Viral Video: రెండు టన్నులు ఉన్న భారీ చేపను ఎప్పుడైనా చూశారా? చూడకపోతే చూసేయండి..

Shocking: దాదాపు రెండు టన్నుల బరువున్న చేప ఒకటి వేటగాళ్లకు చిక్కింది. ఈ చేపను చూసి శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. ఇప్పడు ఈ చేప వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 21, 2021, 04:45 PM IST
Viral Video: రెండు టన్నులు ఉన్న భారీ చేపను ఎప్పుడైనా చూశారా? చూడకపోతే చూసేయండి..

Sun Fish: సముద్రాలు..ఎన్నో రహస్యాలకు నిలయాలు. ఎన్నో రకాల జీవులకు ఆవాసాలు. మానవుడి చరిత్రకు సంబంధించిన ఎన్నో ఆధారాలు ఇక్కడ లభించాయి. సముద్రపు లోతుల్లో ఎన్నో వింతలు, విశేషాలు దాగి ఉంటాయి. ఇక్కడ లభించేవి చూస్తే సామాన్యుల నుంచి శాస్త్రవేత్తల(Scientists) వరకు ఆశ్చర్యపోక తప్పదు. 

మత్స్యసంపదకు పుట్టినిల్లు ఈ సముద్రాలు. కొన్ని సార్లు భారీ నుంచి అతి భారీ చేపలు(Massive Fishes) మనకు కనిపిస్తుంటాయి. అంతే కాదు ఎన్నో వింత చేపలు వేటగాళ్ల వలకు చిక్కుతుంటాయి. తాజాగా అలాంటి భారీ చేప ఒకటి వలకు చిక్కింది. ఇంత పెద్ద చేప వలకు చిక్కడం ఇదే తొలిసారని మత్స్యకారులు అంటున్నారు. 

Also read: No Rain Village: ఇప్పటి వరకు వర్షం పడని ప్రాంతం...! మేఘాల పైన ఉండే వింత గ్రామం..!

 ఒక నివేదిక ప్రకారం సీయూటా సముద్ర తీరం(The Coast Of Cueta)లో వలలో ఈ చేప చిక్కింది. ఇది సన్ ఫిష్(SunFish) జాతికి చెందినదని సముద్ర శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఈ చేప పొడవు 9 అడుగుల కంటే ఎక్కువ అని తేల్చారు. అదే సమయంలో దాని బరువు 4,000 పౌండ్లు (1814 కిలోలు) అని పేర్కొన్నారు. చేప బరువు ఎంతగా ఉందంటే దాన్ని ఎత్తడానికి క్రేన్ ఉపయోగించాల్సి వచ్చింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అవుతోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News