Annusriya Tripathi: 'రజాకార్'లో నిజాం భార్యలో పాత్రలో నటించిన అనుశ్రియ త్రిపాఠి గురించి ఈ విషయాలు తెలుసా.. టాలీవుడ్‌లో ఇష్టమైన హీరో అతనే..


Annusriya Tripathi: చరిత్రలో తెలంగాణ సాయుధ పోరాటానికి సెపరేట్ ప్లేస్ ఉంది. ప్రజలే ఆయుధం చేతపట్టి చేసిన అసలు సిసలు పోరాటం. మన దేశానికి 1947లో  స్వాతంత్య్రం వచ్చినా.. హైదరాబాద్ సంస్థానంలోని ప్రజలకు మాత్రం  స్వతంత్య్రం లభించలేదు. ఇక్కడ మెజారిటీ ప్రజలు హిందూస్థాన్‌లో కలవాలని ఉన్నా.. హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలిస్తున్న నిజాం  మాత్రం స్వతంత్ర తుర్కిస్థాన్‌ దేశంగా చేయాలనుకున్నాడు.   ఈ నేపథ్యంలో అప్పటి చరిత్రను గుర్తు చేస్తూ గూడూరు నారాయణ రెడ్డి ఎంతో సాహోసపేతంగా 'రజాకార్' సినిమాను నిర్మించారు. అదే రేంజ్‌లో యాట సత్యనారాయణ ఈ సినిమాను డైరెక్ట్ చేసాడు. ఈ సినిమాలో కథానాయికగా అనుశ్రియ త్రిపాఠి ఒక్కసారి లైమ్‌లైట్‌లోకి వచ్చింది.

1 /6

అనుశ్రియ త్రిపాఠి మాట్లాడుతూ.. రజాకార్ అనేది తెలంగాణ నేలతల్లి కథ. ఈ చిత్రాన్ని ఆదరిస్తోన్న ప్రేక్షకులకు స్పెషల్ థాంక్స్. సినిమా చూసిన ప్రేక్షకులు ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతున్నారు. వందేమాతరం, భారత్ మాతాకీ జై అనే నినాదాలు మార్మోగుతున్నాయి. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శకుడు యాట సత్యనారాయణకు, గూడూరు నారాయణ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు.

2 /6

నేపథ్యం.. అనుశ్రియ పటేల్ మాట్లాడుతూ.. బెంగళూరులోని కాలేజ్‌లో చదివాను. అక్కడే థియేటర్స్ ఆర్ట్స్ గ్రూపులో మెంబర్‌గా ఉన్నాను. అక్కడే నటనపై ఆసక్తి ఏర్పడింది. కాలేజ్‌ కంప్లీటైన తర్వాత నేను సివిల్స్ కి చదవాలని నాన్న కోరుకున్నాను. దాదాపు మూడేళ్ళు చదువుల్లోనే వున్నాను. నటి కావాలనే కోరికతో ఈ రంగంలోకి వచ్చాను. ఈ సినిమా లో పాత్ర కోసం దర్శకుడిని సంప్రదించాను. అప్పుడు ఆయన నిజాం భార్యగా నటించే పాత్ర కోసం నన్ను తీసుకోవడం ఆనందాన్ని ఇచ్చింది. ఆ పాత్రకు నేను సరిపోతానని భావించారు.

3 /6

ఈ పాత్ర చేయడం సవాల్ గా అనిపించిందా? 'రజాకర్' సినిమాలో నిజాం భార్యగా నటించాను. ఈ సినిమాలో చాలా కీలకమైన పాత్ర.  వాస్తవ పరిస్థితులని నిజాంకు తెలియజేసే ఆ పాత్ర. కథ చెప్పినపుడు నా పాత్ర సవాల్ గా అనిపించింది. అలాగే ఇందులో వున్న ఏకైక గ్లామర్ రోల్ నాదే. ఇలాంటి బలమైన కథ, పాత్రతో నా కెరీర్ ప్రారంభం కావడంతో నా కల నెరవేరింది. ఈ పాత్ర కోసం మూడు నెలలు పాటు మెథడ్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాను. మకరంద్ దేశ్ పాండేతో లుక్ టెస్ట్ చేసి ఓకే అనుకున్న తర్వాతే నన్ను సెలెక్ట్ చేసారు. ఈ పాత్ర నా కెరీర్‌లో గొప్ప టర్నింగ్ పాయింట్.

4 /6

రజాకార్‌లో చాలా మందితో కలిసి నటించారు ఆ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది.. 'ర‌జాకార్ 'లో నటించడం గొప్ప ఎక్స్‌పీరియన్స్. ఈ సినిమాలో చాలా మంది ప్రముఖ నటులతో కలసిపని చేసే అవకాశం వుంది. బాబీ సింహ, రాజ్ అర్జున్ తో పాటు మకరంద్ దేశ్ పాండే లాంటి అద్భుతమైన యాక్టర్ తో స్క్రీన్ షేర్  చేసుకోవడం గ్రేట్ ఎక్స్‌పీరియన్స్.  వాళ్ల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను.

5 /6

ఫ్యామిలీ బ్యాక్‌ గ్రౌండ్.. నాన్న సిఏ. అమ్మ హౌస్ వైఫ్. మొదట మోడలింగ్ నుంచి కెరీర్ స్టార్ట్ చేశాను. 2018లో చత్తీస్ ఘడ్ నుంచి మిస్ ఇండియా పోటిల్లో కూడా పాల్గొన్నాను. మా అమ్మ ఒకప్పుడు మోడలింగ్ కూడా చేసేవారు. అమ్మ నుంచి మోడలింగ్ పై ఆసక్తి ఏర్పడింది. అలాగే ముందుగా చెప్పినట్లు కాలేజ్ రోజుల నుంచే నటనపై ఆసక్తి వుండేది. యాక్టింగ్‌ను ఎంజాయ్ చేస్తున్నాను.

6 /6

భవిష్యత్ లో ఎలాంటి పాత్రలు చేయాలని వుంది ? ఫేవరేట్ హీరో, హీరోయిన్స్.. మంచి కథలో ఎలాంటి పాత్ర చేయడానికైన సిద్ధంగా వుంటాను. క్యారెక్టర్స్‌తో పాటు మంచి స్టోరీ, డైరెక్టర్, ముఖ్యం. రణబీర్ కపూర్, రామ్ చరణ్ ల నటన అంటే చాలా ఇష్టం. రామ్ చరణ్‌లో  ఇంటెన్స్ ఎమోషన్ ని ఇష్టం. హీరోయిన్స్ లో ప్రియాంక చోప్రా, అనుష్క శెట్టి, కీర్తి సురేష్ ఫేవరట్. మహానటి లాంటి పాత్ర భవిష్యత్‌లో వస్తే తప్పక చేస్తాను.