Kavya Thapar: ‘డబుల్ ఇస్మార్ట్’ భామ కావ్య థాపర్ కు వరుసగా క్రేజీ ఆఫర్స్.. ఆ విషయంలో హద్దులు చెరిపేస్తోన్న భామ..

Kavya Thapar: కావ్య థాపర్..ప్రస్తుతం తెలుగులో గ్లామర్ కు పర్యాయపదంగా మారింది.  సినిమాల  కంటే హాట్ ఫోటో షూట్స్ లో వార్తల్లో వ్యక్తిగా నిలుస్తోంది.  అయినా.. ఈ అమ్మడి కెరీర్ కు పెద్దగా ఉపయోగపడింది లేదు. త్వరలో పూరీ జగన్నాథ్, రామ్ పోతినేని దర్శకత్వంలో తెరకెక్కిన ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీపై ఈ భామ  భారీ ఆశలే పెట్టుకుంది.

1 /7

కావ్య థాపర్.. పేరుకు పంజాబీ అయినా.. పుట్టి పెరిగింది ముంబైలోనే. ఈ ఇయర్ మాస్ మహారాజ్  రవితేజ హీరోగా నటించిన 'ఈగిల్' మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత సందీప్ కిషన్.. ‘ఊరి పేరు భైరవకోన’ సినిమాతో తన ఖాతాలతో పెద్ద హిట్ అందుకుంది. తాజాగా ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీతో పలకరించింది.  

2 /7

ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. ఏదో క్లైమాక్స్ లో కొన్ని డైలాగులు మినహా పెద్దగా ఏమి లేదు. ఇక ఈ సినిమాలో నటించిన కావ్య థాపర్ ఒళ్లు దాచుకోకుండా చేసిన స్కిన్ షో మాత్రమే ఉపయోగపడిందనే కామెంట్స్ వినబడ్డాయి.  ఇప్పటికే మిక్స్ డ్ టాక్ నేపథ్యంలో ఈ సినిమా ఏ మేరకు బాక్సాఫీస్ దగ్గర పర్ఫామ్ చేస్తుందో చూడాలి.

3 /7

కావ్య థాపర్.. తెలుగులో  'ఈ మాయ ప్రేమతో' మూవీతో  పరియయం  అయింది.తొలి చిత్రం బాక్సాఫీస్ దగ్గర పెద్దగా పొడించిందేమి లేదు. ఈ సినిమాలో  ఈ భామ అందాల ఆరబోతకు ప్రేక్షకులు ఉక్కిరి బిక్కిరి అయ్యారు.

4 /7

తెలుగు తర్వాత తమిళంలో 'మార్కెట్ రాజా MBBS' సినిమాలో నటించింది  ఈ సినిమా పెద్దగా నడవలేదు. కానీ ఈ చిత్రంలో కావ్య గ్లామర్ కు  ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

5 /7

కావ్య థాపర్ తెలుగులో సంతోష్ శోభన్ హీరోగా నటించిన 'ఏక్ మినీ కథ' సినిమాలో హాట్ ఇంటిమేట్ సీన్స్‌లో నటించి యూత్ కు నిద్ర లేకుండా చేసింది. 

6 /7

కావ్య థాఫర్ హిందీ షార్ట్ ఫిల్మ్ ‘తత్కాల్’ మూవీతో పరిచయమైంది. ఆ తర్వాత  'మిడిల్ క్లాస్ లవ్' సినిమాలో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. కానీ  పెద్దగా వర్కౌట్ కాలేదు.  

7 /7

లాస్ట్ ఇయర్ కావ్య.. విజయ్ ఆంటోని నటించిన ‘పిచ్చైకారన్ 2’ తెలుగులో ‘బిచ్చగాడు 2’ పేరుతో ఇక్కడా మంచి సక్సెస్ ను  అందుకుంది.