Pawan Kalyan Shelved Movies: పవన్ కళ్యాణ్ కెరీర్లోనే ఎందుకు ఇన్ని చిత్రాలు షూటింగ్ దశలో ఆగిపోయాయి..!


Pawan Kalyan Shelved Movies: పవన్ కళ్యాణ్ ఒక సినిమా ఓకే చేసినా.. అది కంప్లీటయ్యేంతకు వరకు రిలీజ్ అయ్యే వరకు నిర్మాతల్లో ఓ రకమైన టెన్షన్. ఈయన కెరీర్ లో కొన్ని ఒప్పుకున్న కొన్ని చిత్రాలు ఇంకా పూర్తి కాలేకపోయాయి. కొన్ని కొబ్బరికాయకే పరిమితమైతే.. ఇంకొన్ని షూటింగ్ దశలో ఆగిపోయాయి. మొత్తంగా పవన్ చేసిన 28 చిత్రాల్లో షూటింగ్ దశలో ఆగిపోయినవి డజను దాకా ఉన్నాయి.

1 /9

మొత్తంగా పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఆగిపోయిన్ చిత్రాలు ఎన్నో ఉన్నాయి. అందులో కొన్ని చిత్రాలు షూటింగ్ ప్రారంభమై ఆగిపోయాయి.

2 /9

చెప్పాలని వుంది.. పవన్ కళ్యాణ్ హీరోగా అమీషా పటేల్ హీరోయిన్ గా ‘ఖుషీ’  తర్వాత ఈ సినిమాను అనౌన్స్ చేసారు నిర్మాత ఏ.ఎం.రత్నం. ఈ సినిమా ఎందుకో పట్టాలెక్కలేదు. ఇదే స్టోరీలో తరుణ్ హీరోగా ‘నువ్వే కావాలి’ సినిమాగా తెరకెక్కింది.

3 /9

సత్యాగ్రాహి.. ‘జానీ’ సినిమా తర్వాత ఎంతో అట్టహాసంగా పవన్ కథ రాసుకొని ఆయన దర్శకత్వంలో సూర్యా మూవీస్ పతాకంపై  ఈ చిత్రం ఎంతో అట్టహాసంగా ప్రారంభమై ఆ తర్వాత ఆగిపోయింది.

4 /9

దేశీ.. పవన్ కళ్యాణ్ ‘సత్యాగ్రాహి’ సినిమా ఆగిపోయిన తర్వాత ‘దేశీ’ కథతో మరో సినిమాను డైరెక్ట్ చేయాలనుకున్నారు. తనకున్న బిజీ షెడ్యూల్ కారణంగా ఈ సినిమా పట్టాలెక్కక ముందే  ఆగిపోయింది.  

5 /9

జీసెస్ క్రైస్ట్.. సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వంలో ఏసుక్రీస్తు జీవితంపై ఓ సినిమాను అనౌన్స్ చేశారు. ఈ సినిమా షూటింగ్ మొదలు కాకముందే ఆగిపోయింది.

6 /9

గబ్బర్ సింగ్ 2.. గబ్బర్ సింగ్ సూపర్ సక్సెస్ తర్వాత సంపత్ నంది దర్శకత్వంలో ‘గబ్బర్ సింగ్ 2’ సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. కొంత షూటింగ్ తర్వాత ఈ సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత బాబీ దర్శకత్వంలో ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ సినిమా చేసారు పవన్ కళ్యాణ్.

7 /9

వేదాళం.. అటు ఎ.ఎం.రత్నం నిర్మాణంలో నీసన్ దర్శకత్వంలో ‘వేదాళం’ సినిమాను రీమేక్ చేయాలనుకున్నారు. పూజా కార్యక్రమాల తర్వాత ఈ సినిమా ఆగిపోయింది. ఇదే చిత్రాన్ని చిరు.. ‘భోళా శంకర్’గా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే కదా.

8 /9

కోబలి.. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ తో   రాయలసీమ నేపథ్యంలో ‘కోబలి’ సినిమా చేయాలనుకున్నారు. కానీ అదే చిత్రాన్ని కాస్త మార్పులు చేర్పులతో ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత వీరరాఘవ’ గా  తెరకెక్కించారు మాటల మాంత్రికుడు.

9 /9

ఆగిపోయిన ఇతర పవన్  చిత్రాలు.. కాటమ రాయుడు కంటే ముందే.. ఎస్.జే.సూర్య దర్శకత్వంలో ఓ సినిమా అనౌన్స్ చేసిన తర్వాత ఆగిపోయింది. ఆటు ‘ఖుషీ 2’ చేస్తానని చెప్పారు. ఇకపై వస్తుందన్న నమ్మకం లేదు. మరోవైపు వినాయక్, లారెన్స్ దర్శకత్వంలో సినిమాలు చేయాలనుకున్నారు కానీ కుదరలేదు. అటు వెంకటేష్ తో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా చేయాలనుకున్నారు. ఆ ప్రాజెక్ట్ నుంచి పవన్ తప్పుకోవడంతో మహేష్ బాబు ఈ సినిమా చేసారు.