Urvashi Apsaraa: అల్లు అర్జున్‌కు పుష్పలో స్టెప్పులు ఎవరు నేర్పించారు? హీరోయిన్‌ను మించిన అందం

Urvashi Apsaraa Allu Arjun Choreography: పుష్ప సినిమాల్లో పాటలు.. డ్యాన్స్‌లు హైలెట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్‌ రెచ్చిపోయి డ్యాన్స్‌ చేయగా.. అతడికి స్టెప్పులు నేర్పించింది మాత్రం ఓ అమ్మాయి. ఐకాన్‌ స్టార్‌కు ఊ అంటావా మామ.. కిస్సిక్‌ పాట స్టెప్పులను ఊర్వశీ చౌహాన్‌ అనే లేడీ కొరియోగ్రాఫర్‌ నేర్పించారు. ఆమె ఎవరో తెలుసుకుందాం.

1 /9

పుష్ప 1, 2లో ఊ అంటావా మామ.. కిస్సిక్‌ పాటలు ప్రేక్షకులను కిక్కించేలా చేసిన విషయం తెలిసిందే. ఆ పాటల్లో అల్లు అర్జున్‌ ఇరగదీసే స్టెప్పులు వేశాడు.

2 /9

ఆ పాటలకు స్టెప్పులను అల్లు అర్జున్‌కు నేర్పించింది ఓ లేడి కొరియోగ్రాఫర్‌. ఆమె పేరు ఊర్వశీ చౌహాన్‌.

3 /9

గుజరాత్‌లోని భావ్‌నగర్‌ మహూకు చెందిన ఊర్వశీ ఏడు సంవత్సరాలుగా సినీ పరిశ్రమలో పని చేస్తోంది. సినిమాల కోసం ఆమె ముంబైలో నివసిస్తోంది.

4 /9

సినిమాలకు ముందు ఊర్వశీ చౌహాన్‌ వాణిజ్య ప్రకటనలు, ఆల్బమ్‌లకు డ్యాన్స్‌కు దర్శకత్వం వహించారు. ఇప్పుడు అల్లు అర్జున్‌కి ఊర్వశి కిస్సిక్‌ డ్యాన్స్ నేర్పిస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

5 /9

అల్లు అర్జున్‌కి పుష్ప 1, పుష్ప 2లో డ్యాన్స్ నేర్పించిన అమ్మాయి గుజరాత్‌కి చెందిన ఊర్వశి. ఆమెను ఇండస్ట్రీలో 'ఊర్వశి అప్సర' అంటారు.

6 /9

గణేశ్‌ ఆచార్యకి ఊర్వశి చౌహాన్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పని చేసింది. అతడి వద్ద శిక్షణ పొందిన ఊర్వశీ అనంతరం ఎదుగుతూ కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు పొంది

7 /9

కొరియోగ్రాఫర్‌గా ఊ అంటావా మావా, కిస్సిక్ పాటలకు ఊర్వశీ కొరియోగ్రఫీ చేసింది.

8 /9

కుటుంబంతో ఊర్వశి నివసిస్తుండగా.. ఆమె తండ్రి జితూభాయ్ చౌహాన్ ముంబైలో ఆటోమొబైల్ వ్యాపారం చేస్తున్నాడు.

9 /9

కొరియోగ్రాఫర్‌గా కాకుండా హీరోయిన్‌గా నటించాలని ఊర్వశీ భావిస్తోంది. నటిగా కూడా గుర్తింపు పొందేందుకు శ్రమిస్తోంది. ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.