Sobitha Dhulipala: చీరకట్టులో శోభితా ధూళిపాల పరువాల విందు.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Sobitha Dhulipala: శోభితా దూళిపాల  తెలుగు అమ్మాయి అయినా.. బాలీవుడ్ లో  ముందుగా రచ్చ చేసింది. ఈమె గత కొన్నేళ్లుగా నాగ చైతన్యతో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. తాజాగా ఆ వార్తను నిజం చేస్తూ  నాగ చైతన్యతో ఎంగేజ్మెంట్ చేసుకుంది. అంతేకాదు త్వరలోనే పెళ్లి పీఠలు ఎక్కబోతుంది.

1 /6

శోభితా ధూళిపాళ్ల  తెలుగు సహా ప్యాన్ ఇండియా  భాషల్లో వరుస సినిమాలు చేస్తూ రచ్చ చేస్తోంది. త్వరలో అక్కినేని ఇంటి కోడలు కాబోతుంది. పెళ్లి తర్వాత కూడా హీరోయిన్ గా కెరీర్ కొనిసాగించబోతున్నట్టు సమాచారం. 

2 /6

శోభితా ధూళిపాల.. అచ్చ తెలుగందం.. ముందుగా ఈమె తన మాతృభాష తెలుగులో  కాకుండా హిందీలో తెరకెక్కిన 'రమన్ రాఘవ్ 2.O' చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతుంది.  

3 /6

శోభితా కెరీర్..బాలీవుడ్ సినిమాతో ప్రారంభమైన ఆ తర్వాత తెలుగు, తమిళం,మలయాళంలో హీరోయిన్ గా  తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది శోభితా. ఈమె 31 మే 1992 ఆంధ్ర ప్రదేశ్ తెనాలిలో  వేణు గోపాల్ రావు, శాంతి కామాక్షి దంపతులకు  జన్మించింది. అంతేకాదు సినిమాల్లోకి రాకముందు  ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ 2013 టైటిల్ గెలుచుకుంది.

4 /6

శోభితా తండ్రి వృత్తి రీత్యా నావల్ ఆఫీసర్ కావడంతో వీళ్ల కుటుంబం విశాఖకు షిఫ్ట్ అయింది. అక్కడ లిటిల్ ఏంజెల్ స్కూల్, విశాఖ వ్యాలీ స్కూల్ లో చదువుకుంది. ఆ తర్వాత వీరి కుటుంబం ముంబైకు మకాం మార్చింది. అక్కడే బీ.కాం తో పాటు ఎం.కామ్ పూర్తి  చేసింది. ఆ తర్వాత  మోడలింగ్ నుంచి అందాల కిరీటీం గెలుచుకొని సినీ రంగంలోకి ప్రవేశించింది.ఈమెది హై ప్రొఫైల్ ఎలైట్ ఫ్యామిలీ.

5 /6

శోభితా  మొత్తం ఆస్తుల విలువ దాదాపు రూ. 35 కోట్ల వరకు ఉంటుందని అంచనా. తెలుగులో అడివి శేష్ హీరోగా నటించిన 'గూఢచారి'మూవీతో తెలుగులో డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చింది శోభితా ధూళిపాల.

6 /6

కేవలం సినిమాలే కాదు.. 'మేడ్ ఇన్ హెవన్', 'బర్డ్ ఆఫ్ బ్లడ్', 'ది నైట్ మేనేజర్‌' వంటి  వెబ్ సిరీస్‌లో తన యాక్టింగ్‌తో మెప్పించింది. ప్రస్తుతం శోభితా... సినిమాలతో పాటు.. యాడ్స్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తూ ఫుల్ బిజీగా ఉంది.