని వయసు 6 సంవత్సరాలు.

'మెతుసెలా' అనే వ్యక్తి 969 సంవత్సరాలు బతికారని బైబిల్‌లో ఉంది. ఆయన పేరు మీద ఈ చేపకు మెతుసెలా అని నామకరణం చేశారు. అయితే బైబిల్​లో మెతుసెలాలా మరీ 9 శతాబ్దాలు జీవించకపోయినా... 9 దశాబ్దాలుగా జీవిస్తోంది ఈ చేప. ప్రపంచంలోని అక్వేరియం చేపల్లో ఇదే అతిపెద్దది(వయసులో) కావడం గమనార్హం. మెతుసెలాకు (Methuselah) ముందు మరో ఆస్ట్రేలియన్​ లంగ్​ఫిష్​ ( Australian lungfish) చికాగాలోని షెడ్ అక్వేరియంలో జీవించి ఉండేది. అయితే అది 95ఏళ్ల వయసులో 2017లో చనిపోయింది.

Also Read: Video: విష సర్పాన్నే బెంబేలెత్తించిన తల్లి ఎలుక.. పిల్ల ఎలుక కోసం ఎంత ఆరాటమో..

మెతుసెలా ఆడ చేప అని సంరక్షకులు పేర్కొంటున్నారు. అయితే ఇలాంటి చేపలకు లింగనిర్ధారణ పరీక్షలు చేయకుండా ఓ అంచనాకు రావడం కష్టం. అందుకే దీని మొప్పలను పరీక్షకు పంపి, లింగం, వయసుపై కచ్చితమైన అంచనాకు రావాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ లంగ్​ఫిష్​ను అంతరించిపోతున్న జాతుల జాబితాలో చేర్చింది ఆస్ట్రేలియా ప్రభుత్వం. అయితే మెతుసెలా బతికి ఉన్నంతవరకు దానికి ఇష్టమైన ఫిగ్​(అంజీర), బెల్లీ రబ్స్​నే ఆహారంగా అందిస్తామని సంరక్షకులు చెప్పారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News