Man Kissing King Cobra Hood: పడగ విప్పిన నాగుపాముని ముద్దాడిన మొనగాడు

Man Kissing King Cobra Hood: సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు చూడగానే ఔరా అనిపించేలా ఉంటాయి. ఇంకొన్ని రకాల వీడియోలను చూస్తే.. ఇవి వైరల్ కాకుండా ఆపడం ఎవ్వరి తరం కాదు అనిపిస్తుంటుంది. ఇప్పుడు మీరు చూడబోయే వీడియో కూడా అలా గూస్‌బంప్స్ తెప్పించే వీడియోనే.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 10, 2023, 03:31 PM IST
Man Kissing King Cobra Hood: పడగ విప్పిన నాగుపాముని ముద్దాడిన మొనగాడు

Man Kissing King Cobra Hood: సోషల్ మీడియా అంటేనే క్రేజీ వీడియోలకు కేరాఫ్ అడ్రస్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ లాంటి సామాజిక మాధ్యమాల్లో నిత్యం ఎన్నో క్రేజీ వీడియోలు కనిపిస్తుంటాయి. అందులో కొన్ని రెగ్యులర్ గా అనిపించే వీడియోలు కాగా.. ఇంకొన్ని చూడగానే ఔరా అనిపించేలా ఉంటాయి. ఇందులో మొదటి రకం వీడియోలకు అంతగా ఆధరణ ఉన్నా లేకున్నా.. రెండో రకం వీడియోలకు మాత్రం భారీ క్రేజ్ కనిపిస్తుంటుంది. అంతేకాదు.. ఈ రెండో రకం వీడియోలను వైరల్ కాకుండా ఆపడం ఎవ్వరి తరం కాదు. ఎందుకంటే అలాంటి వీడియోలు మన కళ్లను మనమే నమ్మలేం అనే తరహాలో ఉంటాయి. మళ్లీ మళ్లీ చూసినా మనం చూస్తోంది నిజమేనా అని ఆశ్చర్యపోయేలా ఉంటాయి. ఇదిగో ఇప్పుడు మీరు చూడబోయే ఈ వీడియో కూడా ఎగ్జాట్లీ అలాంటి వీడియోనే.

ఇక్కడ వీడియోలో మీరు చూస్తోన్న వ్యక్తి పేరు బ్రియాన్ బార్జిక్.. ఇతని జీవితం అంతా సర్పాలు, ఇతర వణ్యప్రాణులు, జంతుజాలంతోనే ముడిపడి ఉంది. అరుదైన పాములను, వణ్యప్రాణులను పెంచడం, వాటి పోషించడం, వాటి బాగోగులు చూసుకోవడం.. ఇదే బ్రియాన్‌కి ఫుల్ టైమ్ వర్క్... అంతేకాదు.. వారానికి ఏడు రోజులు తన యూట్యూబ్ ఛానెల్లో, సోషల్ మీడియా ఎకౌంట్స్ పేజీల్లో ఏదో ఒక వీడియో అప్‌లోడ్ చేయడం కూడా బ్రియాన్ కి ఫుల్ టైమ్ వర్క్ లాంటిదే. పాములు, ఇతర జీవులను పెంచి, పోషించడం, వాటి వీడియోలను ఇంటర్నెట్లో అప్ లోడ్ చేయడం.. ఇదే బ్రియాన్ కి తెలిసిన ప్రపంచం.

ఇప్పుడు మీరు చూడబోయే వైరల్ వీడియో కూడా బ్రియాన్ తన వ్యాపకంలో భాగంగా అప్‌లోడ్ చేసిందే. పడగ విప్పి మరీ బుసలు కొడుతున్న ఈ నాగు పామును బ్రియాన్ ఎంతో ధైర్యంగా పడగపై ముద్దు పెట్టడం చూశారు కదా.. చూడ్డానికి భయంతో ఒళ్లు జలదరించేదిగా ఉన్న ఈ వీడియోను బ్రియాన్ షార్ట్ వీడియోగా యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు. పడగవిప్పిన నాగుపాముకు ముద్దు పెడుతున్న అతడిని చూసి అతడిది సాహసం అనాలో లేక దుస్సాహసం అనాలో అర్థం కావడం లేదు అంటున్నారు నెటిజెన్స్. 

బ్రియాన్ పడగ విప్పిన పాముకు ముద్దు పెడుతున్న వీడియో కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి

ఇది కూడా చదవండి : Whiskey Maggi Recipe: మ్యాగీతో మందుబాబు ప్రయోగం

పడగపై ముద్దు పెట్టే సమయంలో ఆ పాము కానీ ఒక్కసారిగా వెనక్కి తిరిగి కసిగా అతడి ముఖంపై ఒక్క కాటు వేస్తే అప్పుడు అతడి పరిస్థితి ఏంటి అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అందుకే విష సర్పాలతో ఇలాంటి పనులు చేయడం క్రేజీ అనుకోవడం కంటే దుస్సాహసం అనే అనుకోవచ్చు. కాకపోతే పాములకు ఆహార పెడుతూ, వాటిని పెంచడమే పనిగా పెట్టుకున్న బ్రియాన్‌కి ఇది పెద్ద కష్టమైన పనేమీ కాకపోవచ్చు కానీ.. ఈ వీడియో చూసి వేరే వాళ్లు మాత్రం ఇలాంటి దుస్సాహసం చేయాలి అని మాత్రం అస్సలే అనుకోవద్దు. ఎందుకంటే విష సర్పాలతో ఆట ప్రాణాలతో చెలగాటం లాంటిది. పాములతో విన్యాసం చేయడంలో ఏ మాత్రం అటు ఇటైనా అతడి కుటుంబసభ్యులు అతడి ఫోటోకి దండేసి దండం పెట్టుకోవాల్సి వస్తుంది. వైరల్ వీడియోలు కోసం ఇలాంటి దుస్సాహాసాలు అస్సలే చేయొద్దు అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇలాంటి సాహసాలు అన్నీ నిపుణులకు మాత్రమే తెలిసిన విద్య అని మర్చిపోవద్దు.

ఇది కూడా చదవండి : King Cobra Man Viral Video: కింగ్ కోబ్రా మెడను గట్టిగా పట్టుకున్న వ్యక్తి.. నొప్పితో విలవిలలాడిన పాము! షాకింగ్ వీడియో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News