Dead Man Returns Home After 2 Years of Death: కరోనావైరస్ సోకిన వ్యక్తిని చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో అతడికి చికిత్స చేసిన వైద్యులు.. పేషెంట్ కరోనాతో చనిపోయినట్టు ప్రకటించి అతడి శవాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. కరోనావైరస్‌తో చనిపోయిన కారణంగా కుటుంబసభ్యులు అతడి శవాన్ని అక్కడే ఖననం చేసి, అంత్యక్రియలు పూర్తి చేసి ఇంటికి వచ్చేశారు. ఇదంతా జరిగి రెండేళ్లయిపోయింది. 2021 లో కరోనావైరస్ సెకండ్ వేవ్ లో చనిపోయిన ఆ వ్యక్తి పేరు కమలేష్ పాటిల్. గుజరాత్‌లోని వదోదరలో ఈ ఘటన జరిగింది. సీన్ కట్ చేస్తే.. శనివారం ఉదయం 6 గంటలకు కమలేష్ పాటిల్ ఇంటికి తిరిగొచ్చి డోర్ కొట్టాడు. డోర్ తీసి చూసి షాక్ అవ్వడం కుటుంబసభ్యుల వంతయ్యింది.
కమలేష్ పాటిల్ ఇక లేడు.. ఎప్పటికీ తిరిగిరాడు అని ఆందోళనలో మునిగిపోయిన ఆ కుటుంబం ఇప్పుడిప్పుడే ఆ నిజాన్ని అర్థం చేసుకుని ఆ బాధ మరిచిపోతున్న తరుణంలోనే అతడు ఇంటికి తిరిగి రావడంతో ఆ కుటుంబం ఆనందంతో ఎగిరి గంతేసింది. అదే సమయంలో తీవ్ర ఆశ్చర్యానికి గురైంది. ఈ రెండేళ్ల కాలం కమలేష్ ఎక్కడున్నాడు, ఏం చేశాడు, ఎలా బతికాడు అనే ప్రశ్నలు ఆ కుటుంబాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి.
సంచలనం సృష్టించిన ఈ ఘటనపై కమలేష్ పాటిల్ కజిన్ ముఖేష్ పాటిల్ మీడియాతో మాట్లాడుతూ.. కమలేష్ పాటిల్ కి రెండేళ్ల క్రితమే కరోనా రావడంతో ఆస్పత్రిలో చేర్పించామని.. ఆ తరువాత కమలేష్ చనిపోయినట్టుగా ధృవీకరించిన ఆస్పత్రి సిబ్బంది.. అతడి శవాన్ని ఇచ్చి తీసుకెళ్లమన్నారు. కరోనావైరస్‌తో చనిపోవడంతో ఇన్ ఫెక్షన్స్ సోకకుండా శవం పూర్తిగా ప్యాక్ చేసి ఉంది. ఆస్పత్రి వాళ్లు ఇచ్చిన శవానికే అంత్యక్రియలు చేసి ఇంటికి తిరిగొచ్చాం. తీరా చూస్తే ఇప్పుడు కమలేష్ పాటిల్ బతికే ఉన్నాడు అంటూ ముఖేష్ పాటిల్ ఆనందం వ్యక్తంచేశాడు.
ఇది కూడా చదవండి : Height Increasing Surgery: ఎత్తు పెరగడం కోసం రూ. 1.35 కోట్లు పెట్టి రెండు సర్జరీలు
కమలేష్ పాటిల్ తిరిగొచ్చాడన్న వార్త గుజరాత్‌లోనే కాదు.. దేశవ్యాప్తంగా దావాణంలా వ్యాపించింది. కరోనాతో చనిపోయిన వ్యక్తి తిరిగొచ్చాడన్న సమాచారం పోలీసులకు కూడా అందింది. కన్వన్ పోలీసు స్టేషన్ ఇంచార్జ్ రామ్ సింగ్ రాథోడ్ ఈ ఘటనపై స్పందిస్తూ.. కమలేష్ పాటిల్ నుంచి వాంగ్మూలం తీసుకున్న తరువాతే ఏమైంది చెప్పగలం అని అన్నారు. ఆ తరువాత కమలేష్ పాటిల్ చనిపోయినట్టుగా ధృవీకరించిన ఆస్పత్రి నుంచి కూడా మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు. మొత్తానికి కరోనావైరస్‌తో చనిపోయాడనుకున్న వ్యక్తి తిరిగొచ్చాడని తెలిసి యావత్ ప్రపంచం షాక్ అవుతోంది.
ఇది కూడా చదవండి : Goa Flight Ticket Price: గోవాకు ఫ్లైట్ టికెట్ కేవలం రూ. 85 మాత్రమే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK