Pitru Paksha 2024 Date And Time: ప్రతి ఏడాది పితృపక్షం 16 రోజులపాటు నిర్వహిస్తారు. ఇది పితరులకు శ్రాద్ధం పెట్టే సమయం. హిందూ క్యాలెండర్‌లో ప్రతి ఏడాది ఆశ్వీయుజ మాసంలో ప్రారంభమవుతుంది. అయితే, ఈ నెలలో పితృపక్షం ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలుసుకుందాం.
ప్రతి ఏడాది పూర్ణిమ నుంచి ప్రారంభమయ్యే పితృపక్షం మహాలయ అమావాస్యతో ముగుస్తుంది. దీన్ని సర్వపితృ అమావాస్య అని కూడా పిలుస్తారు. ఈ ఏడాది ఈ నెల సెప్టెంబర్ 17 నుంచి ప్రారంభమవుతుంది. అయితే, ఏ రోజు ఏ తిథి రానుందో తెలుసుకుందాం.
2024 సెప్టెంబర్ 17 మంగళవారం పూర్ణిమ శ్రాద్ధ నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 18వ తేదీ బుధవారం ప్రతిపాద శ్రాద్ధ, 19 గురువారం ద్వితీయ శ్రాద్ధ, 20 శుక్రవారం రోజు తృతీయ శ్రాద్ధ నిర్వహిస్తారు. 21 శనివారం రోజు చతుర్థి శ్రాద్ధ, మహా భరణి, 22 ఆదివారం పంచమి శ్రాద్ధ, 23 సోమవారం షష్ఠి, సప్తమి శ్రాద్ధ, 24 మంగళవారం అష్టమి శ్రాద్ధ నిర్వహించనున్నారు.
సెప్టెంబర్ 25 బుధవారం నవమి శ్రాద్ధ, గురువారం 26వ తేదీ దశమి, 27 శుక్రవారం ఏకాదశి, 29 ఆదివారం ద్వాదశి, మాఘశ్రాద్ధ, 30 వ తేదీ సోమవారం త్రయోదశి శ్రాద్ధ, అక్టోబర్ 1వ తేదీ మంగళవారం చతుర్ధశి శ్రాద్ధం, 2 బుధవారం మహాలయ అమావాస్య నిర్వహించనున్నారు.
పితృపక్షం రోజుల్లో ముఖ్యంగా కొన్ని పనులు చేయకూడదు. ఈరోజు మన పితరులు భూమి సంచరిస్తారనే నమ్మకం ఉంది. అందుకే వారికి ఆహారం, నీరు శ్రాద్ధంగా పెడతారు. ఈ రోజుల్లో ముఖ్యంగా దానాలకు ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది. కుటుంబంలో పెద్ద కొడుకు ఈ శ్రాద్ధం, కర్మలు నిర్వహిస్తాడు.
తర్పణానికి కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. నల్లనువ్వులు నీళ్లలో కలిపి పితరులకు తర్పణం పెడతారు. పిండ ప్రదానం కూడా చేస్తారు. అన్నంతో తయారు చేసిన చిన్న ముద్దలకు నల్లనువ్వులు, బార్లీ పిండి కూడా కలిపి పితరులకు పెడతారు. అంతేకాదు ఈరోజుల్లో బ్రాహ్మణులకు, పేదలకు అన్నదానం చేస్తారు.
మహాలయ అమావాస్య అతిపెద్ద అమావాస్య. ఈరోజు శ్రాద్ధం నిర్వహించడానికి అత్యంత అనువైన రోజు. ఇది పితరుల కోసం వచ్చే అమావాస్య. ఈరోజు పితరులకు పిండ ప్రదానాలు చేస్తే వారి ఆత్మకు శాంతి కలుగుతుందని నమ్ముతారు. తమ వంశ వృద్ధికి వారు ఆశీర్వదిస్తారనే నమ్మకం ఉంది.