Astrology Tips: కొందరు రోజుకు రెండు సార్లు స్నానం చేస్తుంటారు. ఇకసమ్మర్ వచ్చిందంటే మాత్రం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒళ్లు వేడెక్కిపోతుంటుంది. దీంతో రాత్రిపూట కూడా స్నానం చేస్తుంటారు. కానీ బాత్రూమ్ లో స్నానంచేసేటప్పుడు కొన్నినియమాలు పాటించాలని జ్యోతిష్యులు చెబుతున్నారు.
ప్రస్తుతం సమ్మర్ సీజన్ నడుస్తోంది. మార్చినెలలోనే భానుడు భగ భగ మండిపోతున్నాడు. ఇక దీన్ని బట్టి చూస్తే ఏప్రిల్, మేనెలలో ఎండలు చుక్కలు చూపిస్తాయని అర్థం చేసుకొవచ్చు. ఎండ వేడిమి నుంచి ఉపశమనం కోసం కొందరు రెండు సార్లు స్నానం చేస్తుంటారు.
కానీ కొందరు మాత్రం బాత్రూమ్ లలో నగ్నంగా స్నానంచేస్తారు. ఇలా చేయకూడదని జ్యోతిష్యులు చెబుతుంటారు. మన చుట్టు పంచభూతాలు ఉంటాయి. మనం ఏపనులు చేస్తున్న కూడా.. భూమి, నీరు, అగ్ని, గాలి,ఆకాశం ఎప్పుడు గమనిస్తునే ఉంటాయి. స్నానం చేసేటప్పుడు ఒంటిపై ఏదైన పల్చని ఆచ్ఛాదన ఉండాలని చెబుతారు..
పూర్తిగా నగ్నంగా మారి స్నానం చేయడం వల్ల మనం నీటిని అవమాన పర్చడమే అవుతుంది. సమస్త ప్రాణకోటి మనుగడకు నీరు ఎంతో అవసరం. అందుకు బాత్రూమ్ లో నగ్నంగా స్నానం చేస్తే దోషాలు చుట్టుకుంటాయంట..
కొందరు బాత్రూమ్ లలో వెళ్లారంటే చాలు.. గంటలు గంటలు స్నానం చేస్తారు. నీళ్లను వెస్ట్ చేస్తుంటారు. ట్రబ్ లలో పడుకుని నీళ్లను వెస్ట్ చేస్తారు. నీళ్లను మనం ఎలా వేస్ట్ చేస్తామో.. మన జీవితంలో సంపద కూడా అలానే కరిగిపోతుందంటారు..
అందుకు నీళ్లను మనం ఎంతో పొదుపుగా వాడుకోవాలి. బాత్రూమ్ లోకి వెళ్లగానే , పల్చని ఆఛ్చాదన వేసుకొవాలి. దిగంబరంగా కాకుండా కొద్దిగా బట్టలు ఉండేలా చూసుకొవాలి. స్నానం చేసేటప్పుడు చల్లని నీళ్లను ఒక్కసారిగా తలపై వేసుకొవద్దు. దీని వల్ల రక్త ప్రవాహంలో మార్పుల జరిగి గుండె ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది.
బాత్రూమ్ లలో స్నానం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు అనుకొని ప్రమాదాలు కూడా సంభవించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మహిళలు కూడా స్నానంచేసేటప్పుడు పైవిధంగా జాగ్రత్తలు పాటించి, దోషాలు చుట్టుకోకుండా జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)