Man swallows Apple AirPods while sleeping: Music వింటూ నిద్రపోయాడు.. నిద్రలో Apple AirPods మింగేశాడు..

Man swallows Apple AirPods while sleeping: ఓ వ్యక్తి రాత్రి పూట Apple AirPods earbuds headphones తో మ్యూజిక్ వింటూ వింటూ అలాగే నిద్రలోకి జారుకున్నాడు. అలాగే నిద్రమత్తులో ఆ Wireless headphones లో పొరపాటున ఒకదానిని మింగేశాడు. అది కాస్తా ఛాతిలోరి జారుకుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 9, 2021, 04:30 PM IST
  • రాత్రి పడుకునే ముందు మ్యూజిక్ వింటూ యాపిల్ వైర్‌లెస్ హెడ్ సెట్ మింగిన యువకుడు.
  • ఉదయాన్నే ఒకింత అస్వస్థతకు గురైన యువకుడు.
  • అతడి X-Ray రిపోర్ట్ చూసి ఆశ్చర్యపోయిన డాక్టర్స్.. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి..
Man swallows Apple AirPods while sleeping: Music వింటూ నిద్రపోయాడు.. నిద్రలో Apple AirPods మింగేశాడు..

Man swallows Apple AirPods while sleeping: నిద్ర పోయే ముందు మీకు మ్యూజిక్ వినే అలవాటు ఉందా ? లేదంటే పడుకునే ముందు మనసుకు నచ్చిన వీడియోలు, సినిమాలు చూస్తే తప్ప లేదంటే నిద్రపట్టని అలవాటు ఉందా ? ఒకవేళ మీకు ఈ అలవాటు లేకపోయినా.. మీ చుట్టూ ఉన్న వాళ్లలో చాలామందికి ఇలాంటి అలవాట్లు ఉండటం గమనించే ఉండుంటారు. ఇంతకీ ఇప్పుడిదంతా ఎందుకు అనవసరపు చర్చ అంటారా ? మరేం లేదండీ... అలాంటి అలవాటే ఉన్న ఓ వ్యక్తి రాత్రి పూట Apple AirPods earbuds headphones తో మ్యూజిక్ వింటూ వింటూ అలాగే నిద్రలోకి జారుకున్నాడు. అలాగే నిద్రమత్తులో ఆ Wireless headphones లో పొరపాటున ఒకదానిని మింగేశాడు. అది కాస్తా ఛాతిలోరి జారుకుంది. 

Here's one for the record books... I woke up this morning, felt fine, but when I tried to drink a glass of water it...

Posted by Bradford Gauthier on Tuesday, February 2, 2021

ఉదయాన్నే నిద్రలేచాకా నీళ్లు తాగుదామని ప్రయత్నిస్తే నీళ్లు గొంతులోకి దిగడం లేదు.. అదే సమయంలో అతడికి ఛాతిలో నొప్పిగానూ అనిపించింది. గొంతు తడి ఆరిపోయి పూర్తి డ్రైగా మారడంతో (Dry throat ) ఏదో అనుమానం వచ్చింది. వెంటనే నేను పడుకునే ముందు చెవిలో పెట్టుకున్న Airpods headphones కోసం వెతికాను. Bed room మొత్తం వెతికినా ఒక్కటే హెడ్ సెట్ కనిపించింది. అనుమానంతో X-Ray తీయించగా అప్పుడు తేలింది... గొంతును, పొట్టను అనుసంధానం చేసి ఉండే పేగులో (Esophagus) Ear phone చిక్కుకుందని గుర్తించిన వైద్యులు.. అతడికి అత్యవసర చికిత్స నిర్వహించి ఆ Apple AirPods headphone ను వెలికి తీశారు. 

Also read : LIC policy holders: ఎల్ఐసి పాలసీ హోల్డర్స్‌కి Good news.. LIC IPO వీళ్లకే ప్రాధాన్యత

ఈ విషయాన్ని బాధితుడే ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా వెల్లడించడంతో బయటి ప్రపంచానికి తెలిసిందే. మరొకరు ఇదే తప్పిదాన్ని చేయకుండా జాగ్రత్తపడేందుకు అతడు తన అనుభవాన్ని Facebook post ద్వారా చెప్పాడని అనిపిస్తోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News