Viral news: ''వామ్మో... ఇదేం పైత్యంరా నాయన".. బాలుడిని గంగా నదిలో ముంచిన మేనత్త.. కారణం తెలిస్తే షాకవుతారు..

Haridwar: హరిద్వార్ గంగానదిలో నాలుగేళ్ల బాలుడిని ఆమె మేనత్త చాలా సేపు నీళ్లలో ముంచి అలానే పట్టుకుంది. చుట్టుపక్కల ఉన్న వారు షాకింగ్ కు గురయ్యారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 25, 2024, 12:06 PM IST
  • ఢిల్లీకి చెందిన కుటుంబం హరిద్వార్ కు వచ్చారు. .ఐదేళ్ల బాలుడిని అతని మేనత్త గంగనదిలో ముంచి పట్టుకుంది.
Viral news: ''వామ్మో... ఇదేం పైత్యంరా నాయన".. బాలుడిని గంగా నదిలో ముంచిన మేనత్త.. కారణం తెలిస్తే షాకవుతారు..

Delhi Family: ప్రస్తుతం టెక్నాలజీ ప్రతిరోజు కొత్త మార్పులను సంతరించుకుంటుంది. దీంతో అనేక రంగాలలో కూడా విప్లవాత్మకమార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రజలంతా కొత్త మార్పులకు తగ్గట్టుగా అప్ డేట్ అవుతున్నాయి.  సైన్స్ ఇంతలా అప్ డేట్ అవుతున్న కూడా ఇప్పటికి కొన్ని చోట్ల మూఢనమ్మకాలకు చెందిన ఘటనలు తరచుగా వార్తలలో ఉంటునే ఉన్నాయి.  దెయ్యాలు, భూతాలు, బ్లాక్ మ్యాజిక్ అంటూ అమాయక ప్రజలు, బాబాలు, స్వామిజీల చేతిలో మోసపోతున్నారు.

అయితే... ఈవిధంగా మోసపోతున్న వారిలో  ఎక్కువ మంది చదువుకున్న వారే ఉంటున్నారు. ఇప్పటికి కొందరు స్వామిజీలు, బాబాలను కలిసి తమ బాధలు నయం చేయాలని వేడుకుంటున్నారు. వీరి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న దొంగబాబాలు మోసాలకు పాల్పడుతున్నారు. కొన్నిసార్లు వీరు చెప్పిన రెమిడీలు పాటించి,  ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అచ్చం ఇలాంటి షాకింగ్ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. 

Read Also: Republic Day 2024: భారత దేశ గణతంత్ర వేడుకలు.. ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్..

పూర్తి వివరాలు..

దేశ రాజధాని ఢిల్లీకి చెందిన కుటుంబం హరిద్వార్ కు వచ్చారు. పోలీసుల తెలిపిన సమాచారం ప్రకారం.. .ఐదేళ్ల బాలుడితోపాటు, తల్లిదండ్రులు, మేనత్త, బంధువులు గంగానది దగ్గరకు వచ్చారు. బాలుడికి బ్లడ్ క్యాన్సర్ వచ్చినట్లు సమాచారం. అయితే.. బాలుడిని గంగానదిలో తలకిందులుగా నీళ్లలో ముంచి కాసేపు పట్టుకుంటే బ్లడ్ క్యాన్సర్ తగ్గిపోతుందని చెప్పాడంట. దీంతో ఐదేళ్ల బాలుడిని, మేనత్త అందరు చూస్తుండగానే గంగానదిలో ముంచి పట్టుకుంది. చుట్టుపక్కల వారు ఆమెను వారిస్తున్న ఏమాత్రం పట్టించుకోలేదు.

చివరకు ఒక భక్తులు వచ్చి బాలుడిని ఆమె నుంచి బలవంతంగా బైటకు తీసి, ఒడ్డుమీదకు తీసుకొచ్చాడు. అప్పటికి బాలుడు ఏమాత్రం చలనం లేకుండా కన్పించాడు. దీంతో గట్టుమీద పడుకొబెట్టి చూస్తే ఊపిరి ఆగిపోయినట్లు గుర్తించారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Read Also: Ayodhya: అయోధ్యలో అరుదైన ఘటన.. రామ్ లల్లా గర్భగుడిలోకి ప్రవేశించిన వానరం ఏంచేసిందో తెలుసా..?

పోలీసులు బాలుడిని పోస్ట్ మార్టం కోసం తరలించి, సదరు కుటుంబాన్ని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. కాగా, హరిద్వార్ సిటీ పోలీస్ చీఫ్ స్వాతంత్ర కుమార్ మాట్లాడుతూ, బాలుడు ఢిల్లీలోని టాప్ హాస్పిటల్‌లో క్యాన్సర్ చికిత్స పొందుతున్నాడని కుటుంబ సభ్యులు  తెలిపారు. 

వైద్యులు కూడా బ్లడ్ క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజ్ లో ఉండటం వల్ల ఏంచేయలేమని చెప్పారంట. దీంతో చివరకు ఎవరో దొంగ బాబా చెప్పిన దాన్ని విని ఇలా చేసినట్లు సమాచారం. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఇదేం చోద్యంరా బాబోయ్ అంటూ కామెంట్ లు చేస్తున్నారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News