King Cobra Vs Iguana Lizard: పాము ముంగిసల వైరం ఈనాటి కాదని చెబుతారు. ఈ రెండూ ఎదురుపడితే మాత్రం ఏం జరుగుతుందో ఏమో తెలియదు కానీ యుద్ధమే చేస్తాయి. ఇద్దరిట్లో ఎవరో ఒకరు చావాల్సిందే. అంతలా ముంగిసపై ఎగిసిపడే పాములు తాజాగా తొండపై ఎగబడ్డాయి. ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో పాములు చుట్టుముట్టాయి. కానీ వాటి నోటికి చిక్కినట్టే చిక్కి తొండ జారుకుంది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఎక్కడా భయపడకుండా.. విశ్రమించుకుండా తొండ పోరాడి గొప్పగా తప్పించుకుంది.
Also Read: Matrimony Cheating: బట్టతల.. బారెడు పొట్టతో 50 మంది అమ్మాయిలను మోసం.. బాసూ నీవు గ్రేటూ
బీబీసీ జంతు జీవ రాశులపై ప్రసారం చేసిన వీడియో ఒకటి అమెజింగ్ నేచర్ అనే 'ఎక్స్' అకౌంట్ నిర్వాహకులు పోస్టు చేశారు. సముద్ర తీరంలో ఆహారం కోసం ఎదురుచూస్తున్న పాములను చిత్రీకరించారు. ఈ సమయంలో తొండ అటువైపు వచ్చింది. వెంటనే పాములు అక్కడకు వచ్చాయి. పాములను చూసిన తొండ అక్కడే నిలబడిపోయింది. చడీచప్పుడు లేకుండా నిలిచిపోవడంతో పాములు తొండను గమనించలేకపోయాయి. కానీ కొద్దిసేపటికి తొండ గుండెచప్పుడు విన్న పాములు వెంటనే దానికి వద్దకు వెళ్లాయి.
Also Read: Love Fraud: లవ్ పేరిట వంచకుడు మోసం.. రూ.4 కోట్లు నష్టపోయిన 'ఆంటీ'
ఒక పాము మెల్లగా పాకుతూ చటుక్కున తొండను కరచుకునే ప్రయత్నం చేసింది. పాము దాడిని గ్రహించిన తొండ ఒక్కసారిగా పరుగెత్తింది. ఆ తర్వాత పదుల సంఖ్యలో పాములు తొండపై దండయాత్ర చేశాయి. అడుగడుగున తొండను పట్టుకునేందుకు పాములు తీవ్ర ప్రయత్నం చేశాయి. చివరకు ఒక బండరాయి కింద పాములు అన్నీ ఒకేసారి దాడి చేయడంతో వాటి వలలో తొండ చిక్కుకుంది. ఇక తొండ పని అయిపోయిందని ఆ వీడియో చూసిన నెటిజన్లు భావించారు. కానీ నెటిజన్ల అంచనాలను తొండ తలకిందులు చేసింది.
పద్మవ్యూహం లాంటి పాముల ఉచ్చు నుంచి తొండ చాకచక్యంగా తప్పించుకుంది. తుర్రున జారుకున్న తొండ ఇక క్షణం ఆగకుండా ఒకటే పరుగెత్తింది. రాళ్లు రప్పలు దాటుకుంటూ చివరకు ఓ కొండ అంచున చేరుకుంది. తొండను చిక్కించుకోవాలని పాములు తీవ్రంగా ప్రయత్నించగా వాటికి అసాధ్యమైంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. పాము గొప్పగా పోరాడి తప్పించుకుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దాన్ని మనం కూడా కష్టకాలంలో అవకాశాలు చేజారాయని నిరుత్సాహానికి గురికాకుండా చివరి వరకు పోరాడితే తొండ మాదిరి తప్పించుకోవవచ్చని చెబుతున్నారు.
The snakes coming out of the rocks was like something straight out of a horror movie pic.twitter.com/X6U9OOeILM
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) November 4, 2024
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.