మాల్యా జాతకం ఆ ఇద్దరి మహిళల చేతుల్లో

మాల్యా కేసులో ఇద్దరు శక్తివంతమైన బ్రిటీష్ మహిళలు కీలకపాత్ర పోషిస్తున్నారు. అందులో ఒకరు విజయ్ తరుపున న్యాయవాది క్లేర్మాంట్ గోమెరీ, మరొకరు చీఫ్ మేజిస్ట్రేట్ ఎమ్మా అర్బత్నోట్.

Last Updated : Dec 2, 2017, 01:01 PM IST
మాల్యా జాతకం ఆ ఇద్దరి మహిళల చేతుల్లో

విజయ్ మాల్యా.. పరిచయం అక్కర్లేని పేరు. లిక్కర్ సామ్రాజ్యాన్ని శాసించిన ఈ కింగ్ ఫిషర్ ఛైర్మన్ భారత్ లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు కుచ్చుటోపీ పెట్టి లండన్ లో తలదాచుకుంటున్నాడు అన్న సంగతి తెలిసిందే..! అతన్ని అప్పగించాలని భారత్ లండన్ లో కేసు పెట్టింది. సోమవారం ఆ కేసు లండన్ కోర్టులో విచారణకు రానుంది. సుమారు ఎనిమిది రోజులపాటు లండన్ న్యాయస్థానం విచారణ చేపట్టనుంది.

ఈ కేసులో ఇద్దరు శక్తివంతమైన బ్రిటీష్ మహిళలు కీలకపాత్ర పోషిస్తున్నారు. అందులో ఒకరు విజయ్ మాల్యా తరుపున న్యాయవాది క్లేర్మాంట్ గోమెరీ, మరొకరు చీఫ్ మేజిస్ట్రేట్ ఎమ్మా అర్బత్నోట్. వీరిద్దరి చేతుల్లోనే మాల్యా భవితవ్యం తేలనుంది. క్లేర్మాంట్ కు అంతర్జాతీయ క్రిమినల్ చట్టాలు, నేరస్థుల అప్పగింత మీద ఏళ్ల అనుభవం ఉంది. ఆమె బ్రిటన్ రాణి వద్ద న్యాయవాదిగా కూడా పనిచేస్తున్నారు.

చీఫ్ మేజిస్ట్రేట్ ఎమ్మా అర్బత్నోట్ కు కూడా నేరస్థుల అప్పగింత మీద ఎన్నో కేసులు విచారించింది. మాల్యాను భారత్ కు అప్పగించాలా?వద్దా? అనేది తేల్చేది ఎమ్మానే. ఆమె గతంలో 'వేల కోట్ల రూపాయలు తిరిగి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా?' అని మాల్యాను ప్రశ్నించింది. మాల్యా " నిజాలు తెలుసుకోకుండా మీరు వేల కోట్ల డబ్బుల గురించి మాట్లాడుతున్నారు" అని బదులిచ్చారు. కాగా సోమవారం విచారణా చేపట్టే కేసును భారత్ తరుఫున 'ది క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్' వాదించనుంది.

Trending News