Couple Romancing On running Bike: కదిలే బైకుపై తిక్కవేషాలు.. తిక్క కుదిర్చిన పోలీసులు

Couple Romancing On running Bike: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూస్తే.. రద్దీగా ఉన్న ఒక హైవేపై ఒక యువతి ద్విచక్ర వాహనం నడుపుతున్న తన ప్రేమికుడి ఒడిలో కూర్చుని పబ్లిగ్గా రొమాన్స్ చేస్తుండటం స్పష్టంగా కనిపిస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 23, 2023, 10:15 AM IST
Couple Romancing On running Bike: కదిలే బైకుపై తిక్కవేషాలు.. తిక్క కుదిర్చిన పోలీసులు

Couple Romancing On running Bike: రన్నింగ్‌లో ఉన్న ద్విచక్ర వాహనాలపై జంటలు బహిరంగంగా ముద్దులు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం వంటి విపరీత చేష్టలు ఇటీవల కాలంలో మరీ ఎక్కువయ్యాయి. తాజాగా అటువంటి దృశ్యమే మరొకటి ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని ఇందిరాపురం సమీపంలో 9వ నెంబర్ జాతీయ రహదారిపై కనిపించింది. బైకుపై వెళ్తున్న ఓ జంట బైక్ రన్నింగ్ లో ఉండగానే రొమాన్స్ చేసుకుంటున్న వైనాన్ని ప్రత్యక్ష సాక్షులు తమ మొబైల్ కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయగా.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోని నిశితంగా పరిశీలిస్తే.. ఆ యువతి బైక్ నడిపిస్తున్న తన ప్రేమికుడికి ఎదురుగా ఉన్న బైక్‌ పెట్రోల్ ట్యాంక్‌పై కూర్చుని అతడిని కౌగిలించుకోవడం చూడొచ్చు. రోడ్లపై వాహనాలు నడుపుతూ ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయడం ఏ మేరకు సమంజసం అని ఈ వీడియో చూసిన నెటిజెన్స్ మండిపడుతున్నారు. ఒకవేళ వారు చేసే ఈ పిచ్చి పనుల వల్ల వాళ్లకు కానీ లేదా వాళ్ల వల్ల మరొకరికి కానీ ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగితే దానికి ఎవరు బాద్యత వహిస్తారు అని నెటిజెన్స్ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

ఈ వీడియోను పరిశీలించి చూస్తే.. అదే రహదారిపై కారులో వెళ్తున్న మరో వ్యక్తి ఈ దృశ్యాన్ని తన మొబైల్ కెమెరాలో రికార్డ్ చేసినట్టు స్పష్టంగా అర్థం అవుతోంది. అంటే ఒక రకంగా ఆ దృశ్యాన్ని చూసిన ఇతర వాహనదారుల మనస్సు కూడా డ్రైవింగ్ నుంచి డైవర్ట్ అయి వారిపై పడి తమకు తెలియకుండానే ప్రమాదం బారిన పడే ప్రమాదం ఉంది. అందుకే ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసే వారిని పోలీసులు నిర్లక్ష్యపు డ్రైవింగ్ తో పాటు న్యూసెన్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి లోపల వేస్తుంటారు.

ఇది కూడా చదవండి : Most Wanted Monkey: జనాన్ని గడగడలాడించి చుక్కలు చూపించిన మోస్ట్ వాంటెడ్ కోతి అరెస్ట్

ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఈ ఘటనపై స్పందించిన ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు.. ఈ ఘటనకు పాల్పడిన జంటపై యాక్షన్ తీసుకోల్సిందిగా ఘజీయాబాద్ పోలీసులకు రిపోర్ట్ చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో అప్రమత్తమైన ఘజియాబాద్ పోలీసులు.. ఆ వాహనం నడిపిన వ్యక్తిని సాహిల్‌గా గుర్తించిన ఘాజియాబాద్ పోలీసులు.. అతడిపై కేసు నమోదు చేయడంతో పాటు అతడిని అరెస్ట్ చేసి ఆ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మొత్తానికి సాహిల్ తిక్క కుదిరింది అంటున్నారు నెటిజెన్స్.

ఇది కూడా చదవండి : Angry LOVE King Cobra's: లవ్‌లో ఉన్న నాగు పాములను గెలికాడు.. మూల్యం చెల్లించుకున్నాడు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News