Sreeleela: ఆ సినిమాపైనే బోలెడు ఆశలు పెట్టుకున్న శ్రీలీల..

Sreeleela: శ్రీలీల గత రెండు మూడేళ్లుగా  టాలీవుడ్ లో హాట్ బ్యూటీగా దూసుకుపోతుంది. ఈమె మొదటి సినిమాతో స్టార్ అయిపోయింది. అంతేకాదు వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. గత కొన్నేళ్లుగా వరుస ఫ్లాపులతో ఈమె కెరీర్ డైలామాలో పడింది. అందుకే ఇపుడు చేయబోతున్న సినిమాతో మరోసారి కథానాయికగా సత్తా చాటాలని చూస్తోంది. 

1 /7

తెలుగులో శ్రీలీల..  దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన 'పెళ్లిసందD' మూవీతో పరిచయం అయింది. మొదటి సినిమాతోనే  తన యాక్టింగ్, డాన్సింగ్ స్కిల్స్‌తో ఇక్కడ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది.

2 /7

అంతేకాదు తెలుగులో బుల్లెట్‌లా వచ్చి రాకెట్‌ వేగంతో దూసుకుపోతున్న తార శ్రీలీల. అంతేకాదు టాలీవుడ్ వరుస ఛాన్సులతో తన సత్తా చూపెడుతోంది.

3 /7

ఈ ఇయర్  త్రివిక్రమ్ డైరెక్షన్‌లో మహేష్‌ బాబు హీరోగా తెరకెక్కిన 'గుంటూరు కారం' మూవీతో పలకరించింది. ఈ సినిమా సరైన విజయం సాధించలేదు. దీంతో ఈమె కెరీర్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి.

4 /7

ప్రస్తుతం శ్రీలీల చేతిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్  హీరోగా నటిస్తోన్న 'ఉస్తాద్ భగత్ సింగ్' మాత్రమే పెద్ద మూవీ ఉంది. ప్రస్తుతం పవన్ రాజకీయాలతో బిజీగా ఉన్నారు. ఆయన ఈ సినిమా ఎప్పుడు కంప్లీట్ చేస్తారనేది ఆయన టైట్ షెడ్యూల్ పై ఆధారపడి ఉంది.

5 /7

ఇక ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో చివరి వరకు శ్రీలీల కథానాయికగా ఉంటుందా  లేదా అనేది కూడా డౌటే అని చెబుతున్నారు

6 /7

హీరోయిన్‌గా కెరీర్ పీక్స్ ఉన్న దశలో 'భగవంత్ కేసరి' మూవీలో బాలయ్య కూతురు పాత్రలో నటించి మెప్పించింది. శ్రీలీల సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్న ఈమె ఒక్కో సినిమాకు రూ. 3 కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది.

7 /7

ప్రస్తుతం శ్రీలీల .. రవితేజ హీరోగా ఓ సినిమా చేస్తోంది. ‘ధమాకా’ వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్ లో వస్తోన్న ఈ సినిమాపై శ్రీలీల చాలా ఆశలే పెట్టుకుంది.