Bear killed father and son duo in Chhattisgarh: సాధారణంగా అడవిలోని క్రూర జంతువులు తరచుగా అడవికి సమీపంలో ఉన్న గ్రామాల్లోకి వస్తుంటారు. పెద్ద పులులు, ఏనుగులు, చిరుత పులులు, ఎలుగు బంట్లు తరచుగా గ్రామాల్లోకి వచ్చిన ఘటనలు వార్తలలో ఉంటునే ఉంటాయి. ఈ నేపథ్యంలో కొన్నిసార్లు అవి జనాలపైకి దాడులకు పాల్పడుతుంటాయి. ఎలుగు బంట్ల దాడుల్లో అమాయకులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కొకొల్లలు.
भालू ने बाप-बेटे पर अटैक किया और उन दोनों की जान चली गई !!
भालू के बाप बेटे पर हमले का वीडियो सोशल मीडिया पर तेजी से हो रहा वायरल !!
छत्तीसगढ़ के कांकेर से दर्दनाक खबर सामने आई है, यहां जंगल में एक भालू ने बाप-बेटे पर हमला किया, जिसमें दोनों की मौत हो गई है !!
आक्रामक भालू ने… pic.twitter.com/RGyzodEYmg
— MANOJ SHARMA LUCKNOW UP🇮🇳🇮🇳🇮🇳 (@ManojSh28986262) January 20, 2025
ఈ క్రమంలో ఛత్తీస్ ఘఢ్ లోని కాంకేర్ లోని కోరర్ ఫారెస్ట్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అడవికి సమీపంలోని ప్రజలు కట్టెల కోసం అడవిలోకి వెళ్లారు. ఇంతలో ఒక ఎలుగు బంటివారికి కన్పించింది. దీంతో ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఎలుగు బంటిని బంధించేందుకు ప్రయత్నించారు. ప్రజలు, ఫారెస్ట్ సిబ్బంది అందరు కలిసి ఫారెస్ట్ ఎలుగు బంటి కన్పించిన ప్రాంతానికి వెళ్లారు.
ఇంతలో ఎలుగు బంటి కోపంతో వారి మీదకు దాడికి ప్రయత్నించింది. దాని మీద కర్రలు, రాళ్లను వేశారు. కానీ ఎలుగు బంటి అక్కడున్న ఇద్దరిపై దాడి చేసింది. తన పదునైన పళ్లు, చేతి గోర్లుతో శరీరంను చీల్చేసింది. గ్రామస్తులు అరుపులు పెట్టిన, రాళ్లు వేసిన వదలలేదు.
ఆ తర్వాత అది అడవిలోకి వెళ్లిపోయింది. అక్కడున్న కొంతమంది తమ ఫోన్ లలో ఈ ఘటన రికార్డు చేశారు. దీంతో ఫారెస్ట్ సిబ్బంది గ్రామస్థులను అప్రమత్తంగా ఉండాలని.. తొందరలోనే ఎలుగు బంటిని బంధిస్తామని చెప్పారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter