Neha Shetty: పరవశంలో తేలిపోతున్న నేహా శెట్టి.. టిల్లు భామ అందాలకు కుర్రాళ్లు బోల్డ్..

Neha Shetty | నేహా శెట్టి గత కొన్నేళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమలో విరివిగా  వినిపిస్తోన్న పేరు. ఈమె డీజే టిల్లు సినిమాతో ఒక్కసారిగా ఓవర్ నైట్ పాపులర్ అయింది. ఆ మధ్య ‘బెదురులంక’ సినిమాతో పలకరించింది. తాజాగా టిల్లు స్వ్కేర్ మూవీలో కాసేపు అలా మెరిసింది ఈ రాధిక . ప్రస్తుతం సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్న ఈ భామ రాబోయే సినిమాలపై ఫుల్ హోప్స్ పెట్టుకుంది.

1 /6

నేహా శెట్టి.. డిజే టిల్లు వరకు ఈమె గురించి ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. ఈ సినిమా విజయం తర్వాత నేహా శెట్టికి  వరుస ఆఫర్స్ వస్తున్నాయి. అంతేకాదు సోషల్ మీడియాలో ఎప్పటికపుడు తన అంద చందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

2 /6

కన్నడ భామ అయిన నేహా శెట్టి.. టాలీవుడ్‌లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఆకాశ్ పూరీ హీరోగా నటించిన 'మెహబూబా' మూవీతో పరిచయమైంది.

3 /6

నేహా శెట్టి తన సొంత భాష కన్నడలో విడుదలైన 'ముంగారు మేల్ 2' మూవీతో  వెండితెర తెరంగేట్రం చేసింది. ఈ సినిమా ఓ మోస్తరు విజయం సాధించింది.  

4 /6

ఆ తర్వాత 'గల్లీ రౌడీ' సినిమాతో పలకరించింది నేహా. అటు అఖిల్ హీరోగా నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' మూవీలో ఓ చిన్నపాత్రలో నటించింది.

5 /6

ఇక సిద్దు జొన్నలగడ్డ టైటిల్ రోల్లో నటించిన 'డీజే టిల్లు' మూవీతో నేహా శెట్టి పేరు మారుమోగిపోయింది. ఆ తర్వాత 'బెదురులంక 2012', రూల్స్ రంజన్ మూవీలో నటించింది. తాజాగా మరోసారి 'టిల్లు స్క్వేర్' మూవీతో ప్రేక్షకులను కాసేపు అలా మెరిసింది.

6 /6

ప్రస్తుతం నేహా శెట్టి ఈమె విశ్వక్‌సేన్ హీరోగా నటిస్తోన్న 'గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి' మూవీలో నటిస్తోంది. ఈ సినిమాపై ఈ అమ్మడు మంచి హోప్స్ పెట్టుకుంది.