Heavy Rains: వాతావరణ కేంద్రం గుడ్ న్యూస్.. తెలంగాణలో ఐదు రోజుల పాటు వడగండ్ల వానలు..

Heavy rains: వాతావరణ కేంద్రం తెలంగాణకు చల్లని కబురు చెప్పింది. రానున్న మూడు రోజులలో వాతావరణం  ఒక్కసారిగా చల్లబడిపోయి, వడగండ్ల వాన కురిసే అవకాశం ఉందంటూ వెల్లడించింది. దీంతో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు సూచించారు.
 

1 /7

కొన్నిరోజులుగా భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఎండల ప్రభావం మరీ ఎక్కువగా ఉంది. ఒకవైపు ఎండలు మరోవైపు ఎన్నికలు వల్ల సమ్మర్ హీట్ ను మరింతగా పెరిగిపోయింది. ప్రజలు ఇళ్లను వదిలిబైటకు రావాలంటేనే బెంబెలెత్తిపోతున్నారు.

2 /7

ముఖ్యంగా ఉదయం పదిదాటింటే చాలు భానుడు భగ భగ మండిపోతున్నాడు. సాయంత్రం నాలుగు వరకు ఎండలు మండిపోతున్నాయి. అత్యవసరమైతే తప్ప బైటకు వెళ్లకూడదంటూ కూడా అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. ఎండలలో బైటకు వెళ్లిన కూడా జ్యూస్ లు, నీళ్లను ఎక్కువగా తాగడం చేయాలని సూచిస్తున్నారు.

3 /7

మరోవైపు తెలంగాణలోని కొన్ని జిల్లాలలో భారీగా వర్షపాతం నమోదైంది. దీంతో వాతావరణం తాత్కలికంగా చల్లబడిన కూడా తిరిగి ఎండలు అదేవిధంగా మరోసారి మండిపోతున్నాయి. దీంతో ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. ఈక్రమంలో మరోసారి తెలంగాన వాతావరణ కేంద్రం చల్లని కబురు చెప్పింది.

4 /7

తెలంగాణలో రానున్న మూడు రోజులలో వడగండ్ల వాన కురవనుందని తెలిపింది. దీని ప్రభావంతో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. ఈనెల 28,29,30 తేదీలలో హైదరాబాద్ లో వానలు కురుస్తాయనిహైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావం వల్ల బలంగా ఈదురు గాలులు కూడా వీస్తాయని తెలిపింది.

5 /7

వడగాల్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా రైతులు ఈ మధ్య కాలంలో ధాన్యం తడిసిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నో నెలల పాటు కష్టపడి పండించి, చివరకు చేతికి వచ్చేనాటికి ఇలా ధాన్యం నీళ్లపాలు కావడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.   

6 /7

మరోవైపు ఎండల వేడికి ఉక్కపోతతోసతమతమవుతున్న నగరవాసులు కాస్తంతా ఉపశమనం పొందవచ్చని భావిస్తున్నారు. కానీ అకాల వర్షాల వల్ల ఆయా కాలంలో పండే పంటలు, చేతికొచ్చిన పంటలు నీళ్లలో తడిసిపోతుంటాయి. మామిడి పండ్లు చెట్లనుంచి రాలిపోతుంటాయి. వీటికి మార్కెట్ లో ధర ఉండదు

7 /7

దీంతో కోత తక్కువ ఉండటంతో డిమాండ్ పెరిగిపోతుంది. ధరలు ఆకాశంను చేరుకుంటున్నాయి.అంతేకాకుండా.. సామాన్య, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. దీంతో రైతులు ముఖ్యంగా అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు సూచిస్తున్నారు.