Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పేరు చెబితే అభిమానులకు పూనకం. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్.. అన్నకు తగ్గ తమ్ముడిగా రాణించాడు. అయితే పవన్ కళ్యాణ్ ను అభిమానులు పవర్ స్టార్ అని పిలుస్తుంటారు. ఈ బిరుదు వెనక ఓ వైపీసీ నేత ఉన్నారు. వివరాల్లోకి వెళితే..
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వచ్చిందంటే అభిమానులకు పూనకాలు. కానీ ఈ బర్త్ డే మాత్రం పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన అభిమానులకు ప్రత్యేకం. మొన్నటి వరకు ఓ సాదాసీదా స్టార్ హీరో.. జనసేన పార్టీకి అధినేత. కానీ ఇపుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో చక్రం తిప్పుతున్న నేత. అంతేకాదు ఏపీ డిప్యూటీ సీఎంగా కొత్త బాధ్యతల్లో దూసుకుపోతున్నారు.
అన్నయ్య చిరంజీవి బాటలో హీరోగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు పవన్ కళ్యాణ్. అంతేకాదు అన్నయ్య ప్రజా రాజ్యం పార్టీ పెట్టి రాజకీయాల్లో ప్రవేశిస్తే.. పవన్ కళ్యాణ్.. జనసేన పార్టీతో రాజకీయ రణరంగంలోకి దిగారు. అన్న లాగా కాడి ఒదిలేయకుండా.. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసి ఏపీలో బలీమైన శక్తిగా నిలబెట్టారు.
అయితే.. పవన్ కళ్యాణ్ అన్యయ్యకు చిరంజీవికి మెగాస్టార్ అనే బిరుదు ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ కు పవర్ స్టార్ అనే బిరుదు స్థిర పడింది. అది సార్ధకం కూడా అయింది. రీసెంట్ గా జరిగిన 2024 ఎన్నికల్లో ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా.. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి కావడం వెనక పవన్ కళ్యాణ్ కీ రోల్ పోషించి అసలు సిసలు పవర్ స్టార్ అనిపించుకున్నారు.
అయితే సినిమాల్లోకి రాకముందు పవన్ కళ్యాణ్ పేరు ‘కళ్యాణ్ కుమార్’.అంతేకాదు అంజనా ప్రొడక్షన్స్ నిర్మించే చిత్రాలకు సహ నిర్మాతగా కూడా వ్యవహరించారు.
పవన్ కళ్యాణ్ 1996లో ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మించిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో కథానాయకుడిగా పరిచయమయ్యాడు.ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పేరు ‘కళ్యాణ్’ గానే ఉంటుంది. ఆ సినిమా సరిగా నడవలేదు.
కొణిదెల కుటుంబం మొత్తం ఆంజనేయ స్వామి భక్తులు. అన్యయ్య హనుమంతుడి పేరు కలిసొచ్చేలా చిరంజీవి గా పేరు మార్చుకొని తెలుగు సినీ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో అయ్యారు. అదే బాటలో కళ్యాణ్ బాబు.. ఆంజనేయ స్వామి పేరు కలిసొచ్చేలా కళ్యాణ్ పేరు ముందు ‘పవన్’ చేర్చుకొని పవన్ కళ్యాణ్ అయ్యారు.
అంతేకాదు ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో తెరకెక్కిన రెండో చిత్రం ‘గోకులంలో సీత’ సినిమా నుంచి టైటిల్స్ లో పవన్ కళ్యాణ్ అని వేయడం మొదలైంది అక్కడి నుంచే. ఈ సినిమా తమిళంలో తెరకెక్కిన ‘గోకులంలో సీతై’ మూవీకి రీమేక్ గా తెరకెక్కింది. ఈ సినిమాకు పోసాని కృష్ణ మురళి మాటలు అందించారు.
ఈ సినిమా సక్సెస్ మీటలో పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ను పవన్ స్టార్ అని పిలిస్తూ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ తర్వాత పలు పత్రికలు పవన్ కళ్యాణ్ పేరు ముందు పవర్ స్టార్ పేరుతో కథనాలు రాయడం మొదలుపెట్టాయి.
ఇక ‘గోకులంలో సీత’ తర్వాత సూపర్ గుడ్ ఫిల్మ్ బ్యానర్ లో తెరకెక్కిన ‘సుస్వాగతం’ సినిమా నుంచి పవన్ కళ్యాణ్ పేరు ముందు పవర్ స్టార్ బిరుదు వచ్చి చేరింది. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ హీరోగా వెనుదిరిగి చూసుకోలేదు. అంతేకాదు ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని శాసించే స్థాయికి చేరుకున్నారు.