Parental Supervision: మీ పిల్లలు ఇన్‌స్టా వాడుతున్నారా..? ఈ ఫీచర్‌ గురించి తెలుసుకోండి!

మీ పిల్లలు ఇన్‌స్టాగ్రామ్‌ వాడుతున్నారా..?? అయితే ఈ ఫీచర్ సహాయంతో మీ పిల్లలు ఎవరిని ఫాలో అవుతున్నారు..? ఏం చేస్తున్నారో వంటి అన్ని రకాల వివరాలను తెలుసుకోవచ్చు.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 20, 2022, 04:48 PM IST
  • ఇన్‌స్టా నుంచి పిల్లల కోసం సరికొత్త ఫీచర్‌
  • కొత్త ఫీచర్‌గా‌ పేరెంటల్‌ సూపర్‌ విజన్‌ ఫీచర్‌
  • దీని ఫీచర్‌తో వివరాలు తెలుసుకోవడం సులభం
Parental Supervision: మీ పిల్లలు  ఇన్‌స్టా వాడుతున్నారా..? ఈ ఫీచర్‌ గురించి తెలుసుకోండి!

Parental Supervision: ఈ ఆప్షన్ సాయంతో తల్లిదండ్రులు తమ పిల్లలు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంత సమయం కేటాయిస్తున్నారు? ఏయే ఖాతాలను ఫాలో  అవుతున్నారు? అన్ని వివరాలు తెలుసుకోవడం సులభం. దీంతో  ఇతరుల అకౌంట్‌ గురించి పిల్లలు ఫిర్యాదు చేసినప్పుడు తల్లిదండ్రులకు నోటిఫికేషన్‌ వస్తుందని ఇన్‌స్టాగ్రామ్‌ తెలిపింది. త్వరలోనే ఈ  ఫీచర్‌ను భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌ హెడ్‌ ఆడమ్‌ మోస్సెరీ తెలిపారు.

సోషల్‌ మీడియాల్లో పిల్లలు, పెద్దలు అధికంగా వినియోగించేది ఇన్‌స్టాగ్రామ్‌ ఒక్కటి. అలాంటి ఇన్‌స్టాగ్రామ్‌లో నిత్యం చాలా రకాల ఫీచర్లు వస్తు ఉంటాయి. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి వినియోగరదారులకు సరికొత్త ఫీచర్‌ వచ్చేసింది.ఫొటో,వీడియో షేరింగ్‌, వీడియో కలింగ్‌  యాప్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఫేస్‌బుక్‌ అనుబంధ సంస్థగా పనిచేస్తోంది.అయితే అయితే ఇందులో పిల్లలు ఎలాంటి కంటెంట్, వీడియోలు చూస్తున్నారనేది తెలుసుకునేందుకు వీలుగా తల్లిదండ్రుల కోసం 'పేరెంటల్‌ సూపర్‌ విజన్‌ ఫీచర్‌'ను తీసుకొచ్చింది. దీంతో పిల్లలు ఎలాంటి కంటెంట్‌ చూస్తున్నారో పసిగట్టవచ్చు.

ఈ ఆప్షన్ సాయంతో తల్లిదండ్రులు తమ పిల్లలు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంత సమయం కేటాయిస్తున్నారు? ఏయే ఖాతాలను ఫలో అవుతున్నారు? అన్ని వివరాలు తెలుసుకోవడం సులభం అయ్యింది.దీంతో  ఇతరుల అకౌంట్‌ గురించి పిల్లలు ఫిర్యాదు చేసినప్పుడు తల్లిదండ్రులకు నోటిఫికేషన్‌ వస్తుందని ఇన్‌స్టాగ్రామ్‌ తెలిపింది.ఈ ఫీచర్‌ కావాలనుకునే వారు ముందుగా తమ పిల్లల అకౌంట్‌ నుంచి పేరెంటల్‌ సూపర్‌ విజన్‌ ఫీచర్‌ యాక్టివ్‌ చేయాలని ఇన్‌స్టాగ్రామ్‌ను కోరాలి. తర్వాత తల్లిదండ్రులు తమ పిల్లలు వాడే అకౌంట్‌కు ఈ ఫిచర్‌ను పంపాల్సి ఉంటుంది.ఆ రిక్వెస్ట్‌ను పిల్లలు అంగీకారం తెలిపితే తల్లిదండ్రులు తమ పిల్లల ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాల ఎలా ఉపయోగిస్తున్నారనేది తెలుసుకోవచ్చు. ఆ రిక్వెస్ట్‌ను అంగీకరించకపోతే ఫీచర్‌ వినియోగించడం కుదరదని ఇన్‌స్టాగ్రామ్‌ తెలిపింది.

ఇప్పుడు ఈ సరికొత్త  ఫీచర్‌ అమెరికన్‌ యూజర్లకు అందుబాటులో ఉందని ఇన్‌స్టాగ్రామ్‌ అధికారికంగా వెల్లడించింది. త్వరలోనే ఈ  ఫీచర్‌ను భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌ హెడ్‌ ఆడమ్‌ మోస్సెరీ తెలిపారు.అలాగే 'క్వెస్ట్‌' హెడ్‌సెట్స్‌లో వర్చువల్‌ రియాల్టీ పేరెంటల్ సూపర్‌ విజన్‌ టూల్స్‌ను పరిచయం చేయనున్నట్లు ఇన్‌స్ట్రామ్‌ సూచించింది. ఈ ఆప్షన్‌తో పిల్లలు అభ్యంతరకరమైన యాప్స్‌ డౌన్‌లోడ్‌ చేయకుండా కట్టడి చేయొచ్చని ఇన్‌స్టా తెలిపింది. ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌ పరిమితి మించి వినియోగించకుండా ‘టేక్‌ ఏ బ్రేక్‌’ ఫీచర్‌ను పరిచయం చేసిన సంగతి  తెలిసిందే.ఈ ఫీచర్‌తో వినియోగదారులకు ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి విరామం తీసుకుని కొంత సమయం తర్వాత తిరిగి ఉపయోగించుకునే అవకాశాలు కల్పిస్తుంది.

Also Read: Karnataka Hijab Row: హిజాబ్‌పై తీర్పు వెలువరించిన జడ్జిలకు 'వై' కేటగిరీ భద్రత..

Also Read: IPL 2022: సీఎస్‌కేకు మరో షాక్‌.. స్టార్‌ ఆల్‌రౌండర్‌ దూరం!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News