Redmi Note 13 Pro Price Cut: ప్రస్తుతం చాలా మంది యువత ఎక్కువ మెగాపిక్సెల్ కలిగి స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని చాలా టెక్ కంపెనీలు ఎక్కువ హై మెగాపిక్సెల్ కలిగిన మొబైల్స్‌ను లాంచ్ చేస్తున్నాయి. మీరు కూడా ఎప్పటి నుంచో మంచి కెమెరా కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇది సరైన సమయంగా భావించవచ్చు. గతంలో Redmi కంపెనీ మార్కెట్‌లోకి లాంచ్ చేసిన Redmi Note 13 Pro స్మార్ట్‌ఫోన్ అతి శక్తివంతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ మొబైల్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ Redmi Note 13 Pro స్మార్ట్‌ఫోన్ కంపెనీ 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో అందుబాటులోకి తీసుకు వచ్చింది. అయితే ఈ మొబైల్‌పై ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ భారీ తగ్గింపును అందిస్తోంది. ప్రస్తుతం ఈ మొబైల్ అమెజాన్ కేవలం సింగిల్ వేరియంట్‌లో మాత్రమే లభిస్తోంది. ఇది 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో అందుబాటులో ఉంది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్ ధర వివరాల్లోకి వెళితే, రూ.28,999తో అందుబాటులో ఉంది. అయితే అమెజాన్ అందిస్తున్న ప్రత్యేకమైన డీల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి దాదాపు 14 శాతం డిస్కౌంట్‌తో రూ.24,999కే లభిస్తోంది. దీంతో పాటు ఇతర ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
అదనంగా బ్యాంక్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే, ఈ స్మార్ట్‌ఫోన్‌ను ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో పేమెంట్ చేస్తే దాదాపు రూ.3000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో బిల్ చెల్లిస్తే రూ.1,750 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు OneCard క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి పేమెంట్ చేసేవారికి కూడా భారీ తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ అన్ని పోను Redmi Note 13 Pro స్మార్ట్‌ఫోన్ రూ.21,999కే లభిస్తుంది. ఇవే కాకుండా ఇతర బ్యాంక్‌లకు సంబంధించిన ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
ఎక్చేంజ్ ఆఫర్:
అమెజాన్‌లో Redmi Note 13 Pro స్మార్ట్‌ఫోన్‌పై అదనంగా ఎక్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. దీనిని వినియోగించి కొనుగోలు చేసేవారికి భారీ తగ్గింపు లభిస్తుంది. అయితే ఈ ఆఫర్ వినియోగించడానికి ముందుగా పాత బ్రాండెడ్ మొబైల్‌ను ఎక్చేంజ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా చేస్తే మొబైల్ కండీష్‌ను బట్టి రూ.23,749 వరకు ఎక్చేంజ్ బోనస్ లభిస్తుంది. దీంతో అన్ని ఆఫర్స్ పోను ఈ స్మార్ట్‌ఫోన్ రూ.1,250కే పొందవచ్చు. అయితే ఈ బోనస్ అనేది స్మార్ట్‌ఫోన్ కండీషన్ బట్టి ఆధారపడి ఉంటుంది. కండీషన్ బాగుంటేనే ఈ డిస్కౌంట్ లభిస్తుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి