మధ్యప్రదేశ్ లో అమానవీయ ఘటన: వ్యక్తిని చితకబాది.. ట్రక్కుకు కట్టేసి ఈడ్చుకెళ్లి..

Torture: ఓ వ్యక్తిని తీవ్రంగా చితకబాది, తాళ్లతో కట్టి ట్రక్కుతో ఈడ్చుకెళ్లిన అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌ నీమచ్‌ జిల్లాలో జరిగింది. తీవ్రంగా గాయపడిన బాధితుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. 

Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 30, 2021, 02:41 PM IST
మధ్యప్రదేశ్ లో అమానవీయ ఘటన: వ్యక్తిని చితకబాది.. ట్రక్కుకు కట్టేసి ఈడ్చుకెళ్లి..

Torture: రాను రాను మనుషుల్లో మానవత్వం(humanity) చచ్చిపోతుంది. కనికరం లేకుండా కసాయిల్లా ప్రవర్తిస్తున్నారు. ఓ వ్యక్తిని తీవ్రంగా చితకబాది, తాళ్లతో కట్టి ట్రక్కుతో ఈడ్చుకెళ్లిన అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌(Madhya Pradesh) రాష్ట్రంలోని నీమచ్‌ జిల్లాలో చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన బాధితుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇందుకు సంబంధించి దృశ్యాలు సోషల్ మీడియా(Social Media)లో వైరల్‌గా మారాయి.

వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్ రాష్ట్రం నీమచ్(Neemuch district) జిల్లాలోని సింగోలీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బండ గ్రామానికి చెందిన కన్హయలాల్‌ భీల్‌(40) సింగోలీ- నీమచ్‌ ప్రధాన రహదారిపై గత గురువారం నిలుచుని ఉన్నాడు. ఛితర్‌ మాల్‌ గుర్జార్‌ అనే పాల వ్యాపారి(Dairy trader) ద్విచక్రవాహనంపై వచ్చి భీల్‌ను ఢీకొట్టి కిందపడిపోయాడు. దీంతో పాలు మొత్తం నేలపాలయ్యాయి. దీంతో కోపోద్రక్తుడైన గుర్జార్.. భీల్‌పై దాడి చేశాడు. ఆ తర్వాత తన స్నేహితులను పిలిచి.. తీవ్రంగా కొట్టించాడు. అందరు కలిసి భీల్‌ కాళ్లకు తాడుతో బంధించి.. ట్రక్కు వెనకాల కట్టేసి కొంత దూరం ఈడ్చుకెళ్లారు. ఇందుకు సంబంధించి స్థానికులు వీడియోలు చిత్రీకరించి.. పోలీసులకు సమాచారం అందించారు.

Also Read: PV Sindhu: పీవీ సింధుకు 'చిరు' సత్కారం..వీడియో వైరల్

ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు(Police) బాధితుడిని బంధం విముక్తి  చేసి.. ఆసుపత్రికి తరలించారు. కాగా, అప్పటికే.. యువకుడిపై దాడికి పాల్పడిన దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు.. బాధితుడిని జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, చికిత్స పొందుతూ భీల్‌ మృతి చెందాడు. ఈ దారుణానికి పాల్పడ్డ మొత్తం ఎనిమిది మందిపై కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ సూరజ్‌ కుమార్‌ వర్మ తెలిపారు. ఇప్పటి వరకు ఐదుగురిని అరెస్ట్‌ చేశామని.. పరారీలో ఉన్నవారి కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News