Alien Viral Video: అమెరికాలో గ్రహాంతర వాసి..ఉరుకులు పరుగులతో జనాలు..వీడియో..

10-Foot Alien At Miami Mall: ఇటీవల అమెరికాలోని ఓ మాల్ నుంచి గ్రహాంతరవాసులు బయటికి వస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ మాల్‌లోకి గ్రహాంతరవాసులు వచ్చారా? అసలు పోలీసులు తెలిపిన వివరాలేంటో? ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 7, 2024, 09:07 AM IST
Alien Viral Video: అమెరికాలో గ్రహాంతర వాసి..ఉరుకులు పరుగులతో జనాలు..వీడియో..

Google Trends 10-Foot Alien Video: ప్రతిరోజు సోషల్ మీడియాలో లక్షలాది వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అయితే ఈరోజు ఇటీవలే ఓ మాల్ లో గ్రహాంతరవాసి తిరుగుతున్న వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. చాలామందికి ఆశ్చర్యం కలగవచ్చు.. భూమిపైన కూడా ఇంకా గ్రహాంతరవాసులు ఉన్నారా అని? కానీ ఇటీవలే వైరల్ అవుతున్న వీడియో ప్రకారం ఉన్నారని సమాధానాలు వస్తున్నాయి. ఇంతకీ ఆ వీడియోలో నిజంగానే గ్రహాంతరవాసి తిరుగుతోందా? వైరల్ అవుతున్న వీడియో నిజమేనా? ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

అమెరికాలోని ఓ మాల్‌లో నుంచి గ్రహాంతరవాసి బయటికి నడుచుకుంటూ వస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం లేపుతోంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఆ గ్రహాంతరవాసి 10 అడుగులకు పైగానే ఉండడంతో మాల్‌లో నుంచి ప్రజలంతా కేకలు వేస్తూ.. భయాందోళనకు గురై అక్కడి నుంచి పరుగులు తీశారని సమాచారం. అయితే మీరు కూడా ఈ వైరల్ అవుతున్న వీడియోలో క్లియర్‌గా చూడవచ్చు. సేమ్ గ్రహాంతరవాసిలా కనిపించే 10 అడుగులు గల శరీరం గల వ్యక్తి మాల్‌లో నుంచి బయటకు రావడం గమనించవచ్చు.

Also read: Ram Mandir: అయోధ్య వెళ్లేవారు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..

ఈ సంఘటన జనవరి 1 తేదీ రోజు అమెరికాలోని మియామీ మాల్‌లో జరిగింది. అయితే కొత్త సంవత్సరం వేడుకలలో భాగంగా ఆ మాల్ దగ్గరికి చాలామంది జనాలు తరలివచ్చారు. ఇదే సమయంలో కొంతమంది క్రాకర్లను పేలుస్తూ హడావిడిగా ఉన్నారు. అయితే కొంతమందికి ఈ గ్రహాంతర వాసి కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకొని ఆ గ్రహాంతరవాసి చుట్టుముట్టారు.

పోలీసులు ఇలా క్లారిటీ ఇచ్చారు:
కొంతమంది వ్యక్తులు కావాలని మాల్‌కి సంబంధించిన ఓ వీడియోను షేర్ చేసి గ్రహాంతర వాసులు తిరుగుతున్నారని..దుష్ప్రచారం చేస్తున్నారని మియామి పోలీస్ డిపార్ట్‌మెంట్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటివరకు అక్కడికి ఎలాంటి గ్రహాంతరవాసి రాలేదని, అంతేకాకుండా ఆ మాల్ నుంచి ఎవరు పారిపోలేదని పోలీసులు తెలిపారు. కొంతమంది ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు.. కావాలని వీడియోలు సృష్టించి గ్రహాంతర వాసులు ఉన్నారని నమ్మిస్తున్నారని పోలీసులు అన్నారు.

Also read: Ram Mandir: అయోధ్య వెళ్లేవారు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News